వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2022 43వ వారం

రాడార్

రాడార్ (రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్) అనేది రేడియో తరంగాలను ఉపయోగించి ఒక స్థలం నుండి వస్తువుల దూరం (పరిధి), కోణం, రేడియల్ వేగం మొదలైనవాటిని తెలుసుకునే పద్ధతి. ఇది విమానం, నౌకలు, అంతరిక్ష నౌకలు, గైడెడ్ క్షిపణులు, మోటారు వాహనాలు, వాతావరణ ఆకృతులు, భూభాగాలు మొదలైనవాటిని గుర్తించడానికి ఉపయోగపడుతుంది. రాడార్ వ్యవస్థలో, రేడియో లేదా మైక్రోవేవ్ తరంగ దైర్ఘ్యాలలో విద్యుదయస్కాంత తరంగాలను ఉత్పత్తి చేసే ట్రాన్స్‌మిటరు, ట్రాన్స్‌మిటింగ్ యాంటెన్నా, రిసీవింగ్ యాంటెన్నా (ఒకే యాంటెన్నాను ప్రసారం చేయడానికి, స్వీకరించడానికీ ఉపయోగిస్తారు), వస్తువుల లక్షణాలను గుర్తించే రిసీవరు, ప్రాసెసరు ఉంటాయి. ట్రాన్స్‌మిటర్ నుండి బయల్దేరిన రేడియో తరంగాలు (పల్సుల రూపంలో గానీ, నిరంతరాయంగా గానీ) వస్తువులపై పది ప్రతిబింబించి, తిరిగి రిసీవరుకి తిరిగి చేరుతాయి. దాంతో వస్తువుల స్థానాలు, వేగం గురించిన సమాచారాన్ని అందిస్తాయి.
(ఇంకా…)