మాధవరం (తాడేపల్లిగూడెం)

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం లోని గ్రామం

మాధవరం, పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లిగూడెం మండలానికి చెందిన గ్రామం.[1]. దీనికి మిలట్రీ మాధవరం అని కూడా పేరు. ఘనమైన గత చరిత్ర ఈ గ్రామం సొంతం. బ్రిటీష్ ఏలుబడిలో ఉన్న సమయంలోనే ఈ గ్రామం నుంచి అనేక మంది యువత సైన్యంలో ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు. అందులో కొందరు అమరులయ్యారు. వారి స్మారకార్థం గ్రామంలోని చెరువు గట్టున ఓ స్మారకస్థూపం కూడా ఏర్పాటు చేశారు. ప్రపంచీకరణతో ఈ గ్రామం నుంచి అనేక మంది అనేక దేశాలకు వెళ్లి స్థిరపడిపోయారు. ఈ గ్రామంలో ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒక్కరైనా సైన్యంలో ఉంటారంటే అతిశయోక్తి కాదు. అందుకే మిలట్రీ మాధవరం పేరు సార్థకనామధేయంగా మిగిలింది. మంచి విలువలు కలిగిన విద్యా వ్యవస్థ ఈ గ్రామానికి మణిహారం. జూనియర్ కాలేజి వరకు ఇక్కడ విద్యా సౌకర్యాలున్నాయి.

మాధవరం చరిత్రసవరించు

17వ శతాబ్దంలో ఈ గ్రామం ఏర్పడినట్టుగ ఆధారాలు ఉన్నాయి. అప్పటి ఒడిషా, డెక్కన్ ప్రాంతాలను పరిపాలించే గజపతి వంశానికి చెందినా పూసపాటి మాధవ వర్మ బ్రహ్మ తన రాజ్య రక్షణ కోసం ఈ గ్రామానికి సుమారు 6 కీ.మీ దూరంలో ఉన్న అరుగొలను గ్రామంలో ఒక కోటను నిర్మించి, ఉత్తర ఆంధ్ర నుంచి సేన్యాన్ని ఇక్కడుకు రప్పించి వారికీ సాగు భూమి, ఇళ్ళ స్థలాలు ఇచ్చారు. అరుగొలను గ్రామంలో ఇప్పటికి ఆ కోట శిథిలాలు ఉన్నాయి. ఈ సైనికులు మాధవరం గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆనాటి నుండి ఈ గ్రామంలోని వాళ్ళు అందరు సైన్యంలో చేరుతూ వచ్చారు. తరతరాలుగ దేశరక్షణ తమ ధ్యేయం జీవిస్తున్నారు. బ్రిటిష్ పరిపాలనలో భారతదేశం తరుపున మొదటి, రెండవ ప్రపంచ యుద్ధంలో సుమారు రెండువేల మంది పాల్గొన్నారు.[2][3][4]

గాంధీ మహాత్మడు స్వతంత్రియోద్యమం కొరకు భారత దేశ సంచారము చేస్తున్నప్పుడు ఈ గ్రామానికి వచ్చారు అని అక్కడి వృద్ధులు చెబుతారు. ఈ గ్రామంలో సైనికుల గౌరవ చిహ్నంగ ఇండియా గేటు దగ్గర ఉన్న అమర్ జవాన్ స్తూపం పోలిన ఒక స్థుపాన్ని ఇక్కడ నిర్మించారు.

ముఖ్య వృత్తులుసవరించు

మాధవరం గ్రామ ప్రజలుకు మిలిటరీ తరువాత వ్యవసాయం ముఖ్య వృత్తి. వరి, చెరకు ముఖ్య పంటలు.

విద్య కేంద్రాలుసవరించు

మాధవర గ్రామంలో ఒక ప్రాథమిక పాఠశాలా, ఒక జిల్లా పరిషత్ హై స్కూల్, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటితో పాటుగా ఒక మిషనరీ కాన్వెంట్, ఒక ప్రైవేటు స్కూల్ కూడా ఉన్నాయి.

దేవాలయాలుసవరించు

మాధవరం గ్రామంలో పోలరమ్మ గుడి, శివాలయం, వెంకటేశ్వర ఆలయం, వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం, కుమారస్వామి ఆలయం, వైష్ణవ ఆలయం ఉన్నాయి. పోలేరమ్మ గుడి ఆ చుట్టుప్రక్కల గ్రామాలలో మంచి ప్రాచుర్యం పొందిన ఆలయం.

పండుగలు, జాతరలుసవరించు

దక్షిణ భారతదేశములో జరుపుకునే అన్ని పండుగులు ఇక్కడ ఘనంగ జరుపుకుంటారు. ముఖ్యంగా గ్రామా దేవత అయిన పోలేరమ్మ జాతర ఇక్కడ ఎంతో భక్తీ శ్రద్ధలతో ఘనంగా జరుపుకుంటారు. ఈ జాతరకి పక్క ఉళ్ళ నుంచే కాక కర్ణాటక రాష్ట్రము నుంచి కూడా భక్తులు పాల్గొంటారు.

రవాణాసవరించు

తాడేపల్లిగూడెం నుంచి ఈ గ్రామానికి APSRTC వారి బస్సు సర్వీస్ ద్వారా చేరుకొనవచ్చు. దగ్గరలో ఉన్న రైల్వే స్టేషను తాడేపల్లిగూడెం.

మిలిటరీ మాధవరంసవరించు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము లోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలంలో మాధవరం గ్రామం ఉంది. ఇది తాడేపల్లిగూడెం పట్టనణానికి 12 కీ మీ ల దూరంలో ఉంది. ఈ గ్రామన్ని చుట్టుప్రక్కల గ్రామాలు వారు మిలిటరీ మాధవరం అని పిలుస్తారు. ఈ గ్రామంలో నివసించే ప్రతి కుటుంబంలో కనీసం ఒకరు మిలిటరీలో ఉండటమే అ పేరుకి కారణం. మొదటి, రెండవ ప్రపంచం యుద్ధలలలో ఈ గ్రామం నుంచి సుమారు రెండు వేల మంది పాల్గొన్నారు. తోంభయి ఒక్కమంది అసువులు బాసారు. ఈ గ్రామంలో ప్రతి ఒక యువకునికి మిలిటరీలో చేరడం అంటే ఒక ఆశయం.

మూలాలుసవరించు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-14. Retrieved 2015-09-09.
  2. http://www.hindu.com/2011/01/27/stories/2011012754320700.htm
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-08-28. Retrieved 2015-04-04.
  4. https://www.youtube.com/watch?v=3M2ceN7Cjb8