వికీపీడియా:గూగుల్ అనువాద వ్యాసాలు/అర్జున సమీక్ష

సమీక్ష పట్టిక

మార్చు
వ్యాసం (శాశ్వత లింకు) వికీ వ్యాస అకర్షణ (1-చాలా బాగుంది),(2-బాగుంది), (3-చాలా మార్పులు అవసరం) వ్యాఖ్యలు
సాహసకృత్యం 3 అక్షర దోషాలు (సహస?) మరియు ఇంగ్లీషు లిప్యాంతరీకరణ పదాలు హలాంతంతో వచ్చినప్పుడు తరువాత తెలుగు అక్షరానికి ఖాళీ వుంచటం మంచిది. జాబితాలు తెలుగుకి అనువదించటం అననసరం. భారతదేశానికి సంబంధించిన సాహసికులు (మాతాహరి?) లాంటి వారిని పేర్కొంటే సరిపోతుంది.
క్రైస్తవుడు 2 వ్యాసంలో మూసలు ఎరుపుగావున్నవి తొలగించాలి లేక వాటిని తెవికీలోకి మార్చాలి. న్యూ టెస్టమెంట్ కి కొత్త నిబంధన అని వాడితే బాగుంటుంది. ఇంగ్లిషు పుస్తకాలను ఉల్లేఖించినప్పుడు వాటిని కోట్ మార్కులలో పెట్టాలి.
అహ్మద్ పటేల్ 3 నాణ్యతలేని మూల వ్యాసాన్ని ఎన్నుకోవటం సమస్య. కనీసం బొమ్మకూడాలేదు. తెలుగు రాజకీయాలకు అంత సంబంధంలేదేమో(?)
రాయితీ 1 పర్యావలోకనం బదులుగా అవలోకనం లేక విహంగవీక్షణం బాగుంటుందేమో
బారామతి 2 ఫొటో కామన్స్ కు అప్లోడ్ చేసి తెలుగు వ్యాసంలో కనబడేటట్లువుంటే బాగుండేది. ఈ వ్యాసం మరాఠీ వికీలో నాణ్యంగా లేదు. వ్యాసాలు ఎన్నుకునేటపుడు, వాటి స్వంత వికీలోని నాణ్యత చూసి చేస్తే బాగుంటుంది.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగుళూరు 3 చాలా ఇంగ్లీషు పాఠం తెలుగు లిపిలో రాయబడినది. & లాంటివి వాడారు. బొమ్మలు కామన్స్ లోకి మార్చి వాడాలి. మూసలు వాడాలి.
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా 2 తెలుగు పదాల వాడుక చాలా వరకు బాగుంది. అయితే కొన్ని చోట్ల కృతకంగా వుంది.(పై అధికారి కి రిపోర్టు చేయడాన్ని నివేదించటం). చాలా పొడుగు పేరాలు చదివే ఓపికని పరీక్షిస్తాయి. ఇంగ్లిషు క్లుప్తపదాలు అదే లిపితో(PF) వాడటం బాగాలేదు. అలా చేయడంఒక్క సాంకేతిక రంగం వ్యాసాలకు మాత్రమే సరిపోతుంది. కనీసం బొమ్మ లేక లోగో లేకపోతే అంత చదివే ఆకర్షణ వుండదు. లింకులు ప్రస్తావన <ref>..</ref> వాడిచేస్తే మంచిది
గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం
గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం
గడి పాఠ్యం గడి పాఠ్యం గడి పాఠ్యం

గూగుల్ పథకం మెరుగుకు సలహాలు

మార్చు

తమిళ సంప్రదింపులు ద్వారా మెరుగైన పద్ధతిని అమలు చేయటం. దానితో యిక్కడ యిచ్చిన సలహాలతో ఏమైనా సంఘర్షణలుంటే, వాటిపై చర్చించి నిర్ణయానికిరావడం.

  1. వ్యాసాల ఎంపికకు భారతీయ అంశాలు ప్రధాన ప్రాతిపదిక కావటం. వీటికోసం ఇంగ్లిషు వికీలో భారతీయ వ్యాసాలు ముఖ్యంగా తీసుకొని, వాటి మాతృ వికీలో నాణ్యతను కూడా చూసుకొని ఎంపికచేయడం
  2. వ్యాస అనువాద పరిధి తెలుగు స్థానికతకు దగ్గరిగా వుండాలి. మక్కీకిమక్కి అనువాదాలు కూడదు.
  3. ఎరుపు లింకులు కనీస స్థాయిలో వుండేటట్లు చూడటం
  4. బొమ్మలు వున్న వ్యాసాలను ఎంచుకోవడం, అవసరమైతే అవి తెలుగులో కనిపించడానికి వాటిని కామన్స్లోకి మార్చడం
  5. వ్యాసఅనువాదకులు గూగుల్ పని చేసేముందు స్వతహాగా తెవికీలో ఐదు-పది అంశాలు పై ఒక నెలరోజులు పనిచేయటం మంచిది. అనువాదంలో అనుభవాన్ని కలిగివున్నట్లుగా రుజువులు కలవారిని తీసుకోవాలి.
  6. ఈ సూచనలు ప్రకారం వ్యాసం తెవికీలో విడుదల చేయబోయేముందు, సమీక్ష చేయటానికి ప్రత్యేక వ్యవస్థ గూగుల్ కల్పించుకోవాలి. ఎందుకంటే తెలుగు వికీపీడియన్లులో క్రియాశీలకత చాలినంతగా లేదు మరియు వున్నవారు కూడా స్వంతంగా వ్యాసాలు రాయటానికి లేక వారికిష్టమైన నిర్వహణ బాధ్యతలు మాత్రమే తీసుకుంటున్నారు. అలాజరుగుతున్నట్లు వికీపీడియన్లకి తెలియుటకు, మొదటి ప్రతిని వ్యాస అనువాదకుడి పేరుస్థలంలో చేసి మార్పులు తరవాత దానిని ప్రధాన పేరుస్థలంలోకి మార్చటం. ఈ వ్యక్తి గూగుల్ ద్వారా ప్రతిఫలం పొందుతున్నా, తెవికీ ఆశయాలకు, వ్యాసాల నాణ్యతా నియమాలకు కట్టుబడి పనిచేయాలి. ప్రజాహిత పనులు జరుగుతున్న పద్ధతులలో ఇలాంటి విధానం సామాన్యమే. ఉదా:విమానాల తయారీ సంస్థలు, వారు ఉత్పత్తి చేసే హార్డ్వేర్, సాఫ్ట్వేర్ నాణ్యతకు DER (Designated Engineering Representative)అనే వ్యక్తిని నియమిస్తాయి.ఆ వ్యక్తి ఆ సంస్థనుండి జీతభత్యాలు పొందుతున్నా FAA (Federal Aviation Administration) నియంత్రణ సంస్థ విధి విధానాలకు లోబడి ఆ నియంత్రణ తరపున వ్యక్తిగా పనిచేస్తారు. ఇలాగే స్వేచ్ఛామూలాలలో పనిచేసే వ్యాపార సంస్థలు, కొంత మంది స్వేచ్ఛామూలాలకు పనిచేసే ఉద్యోగులను నియమిస్తారు (ఉదా:రెడ్హాట్ ఇండియాలో భాషానువాదకులు పనిచేస్తున్నారు. వారు చేసే పని స్వేచ్ఛామూలాలకు చేరుతుంది) పొరుగు ఉద్యోగులపై పూర్తిగా అధారబడినట్లుకనబడుతున్నది. గూగుల్ ఉద్యోగులు వారి కంపెనీ విధానం ప్రకారం వుండే 10శాతమో 20 శాతము సమయం దీనికి ఖర్చుచేస్తున్నారని నేను ఇంతకుముందు హాజరైన సమావేశాలలో గూగుల్ వారు తెలియచేశారు. అలాంటి వారు, వారి విచక్షణప్రకారం పని చేస్తారు. తెవికీలో నిజంగా ఆసక్తిగల వారు దీనిని నిర్వహిస్తున్నట్లు కనబడలేదు. అలాంటి వారు వుంటే ఈ పాటికి వారు స్వంతంగా తెవికీలో చేసిన రచనలు తెలియచేయాలి.
  7. గూగుల్ తమ స్వంత సంస్థ ప్రయోజనమే ప్రధానంగా ఈ పని చేపట్టినట్లు అనిపిస్తున్నది. అలాకాదని తెలియచెప్పటానికి తెవికీ నిర్వహణకి కావలసిన భాధ్యతలలో కొన్నింటిలో పాలుపంచుకుంటే తెవికీ సభ్యులు, వాడుకదారులలో సంబంధాలు మెరుగవతాయి.
  8. ఒక్కొక్క వ్యాసంలా పనిని చూడకుండా, ఒక వర్గంలో తెవికీ వ్యాసాలలో బలహీనతలు ఏమున్నాయి కనుక్కొని,వాటిని పూరించటానికి ఇంగ్లిషు వికీ నుండి అనువాద వ్యాసాలు ఏ విధంగా ఉపయోగపడతాయో విశ్లేషించి పనిచేస్తే, గూగుల్ అనువాద వ్యాసాల నాణ్యత మరింత మెరుగపడటానికి (సరైన వర్గాలలో చేర్చటం,వ్యాసాల మధ్య లింకులు ఏర్పరచటం లాంటివాటివలన) వీలవుతుంది. ఉదా: నేను చేపట్టిన వికీపీడియా:WikiProject/విద్య, ఉపాధి ప్రాజెక్టు చూడండి. ప్రస్తుతమున్న వ్యాసాల సంఖ్య, పదాల సంఖ్యనే నాణ్యత కొలమానంగా ఎంచుకుంటే, తెవికీ మౌలిక నాణ్యత దెబ్బతినే అవకాశముంది.