వికీపీడియా:తెలుగు వికీపీడియా కరదీపిక/తెవికీలో ఎందుకు రాయాలి? నాకేంటి?
- నేటి సమాజానికే కాకుండా భవిష్యత్తు తరాలకు కూడా ఉపయోగపడేలా ఏదైనా చేద్దామని అనుకుంటున్నారా?
- వివిధ రంగాలకు చెందిన విజ్ఞానాన్ని తెలుగు భాషలో అందించేందుకు మీవంతుగా తోడ్పడాలని భావిస్తున్నారా?
- రాబోయే తరాల తెలుగుబిడ్డల కోసం ఒక విష్ణుశర్మ అవ్వాలనుకుంటున్నారా?
- దశాబ్దాల పాటు పాఠాలు చెప్పి, వేలాది మంది పిల్లలను తీర్చిదిద్దిన ఉపాధ్యాయులుగా మీ మేథను, మీ శక్తియుక్తులను లక్షల మంది కోసం వినియోగిస్తారా?
- తెలుగులో విజ్ఞాన భూమిలో ఒక మొక్క నాటడంతో సరిపెట్టకుండా, ఏకంగా ఒక విజ్ఞాన వనాన్నే పెంచాలని అనుకుంటున్నారా?
అయితే వికీపీడియా మీకోసమే ఉంది. మీవంటి స్వచ్ఛంద సేవకుల కోసం ఎదురుచూస్తోంది. తెలుగు వికీపీడియాలో రాయండి. విశాలమైన, విస్తారమైన విశ్వ విజ్ఞానాన్ని తెలుగులో చేర్చే కృషిలో మీరూ పాలు పంచుకోండి.