వికీపీడియా:తెలుగు వికీపీడియా కరదీపిక
- పుస్తకం ముందు, వెనుక అట్టల రూపకల్పన విషయమై జరుగుతున్న చర్చను అట్టల రూపకల్పన పేజీలో చూడండి
- తెలుగు వికీమీడియన్స్ యూజర్గ్రూపు లోగో రూపకల్పనకు సంబంధించిన చర్చను చూడండి
కొత్తవారికి తెలుగు వికీపీడియాను పరిచయం చేసేలా ఒక చిరుపుస్తకాన్ని తయారు చేసే ప్రయత్నం ఇది. ఔట్‌రీచ్ కార్యక్రమాల్లో పనికి వచ్చేలా రూపొందించాలనేది లక్ష్యం. అ పుస్తకం రూపానికి సంబంధించి తొలి ఆలోచనలను ఇక్కడ చూదవచ్చు,. దీనిపై వచ్చిన సూచనలు, అభిప్రాయాల మేరకు తుది రూపుకు చేరవచ్చు. అభిప్రాయాలు, సూచనలను అట్టడుగున ఉన్న విభాగంలో రాయవలసినది.
- ఎవరి కోసం
- వికీపీడియా గురించి ఏమీ తెలియని వారి కోసం
- పరిమాణం
- విశాఖ తెవికీ పండగలో ఇచ్చిన "ఎందరో వికీమీడియన్లు" పుస్తకం పరిమాణంలో, 50 పేజీలు ఉండేలా
- పుస్తకం ఎవరు రాస్తారు
- మనమే! కంటెంటులో కొంత ఈసరికే అక్కడా ఇక్కడా ఉంది. ఇంకా అవసరమైన దాన్ని కొత్తగా రాద్దాం
పరిధి
మార్చుపుస్తకంలో కింది అంశాలుంటాయి
- వికిమీడియా ఫౌండేషన్ పరిచయం - నేను రాస్తాను __చదువరి (చర్చ • రచనలు)
- తెలుగు వికీపీడియా పరిచయం: విజ్ఞానసర్వస్వం, ఆన్లైనులో మాత్రమే, స్వేచ్ఛ - నేను రాస్తాను __చదువరి (చర్చ • రచనలు)
- వికీపీడియా గణాంకాలు (లక్ష వ్యాసాలకు చేరిన నాటి గణాంకాలు) - నేను రాస్తాను __చదువరి (చర్చ • రచనలు)
- తెవికీ తత్వం (మూలస్థంభాలు వగైరా) - నేను రాస్తాను __చదువరి (చర్చ • రచనలు)
- వ్యాసాల రూపం, సబ్జెక్టులు, ముఖ్యమైన విశేషాలు - నేను రాస్తాను __యర్రా రామారావు (చర్చ • రచనలు)
- తెవికీలో ఎందుకు రాయాలి? నాకేంటి? - నేను రాస్తాను __యర్రా రామారావు (చర్చ • రచనలు)
- తెవికీలో ఎలా రాయాలి: "మార్చు", "ప్రచురించు", ఎడిటింగు ఉపకరణాలు _యర్రా రామారావు (చర్చ • రచనలు)
- తెవికీలో ఎవరు రాస్తున్నారు - నేను రాస్తాను __యర్రా రామారావు (చర్చ • రచనలు)
- వికీపీడియా ద్వారా కొత్త కొటికీలు, కొత్త ద్వారాలు - జ్ఞానం, పదిమందితో కలిసి పనిచెయ్యడం
- అనువాద పరికరం ---V.J.Suseela (చర్చ) 04:56, 27 అక్టోబరు 2024 (UTC)
- వికీసోర్సు పరిచయం---V.J.Suseela (చర్చ) 04:56, 27 అక్టోబరు 2024 (UTC)
- వికీమీడియా కామన్స్ పరిచయం--V.J.Suseela (చర్చ) 04:56, 27 అక్టోబరు 2024 (UTC)
- ఇతర తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల పరిచయం--V.J.Suseela (చర్చ) 04:56, 27 అక్టోబరు 2024 (UTC)
మొత్తం పుస్తకమంతా ఒక్కచోట
మార్చుఎప్పటి లోగా చెయ్యాలి
మార్చు- కంటెంటు సిద్ధం: సెప్టెంబరు 30
- టైప్ సెట్టింగు, అట్టల డిజైను వగైరాలు అక్టోబరు 31
- ముద్రణ: నవంబరు
దాంతో పుస్తకాలు, పుస్తక ప్రదర్శన నాటికి సిద్ధంగా ఉంటాయి.
కంటెంటు సేకరణ
మార్చుమనమే! కంటెంటులో కొంత ఈసరికే అక్కడా ఇక్కడా ఉంది. దాన్నంతా ఒకచో చేర్చి మార్పుచేర్పులు, తీసివేతలూ చేసి పెట్టుకుందాం. ఇతర భాషల వాళ్ళు తయారు చేసిన పుస్తకాలు ఏమైన ఉంటే వాటిని చూద్దాం. సి ఐ ఎస్ ఎ2కె వాళ్ళు ఒక పుస్తకం వేసారంట - అదీ చూద్దాం. ఇంకా అవసరమైన పాఠ్యాన్ని కొత్తగా తయారు చేసుకుందాం. ఇప్పుడు మనకున్న కొంత సమాచారం ఇక్కడ చూదవచ్చు.
- వికీపీడియా:తెవికీ
- వికీపీడియా:తెలుగు వికీపీడియా
- వాడుకరి:Chaduvari/వికీపీడియా అంటే..
- వాడుకరి:Kasyap/వికీపీడియా_వ్యాసం_పరిచయం శిక్షణ స్లయిడ్లు
- తెవికీ పండగ నాటికి ఒక పుస్తకం వేద్దామనుకుని కొంత సమాచారం సేకరించాం. దాన్ని వాడుకోవచ్చు
- వాడుకరి:B.K.Viswanadh/ప్రయోగశాల
అభిప్రాయాలు, సూచనలు
మార్చుఈ పుస్తకం మంచి ఆలోచన. ఇందులో వికీడేటా పరిచయం, తెవికీ నిర్వాహకత్వం గురించి (ఎవరు చేస్తారు, ఏం చేస్తారు) కూడా చేర్చితే బాగుంటుంది.
పుస్తకంలో అక్కడక్కడా చిన్న చిన్న చిట్కా డబ్బాలు పెట్టవచ్చు. ఇవి అనుభవంతో తెలిసేవీ, చేసే పనిని సులభతరం చేసేవి అవ్వవచ్చు.
పైన చెప్పిన అంశాలన్నీ విడి విడిగా విశదీకరించిన తరువాత, పుస్తకం చివర్లో స్క్రీన్‌షాట్లతో ఉదాహరణలు ఇవ్వాలి. అంటే ఒక కొత్త వ్యాసం మొదలుపెట్టడం, శీర్షిక కింద కనిపించే చిన్న వివరణ ఇవ్వడం, పాఠ్యాంశం చేర్చడం, మూసలు, లంకెలు, మూలాలు, వర్గాలు, వికీడేటా లింకు వంటి చేయాల్సిన హంగులన్నీ చూపించాలి. అలాగే అనువాద పరికరం కూడా స్క్రీన్‌షాట్లతో చూపిస్తే బాగుంటుంది. - కిమీర (చర్చ) 10:18, 4 జూన్ 2024 (UTC)
పుస్తక ప్రదర్శనలో సందర్శకులకు ఇవ్వటానికి ఒక చిరు పుస్తకం తో పాటుగా ఒక పెద్ద పిడిఎఫ్ పుస్తకం కూడా అందుబాటులో ఉంటే బాగుంటుంది అందులో విషయాలను వివరంగా పేర్కొనటంతో పాటు అందుకు సంబంధించిన వీడియోలు ఇతర లింకులు కూడా ఇవ్వవచ్చు అంతేకాక ఎంతో తోడ్పడుతున్న మన వికీపీడియా సభ్యుల పరిచయం ఫోటో వారి కృషి కూడా తగినన్ని పేజీలు కేటాయించవచ్చు . నేను సాధారణంగా ఇలాంటి సామూహిక కార్యక్రమాలలో ప్రత్యేకించి వ్యక్తుల ప్రాధాన్యతకు అంత సుముఖంగా ఉండను అయితే గత ఉత్సవాలలో ప్రచురించిన పుస్తకం నా ఆలోచనను మార్చినది. ఇలాంటివి ప్రస్తుతం స్వచ్ఛందంగా కృషి చేస్తున్న వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఇది డిజిటల్ కాపీ కాబట్టి అవసరం అయిన మార్పులు చేస్తూ వుండవచ్చు. Kasyap (చర్చ)
పుస్తక ప్రదర్శనలో సందర్శకులకు అందచేసే చిరుపుస్తకం (కరదీపిక) చిన్నగా అంటే 15 నుంచి 20 పేజీలు ఉంటే బావుంటుంది. కొంత ఆకర్షణీయంగా రంగులలో ఉండాలి. ఇది కేవలం కొత్తవారికి వికీ ప్రాజెక్ట్ లను పరిచయం చేసి వారు ఇక్కడ ఏమి చేయవచ్చో, ఎందుకు చేయాలో, వారికీ వికీలో లభించేదేమిటో, ఒక 4-5 సూచనలు మూలాలు ఇవ్వడం, కాపీరైట్ పాటించడం వంటివి, సహాయం ఎలా తీసుకోవాలి వంటివి ఉంటే బావుంటుందని అనుకుంటున్నాను.
- వాడుకరుల కరదీపిక - వికీపీడియా లో రాయడం ఎలా? పూర్తి స్థాయిలో వికీబుక్స్ లో స్క్రీన్ షాట్స్ తో సహా అందరు తలో అధ్యాయం తీసుకుని రాయవచ్చు. అదే తరువాత printable వెర్షన్ తీసుకురావచ్చు.
- తెవికీ గురించిన పెద్ద పుస్తకం వేరుగా, సమగ్రంగా ఉంటుంది.
ధన్యవాదాలు ---V.J.Suseela (చర్చ) 04:45, 16 సెప్టెంబరు 2024 (UTC)
వికీపీడియా ఒక డైనమిక్ ప్లాట్‌ఫాం, అంటే అది నిరంతరం మారుతూ ఉంటుంది. పుస్తకంలో ముద్రించిన సమాచారం అప్డేట్ చేయలేము అందువల్ల ముఖ్యమైన గైడ్ పేజీలకు ఆ పేజీలలో నే QR Code ఇవ్వటం ద్వారా వినియోగదారులు ఖచ్చితం అయిన సమాచారం (updated information) తెలుసుకొంటారు. --Kasyap (చర్చ) 06:53, 15 నవంబరు 2024 (UTC)
- మంచి సూచన @Kasyap గారూ యర్రా రామారావు (చర్చ) 07:30, 15 నవంబరు 2024 (UTC)