వికీపీడియా:కొత్తవారికి సహాయం/అవసరమైన వనరులు/కాపీహక్కుల పరిమితులు, పరిధులు
కాపీహక్కులపై ఉన్న పరిధులు, పరిమితులు దేశాన్ని బట్టి మారుతూ ఉంటాయి. సాధారణంగా భారతదేశంలో వర్తించే కాపీహక్కుల పరిధులు, పరిమితులు గురించి ఇక్కడ చర్చించుకుందాం.
- కాపీహక్కుల పరిధి
- కాపీహక్కులు అన్నవి ఇతర ఆస్తిహక్కుల్లా వాడుకోవడానికి, వారసులకు అందించడానికి, అమ్ముకోవడానికీ వీలున్నవే అయినా అవి తరతరాలుగా శతాబ్దాల పాటు వారిచేతులో ఉండే హక్కులు కావు.
- ఇలా కాపీహక్కులు చెల్లిపోయిన రచనలు, కృతులు ఎవరైనా, ఎవరి అనుమతీ లేకుండా ప్రచురించడం, అమ్ముకోవడం, అనువదించడం వగైరాలు చేయవచ్చు.
- కాపీహక్కుల పరిమితులు
కాపీహక్కులకు ఉండే పరిమితిని సముచిత వినియోగం (ఫెయిర్ యూజ్) (దీన్నే భారతీయ చట్టాల్లో ఫెయిర్ డీల్ (సముచిత వ్యవహారం) అంటారు) అని పిలుస్తారు.
- కాపీహక్కులన్నవి మిగిలిన ఆస్తి హక్కుల్లా కేవలం ఆస్తి కలిగినవారి హక్కులను కాపాడేందుకు మాత్రమే ఉద్దేశించినవి కాదు. 2016లో కాపీహక్కుల చట్టానికి సంబంధించిన కేసులో ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానిస్తూ కాపీహక్కుల ఉద్దేశం "ప్రజల మేధపరమైన జ్ఞానం వృద్ధిపొందేలా కళలు ప్రగతి సాధించేందుకు ప్రోత్సాహకరంగా ఉండాలి. కాపీహక్కులు విజ్ఞాన వికాసాన్ని పెంపొందించేందుకే తప్ప అడ్డుకునేందుకు ఉద్దేశించలేదు. ప్రజా ప్రయోజనార్థం రచయితలు, ఆవిష్కర్తల సృజనాత్మక కృషిని ప్రోత్సహించేందుకు ఉద్దేశించింది."
- కాబట్టి, పై ఉద్దేశాల కోసం ఈ కాపీహక్కులకు కొన్ని పరిమితులు ఉన్నాయి. చట్టంలో రాసిన కొన్ని ప్రయోజనాల కోసం, కొన్ని కార్యకలాలపాల కోసం కాపీహక్కుదారులను ముందుగా అనుమతి అడకుండా ఏ కృతినైనా సముచిత వ్యవహార (ఫెయిర్ డీలింగ్) పద్ధతుల్లో వాడుకోవచ్చు.