వికీపీడియా:వాడుకరి నిరోధ నిర్ణయాల సమీక్ష/సమీక్షా పద్ధతి
వాడుకరి నిరోధ నిర్ణయాల సమీక్ష విధానాన్ని అనుసరించి ఏయే పనులు ఎలా చెయ్యాలి అనే దాన్ని ఈ పేజీ వివరిస్తుంది. ఈ పద్ధతిని వీలుకు తగినట్లుగా, సమయానుకూలంగా మార్చుకోవచ్చు. ఏ మార్పులైనా మూల విధానానికి లోబడి ఉండాలి.
సమీక్ష కోసం నివేదించడం (నిరోధిత వాడుకరి)
మార్చునివేదన: నిరోధానికి గురైన వాడుకరి నిరోధాన్ని సమీక్షించమంటూ కింది విధంగా కోరాలి:
- సంఘ సభ్యుల ఇంగ్లీషు వికీపీడియా వాడుకరి చర్చ పేజీలో
- వారి వాడుకరి పేజీ నుండి ఈ మెయిలు ద్వారా
- వారు సూచించే ఇతర పద్ధతి ద్వారా
సమీక్షా సంఘం తీసుకునే చర్యలు
మార్చు- తమకు నివేదన రాగానే ఈ విషయాన్ని నిరోధం విధించిన నిర్వాహకునికి తెలియజేస్తూ వారి వాడుకరి చర్చ పేజీలో సందేశం పెట్టాలి. అది చూసిన నిర్వాహకుడు/నిర్వాహకురాలు
[[వికీపీడియా:వాడుకరి నిరోధ నిర్ణయాల సమీక్ష/<వాడుకరిపేరు కేసు>]]
అనే పేజీని సృష్టిస్తారు. ఇది వారి బాధ్యత. - పైన సృష్టించిన పేజీలోనే సమీక్షా సంఘం ఈ కేసు పరిశోధనకు సంబంధించి తమ కార్యకలాపాలు -మరింత సమాచారాన్ని కోరటం, వివరణలు అడగడం, రికమెండేషను ఇవ్వడం వంటి పనులన్నీ- నిర్వహిస్తుంది.
- రికమెండేషను రాసేసాక, సంఘ సభ్యులు {{Archive top}}, {{Archive bottom}} అనే మూసలు వాడి, సమీక్షను ముగిస్తారు.
- ఆ తరువాత ఈ సంగతిని రచ్చబండలో ప్రకటిస్తారు.
నిరోధం విధించిన నిర్వాహకుని బాధ్యతలు
మార్చు- కేసు తమ పరిశీలనకు వచ్చినట్లు సంఘ సభ్యులు తెలియజేయగానే
[[వికీపీడియా:వాడుకరి నిరోధ నిర్ణయాల సమీక్ష/<వాడుకరిపేరు కేసు>]]
అనే పేజీని సృష్టించి, దాని లింకును సంఘ సభ్యులకు ఇవ్వాలి. నమూనా కోసం వికీపీడియా చర్చ:వాడుకరి నిరోధ నిర్ణయాల సమీక్ష/నమూనా కేసు పేజీ చూడవచ్చు. దాన్ని రచ్చబండ లోనూ ప్రకటించాలి. - సంఘం తన రికమెండేషన్ను ప్రకటించాక, ఆ పేజీ లోనే
{{Archive bottom}}
కింద వోటింగును మొదలుపెట్టాలి. వోటింగు ప్రాసెస్ గురించి రచ్చబండలో తెలియజెయ్యాలి.
ఇతర నిర్వాహకులు
మార్చువోటింగు ప్రకటించిన రెండు రోజుల తరువాత వోట్లను పరిశీలించి, లెక్కింపు జరిపి, నిర్ణయాన్ని ప్రకటించాలి. ఈ నిర్ణయాన్ని రచ్చబండలోను, వికీపీడియా:నిర్వాహకుల నోటీసుబోర్డు లోనూ కూడా ప్రకటించాలి.