వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2021 16వ వారం
పరమాణు సిద్ధాంతం |
---|
భౌతిక రసాయనిక శాస్త్రాల్లో పరమాణు సిద్ధాంతం అంటే పదార్థం లక్షణాల్ని వివరించే ఒక సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ప్రకారం విశ్వంలోని పదార్థాలన్నీ విభజించడానికి వీలు కాని పరమాణువులతో (Atoms) కూడుకొని ఉంటాయి. ఇది పురాతన గ్రీసు దేశంలో తత్వ శాస్త్ర భావనగా మొదలై 19 వ శతాబ్దం మొదట్లో శాస్త్రీయ పరిశోధనా పరిధిలోకి వచ్చింది.
20 వ శతాబ్దం మొదట్లో విద్యుదయస్కాంతత్వం, రేడియో ధార్మికత మొదలైన వాటిమీద పరిశోధనలు చేస్తూ, అసలు విభజించడానికి వీలులేని పరమాణువులు ఉంటాయని కనుగొన్నారు. కానీ వీటిలో కూడా ఎలక్ట్రాన్లు, న్యూట్రానులు, ప్రోటానులు అనే కణాలు కలగలిసిపోయి ఉంటాయని కూడా నిరూపించారు. పరమాణువు ఆకృతి ఎలా ఉంటుందనే విషయమై థామ్సన్ ప్లమ్ పుడ్డింగ్ నమూనా, రూదర్‌ఫోర్డ్ నమూనా, బోర్ నమూనా, క్వాంటమ్ నమూనా వంటి వివిధ సిద్ధాంతాలు వచ్చాయి. |