వికీపీడియా:గ్రామ వ్యాసాలు-తాడేపల్లిగూడెం మండలం నమూనా అధ్యయనం
గ్రామ వ్యాసాల చరిత్ర
మార్చుగ్రామాల వ్యాసాల సృష్టి ఈ కింది విధాలుగా జరిగింది:
- తెలుగు వికీపీడియాలో గ్రామ వ్యాసాలు వికీపీడియా ప్రారంభమైన రెండు, మూడేళ్ళలోపే బాట్ ద్వారా తయారుచేసుకున్నాం. వాటిపై మానవీయంగా చాలామంది వికీపీడియన్లు ఈ పదేళ్ళలో ఎంతగానో కృషిచేశారు. వీటికి చాలామంది ఐపీ అడ్రస్ దారులు వచ్చి మార్పుచేర్పులు చేయడమూ వుంది.
- ఆపైన మరికొందరు ఐపీ అడ్రస్ ఉన్నవారు, కొత్త సభ్యులు, అనుభవజ్ఞులైన సభ్యులు పై బాట్ సృష్టి ద్వారా సృష్టించని వ్యాసాలను సృష్టించారు. వాటిని విస్తరించడం, వర్గీకరించడం, మూసల్లో చేర్చడం కూడా అరుదే.
పరిశీలన లక్ష్యం
మార్చుఈ గ్రామాల వ్యాసాల విషయంలో ప్రస్తుత పరిశీలన లక్ష్యం చేసుకున్నది ఒక ముఖ్యమైన ప్రశ్నను సమాధానమివ్వడానికి. మూసలో లేని గ్రామాలు, భారత ప్రభుత్వం వారి వెబ్సైట్లో పొందుపరచని గ్రామాలు ఎలా వచ్చాయి అన్న ప్రశ్న అది.
తాడేపల్లిగూడెంలో ఉన్న గ్రామాలు, వాటి వ్యాసాలు
మార్చు- మూస:తాడేపల్లిగూడెం మండలంలోని గ్రామాలులో 22 గ్రామాలు కనిపిస్తున్నాయి.
- వర్గం:తాడేపల్లిగూడెం మండలంలోని గ్రామాలులో 27 గ్రామాలు కనిపిస్తున్నాయి. వీటిలో ఒక గ్రామం మిలిటరీ మాధవరం అన్నది మాధవరం (తాడేపల్లిగూడెం) గ్రామానికే మరో పేరు. అలానే లింగారాయుడు గూడెం గ్రామం హేమ్లెట్. మిలటరీ మాధవరం, లింగారాయుడు గూడెం వ్యాసాలు మన గ్రామ వ్యాసాల బాట్ తయారుచేసినవి కావు. ఔత్సాహిక సభ్యుడు 2016లో రాసినదొకటి, 2006లోనే ఓ ఐపీ రాసినది మరొకటి. కాబట్టి 25 గ్రామ వ్యాసాలు నికరం.
- నిజానికి తాడేపల్లిగూడెం మండలంలో 2000 నాటికే ఉన్న పంచాయితీ గ్రామాల సంఖ్య 31. మనం ఆరు పంచాయితీ గ్రామాలను సృష్టించలేదు. ఆ పంచాయితీ గ్రామాల పేర్లు ఇవి:
- వీటికి అనుబంధమైన శివారు గ్రామాలు (లేక హేమ్లెట్లు) మరికొన్ని ఉన్నాయి. వాటిలో ప్రధానమైనవి:
- వీటిలో వర్గీకరణలోనూ, మూసలోనూ, తాడేపల్లిగూడెం పేజీలోని జాబితాలోనూ కూడా లేని శివారు గ్రామ వ్యాసం క్రిష్ణా పురం కూడా 2016 ఆగస్టులో తయారైంది. క్రమంగా వర్గీకరణ పొందుతుంది.
- ఇక రెవెన్యూ గ్రామాలు : తాడేపల్లి, వీరంపాలెం, కూనవరం, కొమ్ముగూడెం, కడియద్ద, వెంకట్రామన్నగూడెం, జగ్గన్నపేట, పడాల, కుంచనపల్లి, కొండ్రుప్రోలు, ఆరుగొలను, నందమూరు, ఆరుళ్ళ, కృష్ణాయపాలెం, నవాబ్ పాలెం, జగన్నాథపురం, మాధవరం, అప్పారావుపేట అన్న 18. (వీటికి చేరి అర్బన్ రెవెన్యూ విభాగమైన తాడేపల్లి గూడెం కూడా ఉంది. ఈ తాడేపల్లిగూడెంలోనే మూడు రెవెన్యూ విభాగాలున్నాయి)
గ్రామాల వర్గీకరణ
మార్చుప్రభుత్వ పరంగా గ్రామాలను పలు విధాలుగా వర్గీకరిస్తారు. వాటిలో ప్రస్తుతం మన పరిశీలనకు ముఖ్యమైన వర్గీకరణ వివరిస్తున్నాను.
- ప్రజాపాలన పరమైన వర్గీకరణ లేక స్థానిక పాలన పరమైన వర్గీకరణ: ఈ వర్గీకరణలోకి ఈ కిందివి వస్తాయి.[1]
- పంచాయతీ గ్రామాలు: మేజర్ పంచాయతీలు వంటి ఉప వర్గీకరణలు దీంట్లో ఉంటాయి.
- శివారు గ్రామాలు లేక హేమ్లెట్లు: ఈ గ్రామాలు వేరే పంచాయితీలో అంతర్భాగంగా ఉంటాయి. చిన్న జనావాసాలు కావడం ప్రధాన కారణంగా, మరి ఇతర రాజకీయ, సామాజిక కారణాల వల్ల వీటిని శివారు గ్రామాలుగా వర్గీకరిస్తున్నారు. ఇవి క్రమంగా పెరిగి, పంచాయితీ గ్రామాలు అవుతూంటాయి.
- రెవెన్యూ గ్రామాలు: ఇది దాదాపుగా ప్రభుత్వ రెవెన్యూపరమైన విభజన.
భేదాలకు కారణం
మార్చుఆంగ్ల వికీపీడియాలో తాడేపల్లిగూడెం మండలాన్ని పరిగణించేప్పుడు రెవెన్యూ గ్రామాలనే లెక్కించారు. అంటే 18 రెవెన్యూ గ్రామాలనే పరిగణించి, మిగతావి విస్మరించారనుకోవాలి. ఇక్కడ వారి లిస్టు చూడవచ్చు. 19 సెటెల్మెంట్లు, వాటిలో 18 గ్రామాలు, 1 టౌన్ అని రాశారు. ఐతే సెటిల్మెంట్ అన్న పదం కానీ, విలేజ్ అన్న పదం కానీ పైన ప్రస్తావిస్తున్న విభజనల్లో ఏ విధమైన సెటిల్మెంట్ అన్నది స్పష్టం చేయట్లేదు. వారు తీసుకున్న మూలం సెన్సెస్ లోని అట్లాస్ లో అలానే ఉండడంతో వారు అలాగే ప్రతిబింబించేశారు. అట్లాస్ లోని 388వ పేజీలో తాడేపల్లిగూడెం మండలాన్ని చూపేప్పుడు 18 గ్రామాలు, 1 పట్టణాన్నే చూపిస్తున్నాయి. ఇవి రెవెన్యూ విభాగాలే. 420 పేజీ పరిశీలించినా ఆ రెవెన్యూ గ్రామాల లిస్టే ఇచ్చారు.
ఫలితం యొక్క సారాంశం
మార్చుమనం బాట్ ద్వారా సృష్టించేందుకు స్వీకరించింది పంచాయితీ గ్రామాలు. పెద్ద ఎత్తున చేసిన గ్రామాల సృష్టిలో పంచాయితీ గ్రామాలకు వ్యాసాలు చాలావరకూ సృష్టించారు. అలానే ఆపైన కొందరు వికీపీడియన్లు స్వత: ఆసక్తితో శివారు గ్రామాల వ్యాసాలు కూడా సృష్టించారు. ఐతే ఆంగ్ల వికీలో రాస్తున్నది రెవెన్యూ గ్రామాలు.
ఇందువల్లనే ఆంగ్ల వికీపీడియాలోని సమాచారం, వారికి ఆధారమైన సెన్సెస్ వారి ఒకానొక పుస్తకంలో ఒక సంఖ్యలోనూ, తెలుగు వికీపీడియాలోని గ్రామాల సంఖ్య మరో విధంగానూ వస్తున్నాయి. ఇది వేర్వేరు ప్రామాణాలు స్వీకరించడమే తప్ప తప్పు సమాచారం అని భావింలేమని ఈ అధ్యయనం ద్వారా అనిపిస్తోంది.
ఇవి చూడండి
మార్చు- ↑ ఆకిన, వెంకటేశ్వర్లు; Shigetomi, Shinichi (2014). "Common Fund Procurement through Rent Collection: A Form of Collective Action for Public Works and Public Services in Indian Villages". In Shigetomi, Shinichi (ed.). Local societies and rural development : self-organization and participatory development in Asia (in ఆంగ్లం). ఎడ్వర్డ్ ఎల్గార్ పబ్లికేషన్స్. p. 165. ISBN 9781783474370. Retrieved 15 August 2016.
ఈ అధ్యాయంలో హేమ్లెట్, రెవెన్యూ, పంచాయతీ గ్రామాల విభజన వివరించారు.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link) - ↑ http://archive.andhrabhoomi.net/content/p-1383
- ↑ http://www.navatelangana.com/article/medak/258034