వికీపీడియా:బొమ్మల కొలువు
వికీపీడియా బొమ్మల కొలువు కు స్వాగతం. వికీపీడియాలో ఉన్న అన్ని బొమ్మలను వెతుక్కోవడానికి వీలుగా ఒక క్రమ పద్ధతిలో కూర్చడమే ఈ పేజీ లక్ష్యం. సార్వజనికము మరియు ఇతరత్రా ఉచితమూ అయిన బొమ్మలు మాత్రమే ఇక్కడ పొందు పరచాలి. బొమ్మలు - అవి ఇప్పటికే ఏదైనా పేజీలో వాడుతున్నా, లేకున్నా - అన్నిటినీ ఈ పేజీకి చేర్చండి.
గమనిక: మీరీ బొమ్మల ఖజానా నుండి ఏ బొమ్మైనా వాడదలచుకుంటే, ముందా బొమ్మ ఉచితమైనదేనని నిర్ధారించుకోండి. ఎందుకంటే, పొరపాట్లు జరగవచ్చు, కొలువులో ఉన్న ప్రతి బొమ్మకు కూడా సరైన కాపీహక్కు కలిగి ఉందని అనుకోరాదు. ఏదైనా ఉచితం కాని బొమ్మ మీకిక్కడ కనిపిస్తే, వెంటనే దానిని తొలగించండి.
ఏదైనా బొమ్మకు సరిపోయే వర్గం ఇక్కడ లేకపోతే, ఆ బొమ్మకు ప్రత్యేకంగా వర్గం ఉండవలసిన అవసరం ఉంటే (ముందు ముందు ఆ రకమైన బొమ్మలు ఇంకా వచ్చే అవకాశం ఉంటే) దానికి తగిన వర్గాన్ని సృష్టించండి.
ఈమధ్య అప్‌లోడు అయిన బొమ్మలు చూడదలిస్తే, Special:Log/upload చూడండి. వ్యాసాల కొరకు కోరిన బొమ్మల జాబితా కొరకు వికీపీడియా:కోరుచున్న బొమ్మలు చూడండి. ఏ పేజీలోనూ వాడని బొమ్మల జాబితా కొరకు Special:unusedimages చూడండి.
బొమ్మల పేజీలలో, ఫార్మాట్ ఇలా ఉండాలి:
- [[బొమ్మ:Image Name.jpg|thumb|100px|left|క్లుప్త వివరణ]]
ఏ వర్గంలో పెట్టాలో తేల్చుకోలేకపోతే, అవీ..ఇవీ లో పెట్టండి.
ఉచితమైన బొమ్మ అంటే ఏమిటి
మార్చుఅన్ని దేశాలలోనూ సార్వజనికమైనది, లేదా కాపిహక్కు కలిగిన వారిచే అందరికీ లైసెన్సు జారీ చేయబడినది. ఉచితం అంటే - ఎవరైనా, ఆ బొమ్మను ఇష్టానుసారం (కాపీ, మార్చడం, సవరణలు చెయ్యడం మొదలైనవి) వాడుకోగలిగి ఉండాలి.
వర్గాలు
మార్చువర్గంలోని ఉపవర్గాలకు, బొమ్మలకు వెళ్ళేందుకు వ్యాఖ్య ను నొక్కండి.
ఇంకా చూడండి
మార్చు