వికీపీడియా:తనిఖీ పనులు
వికీపీడియా వృద్ధి చెందే క్రమంలో రకరకాల అసంగతాలు, దోషాలు, వైరుధ్యాలవంటి లోపాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా భాషలో, సమాచారంలో, ఆకృతిలో, శైలిలో ఇవి ఉంటూంటాయి. కొత్తగా చేరిన వాడుకరులకు తెవికీ విధానాలు తెలియక ఈ లోపాలు జరగవచ్చు, కొందరు కావాలని దురుద్దేశంతో దోషాలను ప్రవేశపెట్టవచ్చు, భాష గురించి అంతగా అవగాహన లేని వాడుకరుల వలన ఈ లోపాలు దొర్లవచ్చు. ఇతర కారణాలూ ఉండవచ్చు.
ఈ లోపాలను సరిచేసుకుంటూ, సవరించుకుంటూ, వికీపీడియాను ఎప్పటికప్పుడు మెరుగుపరచుకుంటూ ముందుకు సాగిపోతుంది. వాడుకరులు ఆయా లోపాలపై దృష్టి పెట్టి వెంటనే వాటిపై చర్య తీసుకుంటూ ఉంటారు. ఈ లోపాల వివరాలు, వాటిని ఎలా తెలుసుకోవాలి, ఎలా సవరించాలి అనే విషయాలను ఈ వ్యాసం వివరిస్తుంది.
వివిధ లోపాలు, వాటి సవరణలు
మార్చువాడుకరులు గమనిస్తూ ఉండవలసిన వివిధ లోపాలు ఇలా ఉన్నాయి
భాషా దోషాలు
మార్చుఅక్షర దోషాలు: ఓపిగ్గా ఫఠ్యమంతా చదూకుంటూ దోషాలను సవరించాలి. ఆటోవికీబ్రౌజరు ద్వారా ఈ దోషాలను సవరించడం తేలిక గాను, వేగం గానూ చెయ్యవచ్చు. వికీపీడియా:AutoWikiBrowser/Typos పేజీలో అనేక రకాలైన భాషాదోషాలను, ముఖ్యంగా అక్షరదోషాలను, నమోదు చేసారు. ఆటోవికీబ్రౌజరును తెరిచి, అందులో options ట్యాబులోని Regex typo fixing ను ఎంచుకుంటే, ఇక పై పేజీలో నమోదు చేసిన తప్పులన్నిటినీ సవరించుకుంటూ పోవచ్చు.
కృతక భాష: అనువాద వ్యాసాల్లో ఈ కృతకభాష ఎక్కువగా ఉంటుంది. వ్యాకరణ దోషాలు కూడా ఉంటాయి. యంత్రం చేసిన అనువాదాన్ని ప్రచురించే ముందు పరిశీలించి సవరణలు చేస్తే ఈ సమస్య ఉండదు. ఈ దోషాలను సవరుఇంచలేని పరిస్థితి ఉంటే వ్యాసంలో పైన {{కృత్రిమ భాష}} అనే మూసను చేర్చండి.
అనువాద దోషాలు: వేరే భాష నుండి అనువదించేటపుడు మూలంలోని అర్థాన్ని చెడకుండా అనువదించాలి. సరిగ్గా అనువదించని పక్షంలో అర్థం మారిపోయే ప్రమాదం ఉంది. ఈ వ్యాసాన్ని, మూల వ్యాసాన్ని పక్కపక్కనే పెట్టుకుని పరిశీలించి దోషాలేమైనా ఉంటే సవరించాలి.
సమాచార దోషాలు
మార్చు- ఉన్న సమాచారాన్ని సవరించి వేరే సమాచారాన్ని చేర్చడం. దుశ్చర్యలు చేసేవారు ఇది ఎక్కువగా చేస్తూంటారు. మార్చిన సమాచారానికి తగు, నిర్ధారించుకోగల మూలాలనిస్తే, పని తేలికైపోతుంది. ఉదాహరణకు తేదీలను మార్చడం. ఫలనావారు పుట్టినది 1923 అని ఉంటే దాన్ని 1924 ని మారుస్తారు. ఏది సరైనదో వాడుకరులకు తెలిస్తే చర్య తీసుకోవడం తేలిక. తెలియనప్పుడే సమస్య వస్తుంది. దానికి కింది పరిష్కారాలున్నాయి:
- అంతర్వికీ లింకుల ద్వారా ఇంగ్లీషు, ఇతర భాషల్లోని వ్యాసాలను పరిశీలించి, సరైన సమాచారాన్ని తెలుసుకోవడం
- జాలంలో వెతికి సరైన సమాచారాన్ని పట్టుకోవడం
- ఏమీ తెలీనపుడు, సమాచారాన్ని మార్చినది నమోదైన వాడుకరి అయితే, మీ సందేహాన్ని వారి చర్చ పేజీలో పెట్టడం. సాధారణంగా అనుభవమున్న వాడుకరులు అంత తొందరపడి సమాచారాన్ని సవరించరు, ఖచ్చితంగా తెలిస్తే తప్ప.
- ఏమీ తెలీనపుడు, సమాచారాన్ని మార్చినది ఐపీ అడ్రసు నుండి అయితే, ఈ కొత్త సమాచారాన్ని అనుమానాస్పదంగా చూడండి. మొదటి రెండు చర్యల్లో సరైన సమాచారం తెలియకపోతే, ఆ అజ్ఞాత చేసిన మార్పును తిరగ్గొట్టండి. అది తప్పై ఉండే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నట్టే. (తెవికీ అనుభవాల నుండి)
- ఇక చివరిగా, పై చర్యలేమీ తీసుకోలేని పరిస్థితులుంటే, ఆ కొత్త సమాచారం పక్కనే {{మూలాలు అవసరం}} అనే మూసను పెట్టండి. వ్యాసపు చర్చ పేజీలో రాయండి.
- విషయప్రాముఖ్యత లేని వ్యాసాలు: తగినంత ప్రాముఖ్యత లేని విషయాలకు పేజీలు సృష్టిస్తూంటారు. ప్రాముఖ్యత కొంతవరకూ వైయక్తికం కాబట్టి ఈ విషయం కొంత క్లిష్టమైనది. ఎక్కువగా వ్యక్తుల విషయం లోనే ఇది జరుగుతూంటుంది. ఇచ్చిన మూలాలు విషయ ప్రాముఖ్యతను వివరించకపోతే, {{Notability}} అనే మూసను పెట్టండి. విషయ ప్రాముఖ్యత లేదు అని ఖచ్చితంగా, సందేహాతీతంగా, నిర్ద్వంద్వంగా తెలిస్తే ట్వింకిల్ లోని సత్వర తొలగింపు (సిఎస్‌డి) ను వాడి తొలగింపుకు ప్రతిపాదించండి. మీరు నిర్వాహకులైతే.. ట్వింకిల్ లోని సత్వర తొలగింపు (సిఎస్‌డి) ను వాడి, తొలగించండి, ప్రతిపాదించనక్కర్లేదు.
ఎలా కనుక్కోవడం
మార్చుఇటీవలి మార్పులు! ఇటీవలి మార్పులు చాలా ఉపయోగపడే వికీ ఉపకరణం. కొత్త మార్పులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అనుమానాస్పదంగా ఉన్నవాటిపై తగు చర్యలు తీసుకుంటూ ఉండవచ్చు. అందులో అనేక రకాలైన సెట్టింగులు పెట్టుకోవచ్చు. ఉదాహరణకు:
- అజ్ఞాతలు చేసే మార్పులన్నీ ఒక నేపథ్యపు రంగులోను, కొత్తవారు చేసే మార్పులన్నీ మరొక రంగులోను, ఇలా వివిధ రంగులలో కనబడేలా పెట్టుకుంటే మీరు పరిశీలించాల్సిన వాటిని ఠక్కున పట్టేసుకోవచ్చు.
- మార్పులన్నిటినీ పరిశీలించాలని కాకుండా, ఏదైనా ప్రత్యేక రకానికి చెందిన మార్పులనే పరిశీలించండి. అందువలన మీ పరిశీలన పదునుగా ఉంటుంది. ఉదాహరణకు - అజ్ఞాతలు చేసే మార్పులు మాత్రమే లేదా కొత్త వాడుకరులు చేసే మార్పులు మాత్రమే లేదా కొత్తగా సృష్టించిన పేజీలు మాత్రమే,.. అలాగే ఇతర వాడుకరులు కూడా తమతమ పరిశీలనలను ఎంచుకుంటారు కాబట్టి, మొత్తం ఇటీవలి మార్పులన్నీ తనిఖీ లోకి వస్తాయి.
ఎలాంటి మార్పులు
మార్చుఫలానా రకమైన లోపాల కోసమే మీ పరిశీలనను కేంద్రీకరించవచ్చు . ఉదాహరణకు, ", " వంటి ప్రత్యేకించిన భాషాదోషాలు.
- తొలగింపు కొరకు ప్రతిపాదించిన వ్యాసాలు – తొలగింపు కొరకు ప్రతిపాదించిన వ్యాసాలను పరిశీలించి, అ పేజీల్లో అవసరమైన మార్పులు చెయ్యవచ్చు, ఆయా ప్రతిపాదనల్లో మీ అభిప్రాయాలు రాయవచ్చు.
- మూలాలు ఉన్నాయో లేదో చూసి, అవసరమైన చోట తగు మూలాలను చేర్చవచ్చు
- అయోమయ నివృత్తి పేజీలకు ఇచ్చిన లింకులను గమనించి అలాంటివి ఉంటే వాటిని సవరించవచ్చు. "ఇక్కడికి లింకున్న పేజీలు" అనే లింకుకు వెళ్ళి ఈ సంగతి తెలుసుకోవచ్చు.
- కొత్తపేజీలను తనిఖీ చెయ్యవచ్చు. ఆ పేజీల్లోని తప్పొప్పులను సవరించడమే కాకుండా, ఆయా వాడుకరులకు, వారు వికీకి కొత్తవారైతే, అవసరమైన మార్గదర్శకత్వమూ చెయ్యవచ్చు. చెయ్యాలి కూడా.
- ఇటీవలి మార్పుల్లో కొత్తగా జరిగిన దిద్దుబాట్లను పరిశీలించి తగు మార్పుచేర్పులు చెయ్యవచ్చు. అక్షర దోషాలను సరిచెయ్యవచ్చు
- వర్గాల్లేని పేజీల్లో తగు వర్గాలను చేర్చవచ్చు
- కాపీహక్కుల ఉల్లంఘన లేమైనా జరిగాయేమోనని గమనించవచ్చు
- దుశ్చర్యలు జారిగాయేమో గమనించి సవరించవచ్చు.