వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 10వ వారం

తేజస్

తేజస్, భారతదేశం అభివృద్ధి చేసి, తయారు చేసిన యుద్ధ విమానం. డెల్టా వింగ్ కలిగిన ఏక ఇంజను తేజస్, మల్టీరోల్ లైట్ కాంబాట్ యుద్ధ విమానం. దీనిని భారత ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎడిఎ), హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) లు రూపొందించాయి. దీని ప్రధాన వినియోగదారులు భారత వైమానిక దళం, భారత నావికాదళాలు. పాతవై, వయసు పైబడుతున్న మిగ్ -21 యుద్ధ విమానాల స్థానాన్ని పూరించేందుకు, 1980 లలో మొదలుపెట్టిన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సిఎ) కార్యక్రమం నుండి రూపుదిద్దుకున్న విమానమే తేజస్. 2003 లో, ఈ యుద్ధవిమానానికి అధికారికంగా "తేజస్" అని పేరు పెట్టారు. తేజస్ తోక లేని సంయుక్త డెల్టా-వింగ్ కాన్ఫిగరేషన్‌ను, ఒకే డోర్సల్ ఫిన్‌తో కలిగి ఉంది. ఇది సాంప్రదాయ వింగ్ డిజైన్ల కంటే మెరుగైన హై-ఆల్ఫా పనితీరును అందిస్తుంది. దీని వింగ్ రూట్ లీడింగ్ ఎడ్జ్ 50 డిగ్రీల స్వీప్, బాహ్య వింగ్ లీడింగ్ ఎడ్జ్ 62.5 డిగ్రీల స్వీప్, వెనుక ఉన్న అంచు నాలుగు డిగ్రీల ఫార్వర్డ్ స్వీప్ కలిగి ఉంది. రిలాక్స్‌డ్ స్టాటిక్ స్టెబిలిటీ, ఫ్లై-బై-వైర్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్, మల్టీ-మోడ్ రాడార్, ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఏవియానిక్స్ సిస్టమ్, మిశ్రమ పదార్థ నిర్మాణాల వంటి సాంకేతికతలను తేజస్‌లో సమకూర్చారు. ఇది సమకాలీన సూపర్‌సోనిక్ పోరాట విమానాలలో అతి చిన్నది, అత్యంత తేలికైనది.హెచ్‌ఏఎల్ HF-24 మారుత్ తరువాత హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) అభివృద్ధి చేసిన రెండవ సూపర్‌సోనిక్ ఫైటర్, తేజస్. 2016 నాటికి, తేజస్ మార్క్-1 భారత వైమానిక దళం (ఐఎఎఫ్) కోసం ఉత్పత్తి జరుగుతూ ఉంది.
(ఇంకా…)