వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)

తాజా వ్యాఖ్య: వ్యాసం పేరు మారుతుంది. విలీనం లేదా ప్రత్యేక వ్యాసం. టాపిక్‌లో 10 నెలల క్రితం. రాసినది: రుద్రుడు
అడ్డదారి:
WP:VPP
రచ్చబండవార్తలుపాలసీలుసాంకేతికముప్రతిపాదనలుఆలోచనలుపత్రికా సంబంధాలుఇతరత్రా..

కొత్త విధానం/మార్గదర్శకత్వం కోసం గానీ, పాత విధానం/మార్గదర్శకత్వంలో మార్పుచేర్పుల కోసం గానీ చర్చ కోసం ప్రతిపాదనను ప్రవేశపెట్టేందుకు ఈ పేజీ ఒక ద్వారం లాంటిది. అయితే ప్రతిపాదనను నేరుగా ఈ పేజీలో రాయకూడదు. విధానాన్ని ప్రతిపాదించేందుకు, ఈ పేజీకి ఒక ఉపపేజీని సృష్టించి అక్కడ ప్రతిపాదించాలి. చర్చ జరిగిన తరువాత నిర్ణయం వెలువడ్డాక, ఆ నిర్ణయాన్ననుసరించి విధానం పేజీని తయారుచేసుకోవచ్చు, లేదా ఉన్న విధానాన్ని సవరించుకోవచ్చు. విధానాలు మార్గదర్శకాల కోసమే కాక, తెవికీలో పద్ధతులు, అంశాలు, విశేషాలలో మార్పుచేర్పుల కోసం కూడా ఈ ప్రతిపాదల పేజీని సృష్టించవచ్చు.

  • కొత్త విధాన ప్రతిపాదనను/పాత విధానంలో మార్పు ప్రతిపాదనను నేరుగా ఈ పేజీలో రాయకూడదు. ఇక్కడ నేరుగా రాసే ప్రతిపాదనలను వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు) పేజీ లోకి తరలిస్తారు.
  • కొత్త విధానాన్ని/మార్గదర్శకాన్ని "వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/కొత్త విధానం" అనే పద్ధతిలో కొత్త పేజీని సృష్టించి ప్రతిపాదించాలి.
  • నేరుగా కొత్త విధానాన్ని ప్రతిపాదించకుండా దాని గురించి ముందు వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు) పేజీలో చర్చకు పెట్టి, వాడుకరుల నాడిని గ్రహించాక, ఇక్కడ ప్రతిపాదించవచ్చు. దీనివలన విధానాన్ని మరింత మెరుగైన రీతిలో ప్రతిపాదించే అవకాశం ఉంటుంది. ఈ రెండు పద్ధతుల్లో దేనినైనా అనుసరించవచ్చు.
  • కొత్త ప్రతిపాదన పేజీని వికీపీడియా విధానాలు, మార్గదర్శకాలు - చర్చలో ఉన్న ప్రతిపాదనలు‎ అనే వర్గంలో చేర్చాలి.
  • ఆ పేజీ లింకును ఇక్కడ, "ప్రస్తుతం చర్చలో ఉన్న ప్రతిపాదనలు" అనే విభాగంలో చేర్చాలి.
  • ప్రధాన రచ్చబండలో కూడా ఆ కొత్త పేజీ లింకును ఇవ్వవచ్చు

కొత్త విధానాన్ని ప్రతిపాదించే ముందు మార్చు

  • విధానం పట్ల మీ ఆలోచనపై స్పష్టత తెచ్చుకోండి. అది అవసరమేనని, దానికి ప్రత్యామ్నాయాలేమీ లేవనీ తోస్తే ముందుకు నడవండి
  • ఈపాటికే దానికి సంబంధించిన ఇతర విధానాలు ఏమైనా ఉన్నాయేమో పరిశీలించండి. వాటిని అధ్యయనం చెయ్యండి.
  • అవసరమని భావిస్తే మీ విధాన ప్రతిపాదనను వికీపీడియా:రచ్చబండ (ప్రతిపాదనలు) పేజీలో రాసి వాడుకరుల అభిప్రాయాలను పరిశీలించండి. అయితే, ఇది ఆవశ్యకమేమీ కాదు. అక్కడ వాడుకరుల అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ మీరు విధానాన్ని ప్రతిపాదించవచ్చు.

విధాన ప్రతిపాదన పేజీ మార్గదర్శకాలు మార్చు

  • పేజీలో పైన {{Proposal}} అనే మూసను ఉంచండి.
  • ప్రవేశిక: ఇందులో ప్రతిపాదిస్తున్న విధానాన్ని సూటిగా క్లుప్తంగా వివరించండి
  • నేపథ్యం (విభాగం): విధానం ఎందుకు అవసరమైంది? అది ఉంటే ఎటువంటి మెరుగుదల వస్తుంది? అనేది వివరించాలి.
  • ప్రతిపాదన వివరాలు (విభాగం): సంపూర్ణంగా, అవసరమైన చోట్ల ఒక్కో పాయింటు రూపంలో వీలైనంత వివరంగా సందిగ్ధత లేకుండా రాయాలి. ఒకవేళ ప్రతిపాదనలో ఎంచుకోవాల్సిన వికల్పాలుంటే ఆ వికల్పాలకు 1,2,3 అనో క,గ,చ అనో పేర్లు ఇవ్వండి. తద్వారా చర్చలో వాటిని ఉదహరించడం వీలుగా ఉంటుంది. బులెట్ లిస్టుగానో, నంబర్ల లిస్టుగానీ ఇవ్వరాదు.

ప్రస్తుతం చర్చలో ఉన్న ప్రతిపాదనలు మార్చు

ఫలవంతమైన ప్రతిపాదనలు మార్చు

ఫలించని లేక విరమించిన ప్రతిపాదనలు మార్చు

చర్చ జరగని ప్రతిపాదనలు మార్చు

సముదాయంలో కొద్దిమంది మైనారిటీ తప్పించి ఇతరులు చర్చించనందునో, ఆమోదం కాని విఫలం కానీ చేయడానికి తగినంత స్పందనలు లభించనందునో నిర్ణయించడానికి వీలులేక పక్కనపెట్టిన ప్రతిపాదనలు:

వ్యాసం పేరు మారుతుంది. విలీనం లేదా ప్రత్యేక వ్యాసం. మార్చు

గమనిక: తెలుగు వికీ నియమాలు నాకు పూర్తిగా తెలియవు. నేను రచ్చబండ (పాలసీలు) యొక్క అన్నింటిని తనిఖీ చేశాను.

  • ఎందుకు: ఒకే రాజకీయ పార్టీ గురించి 2 వేర్వేరు వ్యాసాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి. పాఠకులకు గందరగోళం సృష్టించవచ్చు. సమాచారం ఒకే చోట ఉండదు.
  • ఎవరు: ఈ పాలసీ వ్యక్తులు, కంపెనీలు, సాఫ్ట్వేర్ లేదా పేరు మార్చే దేనికైనా వర్తించాలి.

రుద్రుడు (చర్చ) 09:40, 29 ఏప్రిల్ 2023 (UTC)Reply