వికీపీడియా:తెలుగు టైపు తెలియని వారు కూడా చేయగలిగే శుద్ధి పనులు

‌వికీపీడియా పై అవగాహన వుంటే (అంటే కొన్ని వ్యాసాలు చదివిన అనుభవం, తెవికీ స్వరూపం పై కొంత అవగాహన) తెలుగు టైపు వేగంగా చేయలేకపోయినా చాలా శుద్ధి పనులు చేయవచ్చు.

దారి మార్పు వ్యాసాల శుద్ధిసవరించు

సమస్యల నివేదిక లో full list of main namespace redirects with redundant links చూడండి. వాటిలోని వ్యాసాలలో దారిమార్పు వరుస కాకుండా మిగతా వివరాలు తొలగించి పేజీని భద్రపరచండి. దారి మార్పు లక్ష్య వ్యాసానికి అయోమయనివృత్తిఅవసరమైతే {{మూస:అయోమయ నివృత్తి}} జతచేయండి. వ్యాసానికి సంబందించిన విషయాలుంటే ఎక్కువగా వుంటే అవి దారిమార్పు లక్ష్య పేజీలో ఇప్పటికే వున్నాయా అని పరిశీలించండి లేకపోతే వాటిని విలీనం చేసి ఆ తరువాత దారిమార్పు గల పేజీలో తొలగించండి.

వర్గాలు చక్కదిద్దడంసవరించు

  • వర్గాల పై అవగాహన పెంచుకోండి. వర్గం వృక్షం చూడండి. దీనిలో + లేక - గుర్తుల పై నొక్కుతూ మరియు ప్రవేశపెట్టె లో మీకు కావలసిన వర్గం టైపు లేక నకలు మరియ అతికించు పద్ధతిలో ప్రవేశపెట్టి కావలసిన స్థాయిలో మాతృవర్గాలు లేక ఉపవర్గాలు చూడవచ్చు.
  • మీరు మార్పులు చేయాలనుకున్న పేజీలు లేక ప్రత్యేక:వర్గీకరించనిపేజీలు లేక ప్రత్యేక:వర్గీకరించనిఫైళ్లు లేక ప్రత్యేక:వర్గీకరించనివర్గములు నుండి పేజీలను ఎంచుకోండి.
  • పేజీ క్రింద కనబడే వర్గాలు: వరుసలో + లే క - గుర్తులు వాడి అప్పుడు కనబడే పెట్టెలో వర్గ పదంలో మొదటి రెండు అక్షరాలు టైపు చేసుకొని( ఇంగ్లీషు ఫొనెటిక్ పద్దతి వాడవచ్చు), అప్పుడు కనబడే వర్గాల పెట్టెలో కావలసిన వర్గాన్ని చేర్చవచ్చు. మరిన్ని వివరాలకు వికీపీడియా:హాట్‌కేట్ చూడండి.
  • వర్గీకరించని వర్గాల పేజీలను మార్చేటప్పుడు వర్గాన్ని టైపు లేక నకలు మరియు అతికించుట చేయవలసి వస్తుందని గమనించండి.

కొత్త సభ్యులను ఆహ్వానించటంసవరించు

ప్రత్యేక:ఇటీవలిమార్పులు లో (కొత్త వాడుకరుల చిట్టా) వరుసలు చూసి దానిలో గల సభ్యుడు(ల) చర్చా పేజీలలో {{subst: స్వాగతం|< స్వాగతించేవారిసభ్యనామం(ఇంగ్లీషులో)>}} చేర్చండి.

బొమ్మలను కామన్స్ లోకి మార్చటంసవరించు

నిర్వహణకుసహాయంసవరించు

ట్వింకిల్ సహాయంతో తొలగింపు ప్రతిపాదనలు, స్వాగతింపులు లాంటివి చేయవచ్చు.

ఇవీచూడండిసవరించు