వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2024 45వ వారం
ఫిన్‌లాండ్ |
---|
ఫిన్‌లాండ్ స్కాండినేవియన్ దేశము. మూడు స్కాండినేవియన్ దేశాలలో ఇది ఒకటి. దేశ రాజధాని నగరం హెల్సింకి. ఈ దేశ అధికార భాష ఫిన్నిష్. ఫిన్లాండ్ దేశ విస్తీర్ణము 338,145 చదరపు కిలోమీటర్లు. దీనిని అధికారికంగా "రిపబ్లిక్ ఆఫ్ ఫిన్లాండ్" అంటారు. ఉత్తర ఐరోపాలో సార్వభౌమాధికారం కలిగిన దేశాలలో ఇది ఒకటి. దేశం వాయవ్య సరిహద్దులో స్వీడన్, ఉత్తర సరిహద్దులో నార్వే, తూర్పు సరిహద్దులో రష్యా ఉన్నాయి. దక్షిణ సరిహద్దులో "గల్ఫ్ ఆఫ్ ఫిన్లాండ్" తీరంలో స్కాండినేవియాలో భాగంగా ఉన్న ఫెన్నొస్కాండియా మీద ఎస్టోనియా ఉంది.
ఫిన్లాండ్ జనాభా 5.5 మిలియన్లు (2016), అత్యధిక సంఖ్యలో ప్రజలు దక్షిణ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్నారు. జనాభాలో 88.7% మంది ఫిన్నిష్ భాష (స్కాండినేవియన్ భాషలకు సంబంధం లేని యురల్ భాష) మాట్లాడేవారు ఉన్నారు. తరువాత సమూహం ఫిన్లాండ్-స్వీడిష్ శాతం (5.3%). ఐరోపాలో ఫిన్లాండ్ ఎనిమిదవ అతిపెద్ద దేశం. ఐరోపా సమాఖ్యలో అత్యంత తక్కువ జనాభా కలిగిన దేశం ఇది. ఈ దేశంలో 311 మునిసిపాలిటీలు ఉన్నాయి. ఒక స్వతంత్ర ప్రాంతం అయిన ఏల్యాండ్ ద్వీపాలలో ఇది ఒక పార్లమెంటరీ రిపబ్లిక్. గ్రేటర్ హెల్సింకి మెట్రోపాలిటన్ ప్రాంతంలో 1.4 మిలియన్ల మంది నివసిస్తున్నారు. ఇది దేశం జి.డి.పి.లో మూడో వంతు ఉత్పత్తి చేస్తుంది.
|