వికీపీడియా:బొమ్మలు వాడే విధానం

మల్టీమీడియాకు సంబంధించిన సామాన్య విషయాల (బొమ్మలు, ధ్వని మొదలైనవి.) కొరకు వికీపీడియా:Multimedia చూడండి. అప్‌లోడుకు సంబంధించిన సమాచారానికై వికీపీడియా:బొమ్మలు అప్ లోడు చెయ్యడం చూడండి, లేదా సరాసరి అప్‌లోడు కు వెళ్ళండి.

బొమ్మలు అప్‌లోడు చెయ్యడానికి సంబంధించి కింది ప్రధానమైన నియమాలను పాటించాలి. ధ్వని ఫైళ్ళకు సంబంధించి వికీపీడియా:Sound చూడండి.

శిలాక్షరాలు (ప్రధాన నియమాలు)

మార్చు
 1. అప్‌లోడు చేసేటపుడు కాపీహక్కులను దృష్టిలో పెట్టుకోండి.
 2. బొమ్మ ఎక్కడినుండి వచ్చిందో, దాని మూలం ఏమిటో - వెబ్‌లో అయితే URL (పేజీ చిరునామా), లేకపోతే సంబంధిత ఫోటోగ్రాఫరును సంప్రదించు అడ్రసు వివరాలు స్పష్టంగా తెలియపరచండి.
 3. బొమ్మ వివరణ పేజీలో బొమ్మ గురించి వివరిస్తూ, కాపీహక్కుల పరిస్థితిని కూడా తెలియజేయండి.
 4. బొమ్మకు ఏదో ఒక బొమ్మ కాపీహక్కు టాగును తగిలించండి.
 5. వివరమైన, స్పష్టమైన పేరు పెట్టండి. అదే పేరుతో ఇంతకు ముందే ఒక బొమ్మ ఉండి ఉంటే, దాన్ని తీసివేసి కొత్తది చేరుతుందని గుర్తుంచుకోండి.
 6. హై-రిసొల్యూషను బొమ్మను అప్‌లోడు చేసి (2 MB సైజు వరకు ఉన్న ఫైళ్ళను కూడా మీడియావికీ అనుమతిస్తుంది.), పేజీలో చూపించేటపుడు వికీపీడియా మార్కప్‌ వాడి దాన్ని తగ్గించవచ్చు. నఖచిత్రాలను 35 kb సైజుకు చెయ్యండి (గరిష్ఠంగా 70 kb). ముందే ఫైలు సైజును తగ్గించి అప్‌లోడు చెయ్యకండి, భవిష్యత్తులో వాటి వలన పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు.
 7. బొమ్మలను వ్యాసానికి అవసరమైనంత మేరకే చూపించే విధంగా అవసరమైన దిద్దుబాట్లు చెయ్యండి.
 8. టెక్స్టు కూడా కలిసి ఉండే బొమ్మను మీరు తయారు చేస్తుంటే, టెక్స్టు లేని బొమ్మను కూడా అప్‌లోడు చెయ్యండి, ఇతర భాషా వికీపీడియాలలో అది వాడుకోవచ్చు.
 9. బొమ్మ యొక్క శ్రేయో వివరాలను బొమ్మలోనే ఇముడ్చకండి; వాటిని వివరణ పేజీలో పెట్టండి.
 10. ఫోటోలకు JPEG పద్ధతిని, ఐకాన్లకు, లోగోలు, చిత్రాలు, మాపులు, జెండాలు మొదలైన వాటికి PNG ని, యానిమేషన్లకు GIF ను వాడండి. విండోస్‌ BMP బొమ్మలను వాడకండి; అవి చాలా ఎక్కువ స్థలాన్ని ఆక్రమిస్తాయి.
 11. చక్కని ఆల్టర్నేటివ్‌ టెక్స్టును బొమ్మకు చేర్చండి.
 12. అభ్యంతరకరమైన బొమ్మల విషయంలో అవి నిజంగా అవుసరమేనా అన్నది ఆలోచించండి. వ్యాసంలో బొమ్మను పెట్టకుండా, లింకును మాత్రం ఇచ్చి, బొమ్మ గురించి ఒక హెచ్చరికను కూడా పెట్టండి. ఏదైనా బొమ్మకు సంబంధించి మీకు అభ్యంతరాలుంటే, వ్యాసపు చర్చా పేజీలో చర్చించండి. వికీపీడియా:Image censorship మరియు వికీపీడియా:Profanity#Offensive imagesచూడండి.

ఇంకా చూడండి

మార్చు

కాపీహక్కు (బొమ్మలు)

మార్చు

బొమ్మను అప్లోడు చెయ్యబోయే ముందు ఒకటి నిర్ధారించుకోండి: ఆ బొమ్మ మీ సొంతమై ఉండాలి లేదా అది సార్వజనికమై (పబ్లిక్ డొమెయిను) ఉండాలి, లేదా దాని కాపీహక్కు స్వంతదారు దాన్ని GFDL కింద విడుదల చేసేందుకు అంగీకరించారు. దాని కాపీహక్కు స్థితిని తెలియజేస్తూ బొమ్మ వివరణ పేజీ లో నోటు పెట్టండి. అలాగే ఆ బొమ్మ మూలాలను గురించిన వివరాలనూ పెట్టండి. బొమ్మను మీరేవ్ తయారు చేసి ఉంటే, ఈ బొమ్మను "ఫలానారావు", "ఫలానా తేదీ"న తయారు చేసాడు అని రాయండి. "ఫలానారావు", "ఫలానా తేదీ" లను మీ పేరు, బొమ్మను తయారు చేసిన తేదీలతో మార్చడం మరువకండి. అంతేగాని, ఈ బొమ్మను నేనే తయారుచేసాను అని రాయకండి.


సార్వజనికమైన బొమ్మలు దొరికే చోట్లు చాలానే ఉన్నాయి. ఇంగ్లీషు వికీపీడియా లోని సార్వజనిక బొమ్మల వనరులు పేజీ చూడండి. ఏదైనా బొమ్మ విషయంలో కాపీహక్కుల ఉల్లంఘన జరిగిందని మీకు రూఢిగా తెలిస్తే, సదరు బొమ్మను తొలగించాలని తెలుపుతూ సంబంధిత మూసను ఆ పేజీలో ఉంచండి.

ఫెయిర్ యూజ్ విధానాలు

మార్చు

కాపీహక్కులు ఉన్న మూలాలను కూడా తగు అనుమతులు లేకుండానే వాడవలసిన అవసరం ఉండొచ్చు. ఉదాహరణకు ఏదైనా పుస్తకాన్ని గురించి రాసేటపుడు, ఆ పుస్తకపు అట్ట బొమ్మను, తగు అనుమతులు పొందకున్నాగానీ, వ్యాసంలో పెట్టవచ్చు. దీన్ని ఫెయిర్ యూజ్ అంటారు. సినిమా పోస్టర్లు, కంపెనీల లోగోలు, సీడీ, డీవీడీల కవర్లు ఈ కోవ లోకి వస్తాయి. అయితే ఈ ఫెయిర్ యూజ్ అనేది ఖచ్చితంగా నిర్వచించగలిగేది కాకపోవడం చేతను, దుర్వినియోగ పరచే అవకాశం ఎక్కువగా ఉండడం చేతను దీన్ని కేవలం పైన ఉదహరించిన వాటి కోసం మాత్రమే వాడాలి.

ఫెయిర్ యూజ్ గురించి మరొక్క విషయం.. పై బొమ్మలను లో రిజొల్యూషనులోనే వాడాలి. హై రిజొల్యూషను బొమ్మలు ఫెయిర్ యూజ్ కిందకు రావు. అలాంటి బొమ్మలు కనిపిస్తే వాటిని తొలగించాలని తెలియజేస్తూ వికీపీడియా:తొలగింపు కొరకు బొమ్మలు పేజీలో చేర్చండి.

ఇంకా చూడండి: వికీపీడియా:కాపీహక్కులు#బొమ్మ మార్గదర్శకాలు

బొమ్మల దిద్దుబాటు

మార్చు

అప్లోడు పేజీ ద్వారా బొమ్మ యొక్క కొత్త కూర్పును అప్‌లోడు చెయ్యండి. పాత బొమ్మ పేరే కొత్త దానికీ ఉందని నిర్ధారించుకోండి.

బొమ్మను వేరే ఫార్మాటు లోకి మారిస్తే ఫైలుపేరు మారినట్లే. అంచేత కొత్త బొమ్మకు కొత్త వివరణ పేజీ తయారవుతుంది.

బొమ్మల తొలగింపు

మార్చు
 1. బొమ్మను తొలగించే ముందు, దాని పట్ల మీ అభ్యంతరాల గురించి అప్ లోడు చేసిన వారికి ఓ ముక్క చెప్పండి. సమస్యకు ఇక్కడే పరిష్కారం దొరకవచ్చు.
 2. బొమ్మ వాడిన అన్ని పేజీల నుండి దాన్ని తొలగించండి - దాన్ని అనాథను చెయ్యండి.
 3. కింది నోటీసుల్లో ఏదో ఒకదాన్ని బొమ్మ వివరణ పేజీలో పెట్టండి.
  • కాపీఉల్లంఘన: వికీపీడియా:కాపీహక్కుల సమస్యలుబొమ్మల కాపీహక్కుల ఉల్లంఘన నోటీసు ను బొమ్మ వివరణ పేజీలో పెట్టండి:
  • లేదా: తొలగింపు నోటీసు {{ఈ బొమ్మను తొలగించాలి}} ని బొమ్మ వివరణ పేజీలో పెట్టండి.
 4. బొమ్మను కింది పేజీల్లో ఏదో ఒకదానిలోని జాబితాల్లో చేర్చండి:
 5. ఓ వారం తరువాత బొమ్మను తొలగించవచ్చు - తొలగింపు విధానం చూడండి.

పై పనంతా అయ్యాక, బొమ్మను తొలగించే అసలు పని నిర్వాహకులు మాత్రమే చెయ్యగలరు.

బొమ్మల పేర్లు

మార్చు

బొమ్మ పేరు వీలైనంత వివరంగా ఉంటే మంచిది. భారతదేశం మ్యాపుకు భారతదేశం.png అని పేరు పెట్టొచ్చు. కానీ ఆ పేరుతో ఇప్పటికే వేరే మ్యాపు ఉండొచ్చు, లేదా భారతదేశానికి ఒకటి కంటే ఎక్కువ మ్యాపులు అప్లోడు చెయ్యవచ్చు. అంచేత పేరు మరింత వివరంగా భారతదేశం భౌగోళికం.png అనో భారతదేశం రవాణా.png అనో ఉంటే మరింత వివరంగా ఉంటుంది. అలాగని మరీ పొడవైన పేర్లు పెట్టకండి. ఇప్పటికే ఉన్న బొమ్మను మీదగ్గరున్న కొత్త బొమ్మతో మార్చాలని అనుకుంటే, కొత్త బొమ్మను సరిగ్గ పాత బొమ్మ పేరుతోటే అప్లోడు చెయ్యండి. పేర్లలో ప్రత్యేక కారెక్టర్లు వాడకండి. ఫైలు పేరు లోని మొదటి భాగం< తెలుగులో ఉండొచ్చు గానీ, ఎక్స్టెన్షను తప్పనిసరిగా ఇంగ్లీషులోనే ఉండాలి. ఎక్స్టెన్షనులో పెద్దక్షరాలు, చిన్నక్షరాల పట్టింపు ఉంది. భారతదేశం భౌగోళికం.PNG, భారతదేశం భౌగోళికం.png అనేవి రెండు వేరువేరు ఫైళ్ళుగా సాఫ్టువేరు చూస్తుంది.

బొమ్మ పేరును మార్చే సులువైన మార్గమేమీ ప్రస్తుతానికి లేదు. వ్యాసాల పేజీల పేర్లు మార్చేందుకు ఆ పేజీని కొత్త పేరుకు తరలిస్తే సరిపోతుంది. కానీ బొమ్మ పేజీలను అలా తరలించడానికి కుదరదు. ఈ పేజీలకు తరలించు లింకే ఉండదు. పేరు మార్చేందుకు సరైన పద్ధతి ఏంటంటే.. అదే బొమ్మను కొత్త పేరుతో మళ్ళీ అప్ లోడు చేసి, పాత బొమ్మను తొలగించేందుకు అభ్యర్ధన పెట్టడమే. దానికి ముందు పాత పేరుతో ఏయే పేజీల్లో ఆ బొమ్మకు లింకు ఉందో గమనించి సదరు లింకులను కొత్త పేరుకు మార్చాలి. ఈ లింకుల జాబితా కావాలంటే బొమ్మ పేజీలో లింకులు విభాగంలో చూడండి.

బొమ్మలను పెట్టడం

మార్చు

బొమ్మలను ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి అనే విషయాలపై ఉదాహరణలతో కూడిన వివరణకు వికీపీడియా:బొమ్మల పాఠం చూడండి.

ఫార్మాటు

మార్చు
 • డ్రాయింగులు, ఐకనులు, మ్యాపులు, జండాలు వంటివి PNG పద్ధతిలో ఉండాలి.
 • ఫోటోలు, ఫోటోల్లాంటి మ్యాపులు JPEG పద్ధతిలో ఉండాలి.
 • యానిమేషన్లు GIF పద్ధతిలో ఉండాలి.

మీ దగ్గర మంచి బొమ్మ ఉండి, అది తప్పు ఫార్మాటులో ఉంటే సరైన ఫార్మాటులోకి మార్చి, అప్లోడు చెయ్యండి. అయితే, JPEG ఫార్మాటులో బొమ్మ ఉంటే, దాన్ని PNG ఫార్మాటుకు మార్చినపుడు బొమ్మ రూపురేఖలు మారకుండా ఉంటేనే ఫైలు సైజు తగ్గించండి. JPEG లను పదేపదే దిద్దుబాటు చెయ్యకండి. ప్రతి దిద్దుబాటుకూ బొమ్మ నాణ్యత క్షీణిస్తుంది. 16-bit లేదా 24-bit PNG లేదా TIFF ఫార్మాటులో అసలు ఫోటో దొరికితే, దానిలో దిద్దుబాట్లు చేసి, JPEG గా భద్రపరచి, అప్లోడు చెయ్యండి.

అప్లోడు చేసిన బొమ్మ సైజు

మార్చు

అప్లోడు చేసే ఫైళ్ళ సైజు 2 మెగాబైట్ల లోపు ఉండాలి. మీడియావికీ సాఫ్టువేరు బొమ్మల సైజును ఆటోమాటిగ్గా మార్చుకోగలదు కాబట్టి ఆ పని మీరు చెయ్యనవసరం లేదు. వికీపీడియా బొమ్మలను ముద్ర్ణా రంగంతో సహా అనేక రంగాల వారు వాడుకుంటారు కాబట్టి, బాగా హై రిసొల్యూషను బొమ్మలను అప్లోడు చెయ్యండి. వికీ మార్కప్ వాడి వాటి సైజు మార్చండి.

రేఖా చిత్రాల్లాంటి వాటిని అప్లోడు చేసేటపుడు, మీరే సైజును తగ్గించండి. ఆటోమాటిక్ రీసైజులో బొమ్మ నాణ్యత చెడిపోయే అవకాశము, బొమ్మ బైట్లు పెరిగిపోయే అవకాశము ఉన్నాయి.

చూపించే బొమ్మ సైజు

మార్చు

వ్యాసాల్లో టెక్స్టు పక్కనే బొమ్మ ఉంచేటపుడు thumbnail విధానాన్ని వాడండి, లేదా 200-250 పిక్సెళ్ళ సైజులో పెట్టండి. పెద్ద బొమ్మలు పెట్టదలిస్తే 550 పిక్సెళ్ళ వెడల్పు వరకు పెట్టవచ్చు.

బొమ్మలను క్యూలో పెట్టడం

మార్చు

ఒకే వ్యాసంలో చాలా బొమ్మలు అమరిస్తే వ్యాసం అంతా చిత్రాలతో నిండిపోయి వ్యాసం, చదవడానికి అనువుగా ఉండదు. అందుకని అవసరం లేని బొమ్మలు తీసేసి చర్చాపేజిలో పెడితే బాగుంటుంది. ఒకసారి వ్యాసం విస్తరించబడి, సరిపడ ప్రదేశం చిక్కిన వెంటనే ఆ బొమ్మను వ్యాసం లోకి తీసుకొని రావచ్చు. వ్యాసం విస్తరించబడి ఉంటుంది కాబట్టి బొమ్మల సైజు తగ్గించవలసిన అవసరం ఉంటుంది లేదా అవసరమైతే వ్యాసానికి క్రింద ఒక గ్యాలరీ నిర్మించవలసి ఉంటుంది.

ఇంకొక ముఖ్యవిషయం చర్చా పేజిలో ఉన్న బొమ్మలు, చర్చా పేజీలను దాచేటప్పుడు (నిక్షేపించేటప్పుడు) బొమ్మలు తప్పిపోకుండా, సవ్యంగా వినియౌగించుకునే బాధ్యత కూడా మనమీదే ఉంది.

ఈ క్యూలో ఉన్న బొమ్మలను <gallery> అనే ట్యాగులో పెడితే మంచిది.

బొమ్మలు ఉన్న వ్యాసాల కూర్పుల చరితం

మార్చు

వ్యాసాల పాత కూర్పులు, బొమ్మల పాత కూర్పులను చూపించవు, కొత్త కూర్పునే చూపిస్తాయి - బొమ్మల ఫైలు పేర్లు మారితే తప్ప.

వాడదగ్గ సాఫ్టువేర్లు

మార్చు

బొమ్మల తయారీకి, మార్పులకు వికీపీడియనులు కింది సాఫ్టువేర్లను వాడతారు:

 • en:GIMP [1] (ఉచితం, en:Open source - en:Linux, Windows, en:Mac OS X లకు)
 • en:ImageMagick [2] (ఉచితం, Open source - Linux, విండోస్, Mac OS 9 లేదా X, మొదలైన వాటికి)
 • en:PMView [3] (కొనుక్కోవలసిన సాఫ్టువేరు - విండోస్, en:OS/2 లకు)
 • en:GraphicConverter [4] (en:Shareware - Mac OS 8, 9 or X లకు)
 • en:IrfanView [5] (ఫ్రీవేర్- విండోస్ కోసం) భిన్నాంశాలు కలిగిన ఉచిత పరికరం. ఇది అనేక బొమ్మ ఫార్మాట్లను సపోర్టు చేస్తుంది.
 • en:XNView [6] భిన్నాంశాలు కలిగిన ఉచిత పరికరం. ఇది అనేక బొమ్మ ఫార్మాట్లను సపోర్టు చేస్తుంది.
 • en:Adobe Photoshop [7] ఫోటో, బొమ్మల మార్పుచేర్పుల ప్రోగ్రాము. చాలా ప్రజాదరణ పొందినది.
 • Ulead PhotoImpact [8] ఫోటో, బొమ్మల మార్పుచేర్పుల ఎడిటరు.
 • en:Adobe Illustrator [9] చాలా ప్రజాదరణ పొందిన ప్రోగ్రాము. ప్రధానంగా వెక్టరు బొమ్మలు తయారు చేసేందుకు వాడతారు.
 • en:Macromedia Fireworks [10] నిశ్చల, కదిలే బొమ్మలు తయారు చేసేందుకు వాడే టూలు.
 • en:Paint.NET [11] (ఫ్రీవేర్ - విండోస్ కోసం) .NET ప్లాట్ఫారములో ఉచిత బొమ్మల ఎడిటింగు పరికరం. ఖరీదైన సాఫ్టువేర్లలో ఉండే లేయర్ల వంటి అంశాలు కూడా కలిగిన శక్తివంతమైన సాఫ్టువేరు.
 • Corel en:Paint Shop Pro [12] Adobe Photoshop తో పోలిస్తే చాలా చౌకైన ప్రత్యామ్నాయం.- విండోస్ కోసం

గూగుల్ ద్వారా వికీపీడియా బొమ్మలను శోధించండి

మార్చు

(హెచ్చరిక: వీటిలో చాలా బొమ్మలు కాపీహక్కులకు లోబడి ఉంటాయి. ప్రచురించే ముందు అనుమతి కోరండి.) png jpg gif

ఇవీచూడండి

మార్చు