వికీపీడియా:తెలుగు గ్రంధాలయం, వికీ అవగాహనా కార్యక్రమం, పిఠాపురం
తెలుగు గ్రంథాలయం ప్రాజెక్టులో భాగంగా పిఠాపురం పట్టణంలో ఉన్న చారిత్రక గ్రంథాలయం అయిన సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం సందర్శన జరిగింది. దీనిలో భాగంగా గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు, పుర ప్రజలకు తెలియజేయడానికి బేనర్, పోస్టర్స్ రూపొందించి వివిద ప్రదేశాలలో ప్రదర్శనకు పెట్టాడం జరిగినది.
కార్యక్రమం
మార్చుకార్యక్రమం 10 వతేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు ప్రారంభమైనది. సీనియర్ వికీ మిత్రుడు రాజాచంద్ర రాగానే కార్యక్రమం మొదలు అయినది. కొందరు పెద్దలు, విద్యార్ధులు మొదటగా హాజరైనారు. తరువాత గ్రంథాలయానికి వచ్చే పాఠకులు హాజరైనారు. కార్యక్రమంలో వికీ అంంటే ఏమిటి?, ప్రస్తుతం వికీ యొక్క ఆవశ్యకత వివరించాము. పిఠాపురం గురించి సమాచారాన్ని చూపుతూ ఇక్కడ కల చారిత్రక విశేషాలు చాలా కొద్దిగానే ఉన్నాయి కనుక మరిన్ని రాయాల్సిన అవశ్యకత ఉన్నదని చెప్పాం. తరువాత అక్కడ కల ప్రముఖ కవిత్రయం అయిన వెంకట పార్వతీశ కవుల గురించిన సమాచారం లేక పోవుట గమనించి దానిపై అక్కడ కల కొందరు విద్యార్ధుల ద్వారా ఆ వ్యాసాన్ని సృష్టింప జేయడం జరిగినది.
పాల్గొన్న పెద్దలు
మార్చు- పత్రి రామకృష్ణ
- కె. వెంకతరమణ
- కొండేపూడి శంకరరావు
- రెడ్డెం శేషగిరిరావు
- మల్యాల శ్రీనివాస్