వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ-ఐఐఐటి/నమూనా వ్యాసాలు/జి. నరేష్ పట్వారీ

గణపతి నరేష్ పట్వారీ (జననం 13 డిసెంబర్ 1972) ఒక భారతీయ రసాయన శాస్త్రవేత్త,ఇతను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బొంబాయి లో రసాయన శాస్త్ర ఆచార్యులు గా పని చేస్తున్నారు.[1]

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలంలో 13 డిసెంబర్ 1972 న జన్మించారు.[2]

విద్యాభ్యాసం

మార్చు

నరేష్ పట్వారీ తన సొంత గ్రామంలోపాఠశాల విద్య పూర్తి చేశాడు.అతడు 1992లో బి.ఎస్.సి సంపాదించిన తరువాత అండర్ గ్రాడ్యుయేట్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేసాడు,1994లో మాస్టర్స్ డిగ్రీ (ఎమ్మెస్సీ) పూర్తి చేయడానికి హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు.తదనంతరం,అతను 2000 లో పిహెచ్ డి పొందడానికి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో డాక్టరల్ పరిశోధన కోసం చేరాడు,తరువాత అతను 2000-02 సమయంలో జపాన్ సొసైటీ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ సైన్స్ ప్రదానం చేసిన ఫెలోషిప్ పై టోహోకు విశ్వవిద్యాలయంలో పోస్ట్ డాక్టరల్ చేశాడు,2003 లో అర్బానా-చాంపైన్ లోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయంలో తన పోస్ట్ డాక్టోరల్ పూర్తి చే చేశాడు.[3]

ఉద్యోగం

మార్చు

2003 లో బొంబాయిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు, 2007 లో అసోసియేట్ ప్రొఫెసర్‌గా అయ్యారు 2012 నుండి ప్రొఫెసర్ పదవిలో ఉన్నారు.[1]

అవార్డులు

మార్చు

శాస్త్రీయ పరిశోధన కోసం భారత ప్రభుత్వ అత్యున్నత సంస్థ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, 2017 లో రసాయన శాస్త్రాలకు చేసిన కృషికి గాను అత్యున్నత భారతీయ సైన్స్ అవార్డులలో ఒకటైన సైన్స్ అండ్ టెక్నాలజీకి శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతిని ప్రదానం చేసింది.[4]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "G. Naresh Patwari". www.chem.iitb.ac.in.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "G. Naresh Patwari". dbpedia.org.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Naresh Patwari". chemphysgrpiitb.wixsite.com.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Brief Profile of the Awardee". ssbprize.gov.in.{{cite web}}: CS1 maint: url-status (link)