వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/జిల్లా, నగర వ్యాసాలకు ప్రామాణిక సమాచారపెట్టెలు

వెనక్కి తీసుకున్నారు
ప్రతిస్పందనలు రానందున, విధానం అవసరంలేనిదిగా పరిగణించడమైనది.
కింది చర్చ ముగిసింది. ఇక దానిలో మార్పుచేర్పులు చెయ్యకండి. ఇకపై చెయ్యదలచిన వ్యాఖ్యానాలను సముచితమైన చర్చ పేజీలో చెయ్యాలి.

నగర, జిల్లా పేజీలలో సమాచారపెట్టెలు తెలుగువికీలో, ఆంగ్లవికీలో ప్రస్తుతం వేరుగా వున్నాయి. ఆంగ్లవికీలో {{Infobox settlement}} పై ఆధారపడిన {{Infobox India district}} వాడుతుండగా, తెవికీలో ఇటీవలే {{భారత స్థల సమాచారపెట్టె}} నుండి {{Infobox settlement}} కు ప్రామాణికం చేయకుండా మార్చబడినవి. పాత మూసలలో దోషాల వలన {{Infobox settlement}} ఆంగ్ల వికీలో కొన్ని ఏళ్లక్రిందటే అదరణ పొందినా, తెలుగులో నగర, జిల్లా వ్యాసాలకు ఇటీవలిదాకా పూర్తిగా వాడబడలేదు. 2013 లో వైజాసత్య ప్రారంభించిన మండల, గ్రామ స్థాయి మూసలు సరిగా వాడబడక, వ్యాసాలు అస్తవ్యస్తం కావటం జరిగింది. మరింత సమాచారం కొరకు మూస చర్చ:Infobox settlement చూడండి. దీనివలన తెలుగువికీలో క్లిష్టమైన మూసల నిర్వహణ సామర్ధ్యాలు తక్కువ అని అర్ధమవుతున్నది. ఇవి ముందు ముందు మెరుగయ్యే అవకాశం తక్కువ కావున, తెలుగువికీలో మూసల నిర్వహణని సులభం చేసే విధానాలు అవసరం.

చర్చా అవధిసవరించు

ప్రారంభం: 2019-04-15 అంతం: 2019-04-29 (పాలసీ ప్రకారం ఒకవారం సరిపోయినా, ప్రాముఖ్యత గల విధానం కనుక రెండు వారాలు కేటాయించాము)

ఖరారైన ప్రతిపాదనకు ఓటింగ్సవరించు

ఖరారుపడినతర్వాత రెండు వారాలు.

ప్రతిపాదనసవరించు

ఉదాహరణలుసవరించు

ప్రస్తుత సమాచారపెట్టెలో పాఠ్యవివరము తెరపట్టు
ప్రతిపాదిత సమాచారపెట్టెలో పాఠ్యవివరము తెరపట్టు

జిల్లా ఉదాహరణలు పైన చూపించిబడినవి.

హైదరాబాదు నగర ఉదాహరణగా పాత పెట్టె , కొత్త పెట్టె (ఆంగ్ల వికీ ఆధారితము) చూడండి.

విధానంసవరించు

జిల్లా, నగర వ్యాసాలకు తెలుగువికీలో ముందు ముందు నిర్వహణా సౌలభ్యానికి మరల ఆంగ్లవికీ సమాచార పెట్టె మూసలే అవసరమైన అనువాదంతో వాడాలి.

జిల్లా కేంద్రాలు కూడా నగరం లేక పట్టణం క్రింద భావించబడి విధాన పరిధిలో వుంటాయి.

అనుకూలాలు:

  • తెలుగువికీ కంటే ఆంగ్ల వికీ చూసేవారు మార్పులు చేసేవారు, సుమారు 10-100రెట్లు కాబట్టి , తెలుగు వికీని ఆంగ్లవికీవ్యాసాలలో మార్పులతో పోల్చి మార్పులు చేయటం సులభం. వికీడేటా వినియోగం పెరిగేకొద్ది,సమాచారపెట్టెలు వికీడేటా వాడడంతో నిర్వహణ భారం తప్పుతుంది.
  • <ఇంకేమైనా పైన చేర్చండి>

ప్రతికూలాలు:

  • ఇప్పటి దాక చేర్చిన ప్రత్యేకాంశాలు జిల్లాల పెట్టెలో పురుషుల అక్షరాస్యత, నగరాల పెట్టెలో ఇతర నగరాలకు దూరాలు లాంటివి వదిలివేయబడతాయి. (వీటిని చేర్చటానికి ప్రత్యేక మూసలు చేయటం మరియు వాటినిర్వహణని చేపట్టే సభ్యులు తగినంతమంది లేరు కావున)
  • <ఇంకేమైనా పైన చేర్చండి>

విధానం అవసరంలేదు.సవరించు

చర్చా పేజీ చూడండి.

ఇవీ చూడండిసవరించు