వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు వికీ పాఠ్య ప్రణాళిక ప్రాజెక్టు/ఉద్యోగావకాశాలు

ప్రాజెక్టు సమన్వయకర్త మార్చు

ఉద్యోగ వివరాలు మార్చు

ఉద్యోగ కేంద్రం (వర్క్ లొకేషన్)
హైదరాబాద్

తెలుగు వికీ పాఠ్య ప్రణాళిక ప్రాజెక్ట్ సమన్వయకర్త తెలుగు వికీపీడియా గురించి బోధించే బోధన ఉపకరణాలు, పాఠ్య ప్రణాళిక రూపొందించి, వాటి సామర్థ్యాన్ని విశ్లేషించి, మెరుగుపరిచే లక్ష్యం గల ఈ ప్రాజెక్టును ముందుకు నడిపించాలి. సమన్వయకర్త భావసారూప్యత కలిగిన ప్రాజెక్టులు లేదా సంస్థలతో (ఉదాహరణకు ఐఐఐటీ-హైదరాబాద్‌) ప్రాజెక్టును ముందుకు నడిపించడానికి గాను కలసి పనిచేయాల్సి ఉంటుంది. తెలుగు వికీపీడియా సముదాయ సభ్యులతో కూడి ఉండే ప్రాజెక్టు కమిటీకి సమన్వయకర్త రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది, అలాగే ప్రాజెక్టు ప్రగతి తెలుగు వికీపీడియా సముదాయంతోనూ, ప్రాజెక్టును ఫండ్ చేసే సంస్థలతోనూ (ఉదాహరణకు సీఐఎస్-ఎ2కె) పంచుకుంటూ ఉండాలి.

కనీస అర్హతలు
  • దరఖాస్తు చేసుకునేవారు భారత పౌరులై ఉండాలి, ప్రస్తుతం భారతదేశంలో నివసిస్తూ ఉండి ఉండాలి.
  • తెలుగు వికీపీడియాలో అనుభవం కలిగి ఉండాలి. తెలుగు వికీపీడియా వ్యాసాల సృష్టి, చర్చలు వంటి అంశాలకు సంబంధించిన విధానాలు, మార్గదర్శకాల పట్ల లోతైన అవగాహన, వాటిపై పనిచేయడానికి తగ్గ జ్ఞానం ఉండాలి. విజ్ఞాన సర్వస్వ రచన, వికీపీడియా శైలి మార్గదర్శకాలు, తెలుగు భాష వచనం వంటివాటి పట్ల గట్టి అవగాహన ఉండాలి, వీటి గురించి లోతుగా తెలిసినవారై ఉండాలి.
  • సమష్టిగా పనిచేయగల సామర్థ్యం (టీం ప్లేయర్) ఉండాలి. భిన్నమైన ఆసక్తులు కలిగిన వ్యక్తులతోనూ, స్టేక్ హోల్డర్లతోనూ కలసి పనిచేసిన అనుభవం ఉండాలి.
  • ఏ సందర్భంలోనైనా వికీపీడియా స్ఫూర్తి, లక్ష్యాలు, ఆసక్తులను ఉన్నతంగా నిలబెట్టగలగాలి.
ప్రాధాన్యత కల్పించగల అర్హతలు

వికీపీడియాను కొత్తవారికి పరిచయం చేసిన, దానిపై శిక్షణనిచ్చిన, వచ్చిన కొత్తవాడుకరులను నిలబెట్టే ప్రయత్నం చేసిన అవుట్ రీచ్ కార్యకలాపాల్లో అనుభవం ఉండడం. వికీపీడియా శిక్షణా కార్యక్రమాల్లో బోధన ఉపకరణాలు ఉపయోగించిన అనుభవం ఉండడం. బోధన ఉపకరణాలు, మెటీరియల్ (పాఠ్యంలోనూ, ఆడియో-విజువల్ ఫార్మాట్‌లోనూ) రూపొందించగల ఉపకరణాలపై పనిచేసిన అలవాటు ఉండడం. విభిన్నమైన నేపథ్యాల నుంచి, సామర్థ్యాలతోనూ వచ్చే వాడుకరుల అవసరాలు అర్థం చేసుకుని, ప్రాజెక్టును వారికి కూడా ఉపకరించేదిగా రూపొందించడం. భాగస్వాములు, స్టేక్‌హోల్డర్ల వివిధ ఆసక్తులను అర్థంచేసుకుని నిర్వహించగలగడం

దరఖాస్తు చేసుకోవడానికి మార్చు

  • ఎప్పటివరకు?: 2021 జనవరి 25 తేదీ మధ్యాహ్నం (భారత కాలమానం) 12 గంటల వరకూ దరఖాస్తుకు అవకాశం ఓపెన్‌గా ఉంటుంది. ఆపైన సరైన అభ్యర్థి లభించేంతవరకూ దరఖాస్తు చేసుకోగల అవకాశం ఓపెన్‌గా ఉండి, సరైన అభ్యర్థి దొరకగానే ముగిసిపోతుంది. దరఖాస్తుకు అవకాశం ముగిసిపోతే ఇక్కడే అప్‌డేట్ చేస్తాం.
  • ఎలా?: దరఖాస్తు చేసుకోవడానికి ఈ ఫాం నింపగలరు.
  • జీత భత్యాలు: అభ్యర్థి సామర్థ్యాన్ని అనుసరించి

ఫలితం మార్చు

  • ఈ ఉద్యోగానికి మొత్తం 4 దరఖాస్తులు వచ్చాయి. ఆయా అభ్యర్థుల రెజ్యూమే, వారు దరఖాస్తు ఎందుకు చేసుకున్నారన్న వివరణ, వారి వికీ అనుభవం అంశాల ఆధారంగా ఇద్దరిని ఇంటర్వ్యూకి ఎంపిక చేసి ఇంటర్వ్యూలు నిర్వహించాము.
  • ఇంటర్వ్యూలలో ఈ ప్రాజెక్టు లక్ష్యాలపై, పరిష్కరించాలనుకుంటున్న సమస్యపై అభ్యర్థికి ఉన్న అవగాహన, ఈ ప్రాజెక్టు లక్ష్య సాధనకు అభ్యర్థి తన నైపుణ్యాలను, సామర్ధ్యాలను ఎలా ఉపయోగించగలమని అనుకుంటున్నారో చెప్పిన వివరణ, ఇతర వ్యక్తులతో/సంస్థలతో కలిసిపనిచేయగలిగే సామర్థ్యం, తదితర అంశాలను బేరీజు వేసాము.
  • ఇంటర్వ్యూ చేసిన అభ్యర్థులలో ఈ ప్రాజెక్టు సమన్వయకర్త ఉద్యోగానికి సరిపడు అభ్యర్థిగా ప్రణయ్‍రాజ్ వంగరిని ఎంపికచేసాము.
  • ప్రణయ్‍రాజ్, అభినందనలు!

— ప్రాజెక్టు కమిటీ తరఫున వీవెన్ (చర్చ) 13:27, 4 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]