వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ-ఐఐఐటి/నమూనా వ్యాసాలు/శ్రీకుమార్ బెనర్జీ

శ్రీకుమార్ బెనర్జీ
జాతీయతఇండియన్
విద్యమెటలర్జికల్ ఇంజినీరింగ్ బి.టెక్.(హానర్స్) డిగ్రీ, పిహెచ్ డి
వృత్తిహోమీ భాభా చైర్ ప్రొఫెసర్
ఉద్యోగంబాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్
పురస్కారాలుపద్మశ్రీ

శ్రీకుమార్ బెనర్జీ భారతీయ మెటలర్జికల్ ఇంజనీర్. భారత అటామిక్ ఎనర్జీ కమిషన్ (ఏఈసీఐ) ఛైర్మన్ గా, అణు శక్తి శాఖ కార్యదర్శి (డిఎఇ) గా పదవీ 2012 ఏప్రిల్ 30న విరమణ పొందాడు. డిఎఇ ఛైర్మన్ గా పదవీ బాధ్యతలు నిర్వహించడానికి ముందు, ఏప్రిల్ 30, 2004 నుండి మే 19, 2010 వరకు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బిఎఆర్ సి) డైరెక్టర్ గా[1] ఉన్నాడు. ప్రస్తుతం ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో డిఎఈ హోమి బాబా చైర్ ప్రొఫెసర్ గా విధులు నిర్వహిస్తున్నాడు.

విద్యాభ్యాసం మార్చు

1967లో బెనర్జీ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్ పూర్ నుంచి మెటలర్జికల్ ఇంజినీరింగ్ లో బి.టెక్.(హానర్స్) డిగ్రీనిపూర్తిచేసాడు. ఆ తర్వాత, బిఎఆర్ సి ట్రైనింగ్ స్కూల్ లో శిక్షణ పొందాడు. 1968 లో బిఎఆర్ సి మెటలర్జీ విభాగంలో చేరి తన సాంకేతిక వృత్తి జీవితాన్ని ఈ సంస్థలోనే గడిపాడు[2]. బిఎఆర్ సి లో చేరిన ప్రారంభపు పని రోజులలో బెనర్జీ చూపిన ప్రతిభకు గాను, 1974లో ఐఐటి ఖరగ్ పూర్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ లో పిహెచ్ డి డిగ్రీని ప్రదానం చేసింది.

యూనివర్సిటీ ఆఫ్ ససెక్స్, బ్రైటన్, ఇంగ్లాండ్, మాక్స్-ప్లాంక్-ఇన్స్టిట్యూట్ ఫర్ మెటాల్ఫోర్స్చుంగ్, సిన్సినాటీ విశ్వవిద్యాలయం, అమెరికాలోని ఓహియో స్టేట్ యూనివర్సిటీ (విజిటింగ్ ఫ్యాకల్టీగా) వంటి విదేశీ విద్య సంస్థల్లో బెనర్జీ సందర్శక హోదాను నిర్వహించారు.

పురస్కారాలు మార్చు

  • 1989 లో ఇంజనీరింగ్ సైన్స్ లో సైన్స్ అండ్ టెక్నాలజీకి శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతి
  • 2005లో భారత ప్రభుత్వ పౌర పురస్కారం పద్మశ్రీ[3]
  • 2010లో కలకత్తా విశ్వవిద్యాలయం చే గౌరవ డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ ప్రదానం[4]
  • ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, బెంగళూరు, నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్, ఇండియా, అలహాబాద్, ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ ఫెలో పురస్కారం.
  • డిఎఇ హోమీ భాభా చైర్ ప్రొఫెసర్, భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్
  • 21 మార్చి 2014 నుంచి ఐఐటి ఖరగ్ పూర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్మన్ గా మూడేళ్ల పాటు నియామకం.[5]

మూలాలు మార్చు

  1. "Dr Srikumar Banerjee". barc.gov.in/. Retrieved 26 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "Dr Srikumar Banerjee". web.archive.org/. Retrieved 26 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Padma Awards 2005". outlookindia.com/. Retrieved April 26, 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  4. "Annual Convocation". web.archive.org/. Retrieved April 26, 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "Dr. Srikumar Banerjee appointed as the Chairman". web.archive.org/. Retrieved 26 April 2021.{{cite web}}: CS1 maint: url-status (link)