వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ పాఠ్య ప్రణాళిక/పాఠ్యాశాలు/వాడుకరి చర్చాపేజీ

వాడుకరి చర్చాపేజీ

వికీపీడియాలో ప్రతి వాడుకరి పేజీకి కూడా ఒక చర్చాపేజీ ఉంటుంది. దీనికి కొన్ని ప్రత్యేక విశేషాలు ఉన్నాయి. వికీపీడియా సైటు తెరిచినపుడు కుడివైపు పైభాగంలోనూ, వాడుకరి పేజీ ట్యాబుకు పక్కనున్న ట్యాబులోనూ ఈ చర్చ అని కనిపిస్తుంటుంది. దానిని క్లిక్ చేస్తే మరో పేజీ ఓపన్ అవుతుంది. ఇప్పుడు చర్చాపేజీకి సంబంధించిన కొన్ని సంగతులు తెలుసుకుందాం.

1. వాడుకరి చర్చాపేజీ అంటే ఏమిటి?

ఇతర వాడుకరులు మీతో చర్చించడానికి తయారు చేయబడిన పేజీని వాడుకరి చర్చాపేజీ అంటారు.

2. ఎవరి చర్చాపేజీలో వారే రాసుకోవాలా? ఇతరుల చర్చాపేజీలో కూడా రాయవచ్చా?

ఇతరుల చర్చాపేజీలో కూడా రాయవచ్చు.

3. వాడుకరి చర్చాపేజీని ఎలా ఉపయోగించాలి? చర్చాపేజీలో ఎలాంటి చర్చలు చేయవచ్చు?

ఇతర వాడుకరుల చర్చ పేజీలో సందేశం రాయదలిస్తే ఆ వాడుకరి పేజీలోని చర్చ లింకును నొక్కి ఆ పేజీకి వెళ్ళవచ్చు. ఇటివలి మార్పులు పేజీలోను, మీ వీక్షణ జాబితా లోను ఉండే మార్పుల పక్కనే ఉన్న వాడుకరి పేరు, దానిని అనుసరించి ఉండే చర్చ లింకును నొక్కి కూడా చర్చ పేజీకి వెళ్ళవచ్చు.

4. వాడుకరి చర్చాపేజీలో రాసినది ఇతరులకు కనిపిస్తుందా?

ఇతరులు మీ చర్చ పేజీలో సందేశం రాస్తే, మీకు కొత్త సందేశాలు ఉన్నాయి అనే సందేశం మీకు కనిపిస్తుంది. కొన్నిసార్లు వ్యక్తిగత సందేశాల కొరకు కూడా వాడతారు; కానీ ఈ చర్చాపేజీ అందరికీ కనిపిస్తుంది.

5. ఎవరైనా నా చర్చాపేజీలో నా గురించి చెడుగా రాస్తే ఏంచేయాలి, వాటిని తొలగించవచ్చా?

ఎక్కువ మంది తమ వాడుకరి చర్చ పేజీని ఇతర చర్చ పేజీల వలెనే చూస్తారు - పాతవాటిని జాగ్రత్త చెయ్యడం మొదలైనవి చేస్తారు. మరి కొందరు చర్చ ముగిసిన తరువాత తీసివేస్తారు. అయితే, సందేశాలకు సమాధానాలివ్వకుండానే వాటిని తొలగించరాదు. దీనిని అమర్యాదగా భావించి, దాని వలన ఘర్షణలు తలెత్తి, మధ్యవర్తుల వరకూ వెళ్ళిన సందర్భాలు ఇంగ్లీషు వికీలో ఉన్నాయి. కాబట్టి, మీ గురించి ఎవరైనా చెడుగా రాస్తే ఆ విషయాన్ని వికీపీడియా సముదాయం దృష్టికి తీసుకెళ్ళండి. అప్పుడు సముదాయం తగిన చర్యలు తీసుకుంటుంది.

వీడియో పాఠ్యం

మార్చు

వికీపీడియాలో ప్రతి వాడుకరి పేజీకి కూడా ఒక చర్చాపేజీ ఉంటుంది. దీనికి కొన్ని ప్రత్యేక విశేషాలు ఉన్నాయి. వికీపీడియా సైటు తెరిచినపుడు కుడివైపు పైభాగంలోనూ, వాడుకరి పేజీ ట్యాబుకు పక్కనున్న ట్యాబులోనూ ఈ చర్చ అని కనిపిస్తుంటుంది. దానిని క్లిక్ చేస్తే మరో పేజీ ఓపన్ అవుతుంది. వాడుకరి చర్చాపేజీ అంటే ఏమిటి, దానిని ఎందుకు ఉపయోగిస్తాం అనే విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం.

ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా మనతో చాట్ చేయడానికి మెసెంజర్, చాట్ బాక్స్ లాంటి ప్రత్యేక సౌకర్యాలు ఉన్నాయి. వాటిమాదిరిగానే వికీపీడియాలో కూడా ఒకరికొకరు చర్చించుకోవడానికి లేదా సంప్రదింపులు జరపుకోవడానికి ‘వాడుకరి చర్చాపేజీ’ ఏర్పాటు చేయబడింది. దీనిద్వారా వాడుకరులు వ్యక్తిగతంగా ఒకరినొకరు సందేశాలు పంపించుకోవచ్చు. మీ చర్చాపేజీలో ఎవరైనా మీకు ఒక సందేశాన్ని పంపినపుడు మెయిల్ ద్వారా నోటిఫికేషన్ పంపబడుతుంది లేదా వికీపీడియా సైటును తెరిచినపుడు కూడా ఆ సందేశం గురించి తెలుస్తుంది.

ఇతర వాడుకరుల చర్చ పేజీలో సందేశం రాయదలిస్తే ఆ వాడుకరి పేజీలోని చర్చ లింకును నొక్కి ఆ పేజీకి వెళ్ళవచ్చు. ఇటివలి మార్పులు పేజీలో మార్పుల పక్కనే ఉన్న వాడుకరి పేరు, దానిని అనుసరించి ఉండే చర్చ లింకును నొక్కి కూడా వాడుకరి చర్చాపేజీకి వెళ్ళవచ్చు. మీరు ఎవరికైతే సందేశాన్ని అందించాలనుకుంటున్నారో ఆ వాడుకరి చర్చాపేజీకి వెళ్ళి, పైనఉన్న ‘విషయాన్ని చేర్చు’ అనే ట్యాబును క్లిక్ చేసి, కింది బాక్స్ లో మీ చెప్పదలచిన సందేశాన్ని రాసి సంతకం చేయాలి. సంతకం చేయడానికి బాక్స్ పైనున్న పెన్ గుర్తును ఉపయోగించాల్సివుంటుంది. ఆ తరువాత మీరు రాసిన సందేశం ఎలా కనిపిస్తోందనని చూసుకోవడం కోసం బాక్స్ కిందనున్న ‘మునుచూపు చూడు’ అనే బాక్స్ ను క్లిక్ చేస్తే, మీరు రాసిన సందేశం కనిపిస్తుంది. సరిగా ఉందో లేదో చూసుకున్న తరువాత, కిందనున్న ‘దిద్దుబాటు సారాంశం’ బాక్స్ లో వివరాలు రాసి, ‘ప్రచురించు’ బాక్స్ ను క్లిక్ చేస్తే, మీరు రాసిన సందేశం పక్కన మీ వాడుకరి పేరుతోపాటు మీరు సందేశాన్ని పంపించిన సమయం కూడా వస్తుంది.

ఒకవేళ మీరు విజువల్ ఎడిటర్ ను ఉపయోగిస్తున్నట్టయితే, సంతకం అనేది దానికదే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మళ్ళీ మీరు ప్రత్యేకంగా సంతకం చేర్చాల్సినవసరంలేదు.

ఎవరైనా రాసిన సందేశానికి మీరు కామెంట్స్ రాయాలనుకున్నప్పుడు, పైన ఉన్న సవరించు ట్యాబును క్లిక్ చేసి, ఇతర వాడుకరి రాసిన సందేశం కింద మీ కామెంట్ ను రాసి, మీ సంతకం చేర్చి ‘ప్రచురించు’ బాక్స్ ను క్లిక్ చేయాల్సివుంటుంది.

చర్చాపేజీలో చర్చలు చేస్తున్నపుడు ఫస్ట్ రిప్లైకి ముందు ఒక కొలన్, సెకండ్ రిప్లైకి ముందు రెండు కొలన్స్, థర్డ్ రిప్లైకి ముందు మూడు కొలన్స్ చేర్చాల్సివుంటుంది. అలా కొలన్స్ చేర్చడం వల్ల జరుగుతున్న చర్చలు చదవడానికి అనుకూలంగా కనిపిస్తాయి.

వికీపీడియా వాడుకరి చర్చాపేజీ గురించి తెలుసుకున్నారు కదా, ఇక ఆలస్యం చేయకుండా వెంటనే వికీపీడియాలో అకౌంట్ ఓపన్ చేసి, చకచకా మీకు తెలిసిన సమాచారాన్ని వికీపీడియాలో రాసేయండి మరి.