వికీపీడియా:వాడుకరి నిరోధ నిర్ణయాల సమీక్ష/నమూనా కేసు

వికీపీడియా:వాడుకరి నిరోధ నిర్ణయాల సమీక్ష విధానం కింద నిరోధం కేసును సమీక్షా సంఘానికి నివేదించాక, వికీపీడియా:వాడుకరి నిరోధ నిర్ణయాల సమీక్ష/సమీక్షా పద్ధతిలో ఎలా ముందుకు సాగుతుందో వివరించే నమూనా పేజీ ఇది. వాడుకరి నివేదన చేసుకున్నాక, సంఘ సభ్యులు ఆ కేసును స్వీకరించాక, ఆ విషయాన్ని ఆ వాడుకరికి, నిరోధం విధించిన నిర్వాహకునికీ తెలియజేస్తారు. ఆ నిర్వాహకుడు ఈ పేజిని కింది పేరుతో సృష్టిస్తారు:

[[వికీపీడియా:వాడుకరి నిరోధ నిర్ణయాల సమీక్ష/<వాడుకరిపేరు కేసు>]]

ఆ పేజీలో కింది వివరాలిస్తారు

కేసు వివరాలు మార్చు

  1. నిరోధం విధించడానికి కారణమైన కేసును వివరించాలి.
  2. నిరోధం కాలావధి:
  3. నిరోధం విధించిన తేదీ:
  4. నిరోధం ముగిసే తేదీ:

ఇక్కడితో నిర్వాహకుని పని ముగుస్తుంది.


సమీక్ష మార్చు

సమీక్షించే క్రమంలో సంఘ సభ్యులు తాము చేసే పనులకు ఈ విభాగాన్ని కార్యక్షేత్రంగా వాడుకుంటారు. వాడుకరిని, నిర్వాహకుని సంప్రదించడం, మరింత సమాచారం కోరడం లాంటివన్నీ ఇక్కడ చెయ్యవచ్చు. గోప్యంగా చెయ్యాల్సిన పనులేమైనా ఉంటే వాటిని తమకు వీలైన చోట చేస్తారు. అసలు ఈ విభాగంలో ఏదో ఒకటి రాసి తీరాలన్న నిబంధనేమీ లేదు. ఏమీ రాయకపోయినా పోవచ్చు.

రికమెండేషను మార్చు

సమీక్షయ్యాక తమ రికమెండేషన్ను ఈ విభాగంలో రాస్తారు. అందుకు హేతువును కూడా రాయవచ్చు. వారి రికమెండేషనుపై ఇక చర్చేమీ ఉండదు. ఎవరూ దానిపై చర్చ పెట్టరాదు, సభ్యుల వివరణ కోరరాదు.

పేజీలో ఇక్కడి వరకూ ఉన్న భాగాన్ని {{Archive top}}, {{Archive bottom}} అనే మూసల మధ్య పెట్టేసి సభ్యులు తమ సమీక్షను ముగిస్తారు.

వోటింగు మార్చు

నిరోధం విధించిన నిర్వాహకుడు పై రికమెండేషనుపై వోటింగును ప్రారంభిస్తారు.

వోటింగుపై నిర్ణయం మార్చు

వోటింగును ప్రారంభించిన నిర్వాహకులు కాకుండా వేరే నిర్వాహకులెవరైనా ఈ విభాగంలో నిర్ణయాన్ని ప్రకటిస్తారు.