వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబర్ 2
(వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/నవంబరు 1 నుండి దారిమార్పు చెందింది)
- 1938: అమెరికన్ మితవాద రాజకీయ వ్యాఖ్యాత, రచయిత, సిండికేటెడ్ కాలమిస్ట్, రాజకీయవేత్త పాట్ బుకానన్ జననం.
- 1941: భారతీయ విలేఖరి, రచయిత, రాజకీయవేత్త అరుణ్ శౌరి జననం.
- 1950: ఐర్లాండుకు చెందిన రచయిత జార్జి బెర్నార్డ్ షా మరణం (జ.1856).
- 1956: రంగస్థల కళాకారిణి రాజ్యం. కె జననం.
- 1962: రచయిత, తెలుగు సినిమా దర్శకుడు త్రిపురనేని గోపీచంద్ మరణం (జ. 1910).
- 1965: భారతీయ నటుడు, చలన చిత్ర నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత షారుఖ్ ఖాన్ జననం.
- 1976: భారత రాజ్యాంగం యొక్క 42వ సవరణ ను లోక్సభ ఆమోదించింది.
- 1984: సర్వోదయ కార్యకర్త, కావూరులోని వినయాశ్రమం వ్యవస్థాపకురాలు తుమ్మల దుర్గాంబ మరణం (జ.1907).