వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2021 20వ వారం
రక్తం |
---|
రక్తం మానవులు, ఇతర జంతువులలో కణజాలాలకు పోషకాలను, ఆక్సిజన్‌నూ సరఫరా చేసే ద్రవం. అలాగే, జీవక్రియలో భాగంగా ఉత్పత్తయ్యే వ్యర్థాలను ఆ కణజాలాల నుండి తీసుకుపోతుంది. దీన్ని నెత్తురు అని కూడా అంటారు. జీవి మనుగడకి రక్తం అత్యవసరం. రక్తానికి సంబంధించిన అధ్యయనాన్ని 'హీమటాలజీ' (Hematology) అంటారు. వైద్య పరిభాషలో రక్తానికి సంబంధించిన విషయాలకు సాధారణంగా హీమో లేదా హిమాటో అన్న పూర్వపదం ఉంటుంది. ఇది గ్రీకు భాషా పదము హైమా (రక్తం) నుండి వచ్చింది. రక్తాన్ని చూడగానే వెంటనే ఆకట్టుకునేది దాని ఎర్రటి ఎరుపు రంగు. రక్తానికి ఈ రంగునిచ్చేది రక్తంలో ఉన్న రక్తచందురం అనే ప్రాణ్యం (ప్రోటీన్). ఈ రక్తచందురాన్నే ఇంగ్లీషులో హిమోగ్లోబిన్ అంటారు. (ఇంకా…) |