మాయాబజార్ తెలుగు చలనచిత్ర రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఒక సినిమా.
అత్యంత ప్రజాదరణ పొందిన సినిమా అన్నది అభిప్రాయం. ప్రజాదరణ అన్నదానికి కొలమానమూ లేదు.
ఈ చిత్రం ఆంధ్ర దేశమంతటా 1957, మార్చి 27 వ తేదీన విడుదలై అద్భుత విజయం సాధించింది.
ఆంధ్రదేశమంతటా అంటే ఎన్ని కేంద్రాలు? అద్భుతం, అపురూపం వంటి పదాలు కేవలం ప్రశంసలు, వీటిని పీకాక్ టర్మ్స్ అంటారు. వీటిని వాడకూడదు.
2017 మార్చి నాటికి 60 ఏండ్లు పూర్తిచేసుకొన్న ఈ సినిమాపై వివిధ టెలివిజన్ ప్రసార వాహినులు (ఛానళ్ళు), వార్తా పత్రికలు ప్రముఖంగా ప్రత్యేక వ్యాసాలు అందించాయి.
షావుకారు, పాతాళభైరవి, మిస్సమ్మ, జగదేకవీరుని కథ, గుండమ్మ కథ లాంటి జనరంజక చిత్రాలను నిర్మించిన విజయా సంస్థ తెలుగు సినీ అభిమానులకందించిన మరొక అపురూప కళాఖండం ఇది.
కళాఖండం వంటి పదాలు కూడా నేరుగా వికీపీడియా వ్యాసమే చెప్పకూడదు. ఎవరైనా విశ్లేషకుడు కళాఖండం అన్నట్టు మూలాలు, ఆధారాలతో చెప్పవచ్చు కానీ నేరుగా వికీపీడియానే చెప్పడం సరికాదు.
భక్త పోతన, యోగి వేమన, గుణసుందరి కథ, పాతాళ భైరవి, దొంగరాముడు మొదలగు చిత్రములను రూపొందించిన కె వి రెడ్డి ఈ చిత్రానికి కూడా దర్శకుడు.