వికీపీడియా:కొత్తవారికి సహాయం/అవసరమైన వనరులు/స్వేచ్ఛా లైసెన్సులు
- కాపీహక్కు దారులకు తమ కృతుల మీద ఈ హక్కులు ఉంటాయి: 1. పంచుకోవడం 2. దాని మీద పనిచేసి వేరేది సృష్టించడం (ఉదాహరణకు అనువాదాలు చేయడం, రచనలో ఓ పాత్రను వేరే రచనలో వాడుకోవడం, సీక్వెల్స్ రూపొందించడం, వగైరా) 3. మార్పుచేర్పులు చేయడం 4. అమ్ముకోవడం, ఉచితంగా అందించడం 5. సృష్టికర్తగా మీ పేరు ప్రస్తావించడం.
- కాపీహక్కులు అన్నీ తమ వద్దే ఉంచుకుంటే వాడుకునేవారు ముందస్తు అనుమతి లేకుండా పంచుకునేందుకు కూడా వీలుండదు. కాబట్టి, స్వేచ్ఛగా విజ్ఞానాన్ని పంచుకోవడానికి వీలిచ్చేందుకు కొందరు స్వేచ్ఛా విజ్ఞాన ఉద్యమకారులు లైసెన్సులు తయారుచేశాయి.
- వాటన్నిటిలో బాగా ప్రాచుర్యం పొందినవి క్రియేటివ్ కామన్స్ తయారుచేసిన లైసెన్సులు. వికీపీడియాలోనూ ఎక్కువగా వీటినే వాడతారు.
- క్రియేటివ్ కామన్స్ స్వేచ్ఛా లైసెన్సులు
వికీపీడియాలోనూ, సోదర ప్రాజెక్టుల్లోనూ వాడదగ్గవి
- క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్ - CC-BY: కాపీహక్కులు ఉన్నవారు ఈ లైసెన్సులో తమ కృతిని విడుదల చేస్తే ఎవరైనా అనుమతి అవసరం లేకుండా పంచుకోవచ్చు, రీమిక్స్ చేయవచ్చు, మార్చవచ్చు, దాని ఆధారంగా మరో కృతి రూపొందించవచ్చు. ఈ కృతిని వాణిజ్యపరంగా వాడుకోవచ్చు, అంటే సూటిగా చెప్పాలంటే ప్రచురించి అమ్ముకోవచ్చు. ఒకే ఒక్క షరతు ఏమిటంటే కృతికర్త పేరును ఫలానా వారిది ఈ కృతి అని ప్రస్తావించవచ్చు.