వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సాహిత్యం

తెలంగాణ జానపదం - ఒగ్గు కథ . ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్ధం. ఈ పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది. ఇది అచ్చమైన దేశీపదం. ఈ పదానికి తెలుగు నిఘంటువుల్లో సరైన అర్థం ఇవ్వకపోవటం శోచనీయం. ఒగ్గు అనే పదానికి ‘జెగ్గు’,‘జగ్గు’ అని నామాంతరాలున్నాయి. శివుని చేతిలోని ప్రత్యేక వాయిద్యం ఢమరుకం. మన ప్రాచీన లాక్షణికులు, వైయాకరణులు ఢమరుకం నుంచి మహేశ్వర సూత్రాలు (అక్షరాలు) ఉద్భవించాయని చెప్పారు. అలా మొత్తం అక్షరాల పుట్టుకకి కారణమైన ఢమరుకాన్ని ఒక కళారూపానికి పేరుగా పెట్టి దానికి పూజార్హతని కల్పించిన కళారూపం ఒగ్గు కథాగానం మాత్రమే ” ఒగ్గు కథ తెలంగాణ జానపద కళారూపం.