వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ పాఠ్య ప్రణాళిక/పాఠ్యాశాలు/వ్యాస వివరాల పరిచయం

వికీపీడియా వ్యాస వివరాల పరిచయం

వికీపీడియా వ్యాస వివరాల (చదువు, సవరించు, చరిత్ర, చర్చాపేజీ మొ.నవి) పరిచయం (సోర్స్, విజువల్ ఎడిటింగ్, మోబైల్) వికీపీడియాలో సమాచారం వ్యాసాల రూపంలో ఉంటుంది. మనం ఏ అంశానికి సంబంధించిన వ్యాసానైనా తెరిచినపుడు అందులో విభాగాలు కనిపిస్తుంటాయి. వాటిని వ్యాస వివరాలు అంటారు. వాటికి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

1. వికీపీడియా వ్యాసం అంటే ఏమిటి?

వికీపీడియాలో ఒక్కో వ్యాసం ఒక్కో పేజీలో ఉంటుంది. కొన్ని పెద్ద వ్యాసాలను ఒకటి కంటే ఎక్కువ పేజీలుగా విభజించవచ్చు. వికీపీడియాలో ఒక వ్యాసపు పేజీని తెరిచినపుడు వ్యాసం, విజ్ఞాన సర్వస్వంలో ఉండదగిన అర్హతలు కలిగి, చదవడానికి వీలుగా సమాచారాన్ని కలిగివున్న దానిని వికీపీడియా వ్యాసం అంటారు.

2. వికీపీడియా వ్యాసం ఎలా ఉంటుంది?

మీరు ప్రస్తుతం ఈ ట్యాబ్లోనే ఉన్నారు. ఇక్కడ విషయానికి సంబంధించిన వ్యాసం ఉంటుంది. వ్యాస విషయానికే ఇక్కడ ప్రాధాన్యత. వ్యాసం గురించిన మీ అభిప్రాయాలు ఇక్కడ వ్రాయరాదు. సభ్యుల పేర్లు, ఇతర వివరాలు ఇక్కడ వ్రాయరాదు. ఇతరులను సంబోధిస్తూ వ్రాయడం కూడా ఈ పేజీలో నిషిద్ధం. వ్యాసంలో ఏదేని విషయం తప్పని మీకు నిర్ధారణగా తెలిస్తే, నిర్మొహమాటంగా దాన్ని సరిదిద్దండి.

3. వికీపీడియా వ్యాసానికి సంబంధించి ఏఏ భాగాలు ఉంటాయి?

వికీపీడియా వ్యాసానికి సంబంధించి, వ్యాసం పైన కొన్ని టాబ్స్ ఉంటాయి. అవి: వ్యాసం, చర్చ, చదువు, సవరించు, చరిత్ర, తరలించు, వీక్షించు/వీక్షించవద్దు అనే భాగాలు ఉంటాయి.

4. వ్యాస చర్చాపేజీలో ఏం రాయవచ్చు?

వ్యాసాలనికి (పేజీకి) సంబంధించిన మార్పులు, ఇతర అంశాల గురించి వాడుకరులు చర్చలు జరిపే పేజీని చర్చాపేజీ అంటారు. వ్యాసాన్ని మెరుగుపరచడానికి సంబంధించి ఏదైనా ప్రశ్నలేదా వ్యాఖ్య ఉంటే వ్యాసపు చర్చాపేజీలో దాన్ని రాయవచ్చు. ఈ వ్యాసానికి సంబంధించి, సభ్యుల అభిప్రాయాలు, వాదనను ఇక్కడ చూడవచ్చు. వ్యాసంలో ఏదేని విషయం తప్పని మీకు అనిపిస్తే, అది ఖచ్చితంగా తప్పేనని మిరు నిర్ధారించుకోలేకపోతే, ఆ విషయాన్ని ఈ చర్చా పేజీలో వ్రాయవచ్చు. ఈ చర్చ వ్యాస విషయానికి సంబంధించి మాత్రమే అయి ఉండాలి, వ్యక్తిగత చర్చలు కూడవు.

5. సవరించు అంటే ఏమిటి?

వికీపీడియా వ్యాసంలో సవరించు అనగా వ్యాసంలో సవరణలు చేయడం అని అర్థం. వికీపీడియా వ్యాసంలోని ఏదైనా సమాచారాన్ని మార్చడంగానీ, చేర్చడంగానీ చేయాలనుకుంటే సవరించు అనే ట్యాబ్ నొక్కడం ద్వారా ఎవరైనా వ్యాసంలో సవరణలు చేయవచ్చు. (అది చాలా సులభం. పేజీ కి పైన ఉన్న "సవరించు" అనే ట్యాబును గానీ, "మూలపాఠ్యాన్ని సవరించు" అనే ట్యాబును గానీ నొక్కితే పేజీ మొత్తాన్నీ దిద్దుబాటు చెయ్యవచ్చు. ఏదైనా విభాగపు శీర్షికకు పక్కన ఉన్న "మార్చు" అనే లింకును గానీ, "మూలపాఠ్యాన్ని సవరించు" లింకును గానీ నొక్కితే ఆ ఒక్క విభాగాన్నే దిద్దుబాటు చెయ్యవచ్చు.)

6. చరిత్ర అనే విభాగంలో ఏం ఉంటుంది?

వ్యాసం పేజీలోగానీ, చర్చా పేజీలో గాని ఇప్పటివరకు జరిగిన మార్పు చేర్పుల జాబిత ఈ చరిత్ర అనే విభాగంలో ఉటుంది. ఎవరెవరు, ఏయే మార్పులు, ఎప్పుడెప్పుడు చేసారో తెలిపే చక్కటి జాబితా ఇది. చరిత్ర ట్యాబుకు వెళ్ళి నపుడు, మీరు వ్యాసం పేజీ చరిత్ర చూస్తున్నారా, లేక చర్చ పేజీ చరిత్ర చూస్తున్నారా అనేది తెలుపుతూ సంబంధిత ట్యాబ్ లు తెరుచుకుని ఉంటాయి.

7. తరలించు అనే విభాగంలో ఏం ఉంటుంది?

వ్యాసంలో మార్పులు చెయ్యాలనిపిస్తే ఎలా మార్పులు చెయ్యాలో చూసాం. కానీ వ్యాసం పేరు తప్పైతే, దాన్ని మార్చడం ఎలా? వ్యాసం పేరు అంటే పేజీ పేరు. అంటే పేజీ పేరును మార్చాలన్నమాట! దానికి వీలు కల్పించేదే ఈ తరలించు. దీన్ని నొక్కినపుడు, ఈ పేజీని ఏ పేజీకి తరలించాలో అడుగుతూ ఒక పెట్టె కనబడుతుంది. ఆ పెట్టెలో కొత్త పేజీ పేరు వ్రాసి మీటను నొక్కగానే వ్యాసం కొత్త పేజీకి తరలిపోతుంది. వ్యాసం పేరు కూడా ఆటోమాటిగ్గా మారిపోతుంది.

8. వీక్షించు/వీక్షించవద్దు అనే విభాగంలో ఏం ఉంటుంది?

ఒకసారి నొక్కితే వీక్షించు అవుతుంది, మరోసారి నొక్కితే వీక్షించవద్దు అవుతుంది. వీక్షించేటపుడు ఆ పేజీలో జరిగిన మార్పులు జరిగిఉంటే, ఇటీవలి మార్పులులో ఆ పేజీ పేరు బొద్దు అక్షరాలతో కనిపిస్తుంది. వద్దనుకుంటే మామూలుగా కనపడుతుంది.

9. వికీపీడియా వ్యాస శీర్షిక, ఉప శీర్షిక అంటే ఏమిటి? శీర్షికల అవసరం ఏంటి?

వికీపీడియా వ్యాస పేజీ పేరును వికీపీడియా వ్యాస శీర్షిక అని, వికీపీడియా వ్యాసంలో వివిధ విభాగాలు ఉన్నప్పుడు వాటికి పేర్లు పెట్టడాన్ని ఉప శీర్షిక అంటారు. ఈ శీర్షికల వల్ల వ్యాసం ఒకే విధమైన పాఠ్యంతో కాకుండా ఓ క్రమపద్ధతిలో అమర్చడానికి శీర్షికలు, ఉపశీర్షికలు ఉపయోగపడతాయి. వ్యాసాన్ని వ్యాసంలో రెండు మూడు విషయాల గురించి రాస్తూ ఉంటే, వాటిని విభాగాలుగా విడగొట్టి ప్రత్యేక శీర్షికల కింద పెట్టవచ్చు

10. సమాచారపెట్టె అంటే ఏమిటి? దాని ఉపయోగం ఏమిటి?

వికీపీడియా వ్యాసంలో కుడి ఎగువ భాగంలో, లీడ్ సెక్షన్ పక్కన, (డెస్క్‌టాప్ వీక్షణలో) లేదా వ్యాసం యొక్క పైభాగంలో (మొబైల్ వీక్షణలో) వ్యాసపు విషయానికి సంబంధించిన ముఖ్య విషయాలను కలిగివుండేదే ఈ సమాచారపెట్టె. ఈ సమాచార పెట్టెలు ఫోటో గానీ, పటాన్ని గానీ కూడా కలిగి ఉండవచ్చు. వ్యాసానికి సంబంధించి ముఖ్య విషయాలను తెలుసుకోవడానికి ఈ సమాచారపెట్టె ఉపయోగపడుతుంది. ఇది ఎంత తక్కువ సమాచారాన్ని కలిగి ఉంటే, అంత ప్రభావవంతంగా ఉంటుంది.

11. మూలాలు, వనరులు అంటే ఏమిటి?

వికీపీడియాలో రాసిన సమాచారం ధృవీకరించడానికి చేర్చే వాటిని మూలాలు లేదా వనరులు అంటారు. అది ఒక పుస్తకం కావచ్చు, ఒక వెబ్‌సైటులోని పేజీ లాంటివి ఏదయినా కావచ్చు. చేర్చిన మూలాన్ని ఇతర సభ్యులు లేదా పాఠకులు నిర్ధారించగలిగేటట్లు ఉండాలి.

12. ఇవికూడా చూడండి ఎందుకు?

పాఠకుడు చదువుతున్న వికీపీడియా వ్యాస అంశానికి సంబంధించి ఉన్న ఇతర వ్యాసాల లింకులు ఈ విభాగంలో చేర్చబడుతాయి. దానివల్ల, పాఠకుడు మరింత సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది.

13. బయటి లంకెలు/బాహ్య లింకులు ఎందుకు?

కాపీహక్కుల కారణంగా వికీపీడియా వ్యాసం పేజీలో పెట్టలేని విషయాన్ని కలిగిఉండి, ఆ విషయంపై ఖచ్చితమైన సమాచారం అందించే వాటిని వ్యాసంలో మూలంగా చేర్చలేము. అలాంటి వాటికోసం వ్యాసం కింది భాగంలో బయటి లంకెలు/బాహ్య లింకులు అనే ఒక విభాగం పెట్టి అందులో ఆ లింకులను చేర్చవచ్చు.

14. వర్గాలు అంటే ఏమిటి? వాటి ఉపయోగం ఏమిటి?

ఒక అంశానికి సంబంధించిన లేదా ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యాసాలు అన్ని ఒకచోటే ఉంటూ పాఠకులకు సులభంగా లభించడానికి వ్యాసంలో అడుగున చేర్చే లింకును వర్గం అంటారు. వికీపీడియాలోని ప్రతీ వ్యాసపు పేజీ ఏదో ఒక వర్గం కిందకు రావాల్సివుంటుంది. పాఠకులు తమకు కావలసిన సమాచారం కొరకు వెదకేటపుడు ఈ వర్గాలు ఉపయోగపడతాయి.

15. మరిన్ని అనే విభాగంలో ఏం ఉంటుంది.

ఈ విభాగంలో తరలించు అనే ట్యాబు ఉంటుంది. దీనితో వ్యాసాన్ని ఒక పేరు నుండి ఇంకో పేరుకు తరలించవచ్చు.

వీడియో పాఠ్యం

మార్చు

వికీపీడియాలో సమాచారమంతా వ్యాసాల రూపంలో ఉంటుందని మాట్లాడుకున్నాం కదా, వికీపీడియాలో మనం ఏ అంశానికి సంబంధించిన వ్యాసానైనా తెరిచినపుడు అందులో వివిధ విభాగాలు మనకు కనిపిస్తుంటాయి. వాటినే వ్యాస వివరాలు అంటారు. వాటికి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

వికీపీడియాలో ఏదైనా ఒక వ్యాసపు పేజీని తెరిచినపుడు వ్యాసం, విజ్ఞాన సర్వస్వంలో ఉండదగిన అర్హతలు కలిగి, చదవడానికి వీలుగా సమాచారాన్ని కలిగివున్న దానిని వికీపీడియా వ్యాసం అంటారు. వ్యాస విషయానికే ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. మన అభిప్రాయాలను, సభ్యుల పేర్లను ఇక్కడ రాయకూడదు.

ఇక, వికీపీడియా వ్యాసానికి వస్తే... వ్యాసం పైన కొన్ని ట్యాబ్స్ ఉంటాయి. ఆయా ట్యాబ్స్ లో వ్యాసం, చర్చ, చదువు, సవరించు, చరిత్ర, తరలించు, వీక్షించు/వీక్షించవద్దు అనే భాగాలు ఉంటాయి. ఇప్పుడు ఆయా విభాగాల గురించి తెలుసుకుందాం...

వ్యాస చర్చాపేజీ

వ్యాసాలనికి సంబంధించిన మార్పులు, ఇతర అంశాల గురించి వాడుకరులు చర్చలు జరిపే పేజీని చర్చాపేజీ అంటారు. వ్యాసాన్ని మెరుగుపరచడానికి సంబంధించి ఏదైనా ప్రశ్నలేదా వ్యాఖ్య ఉంటే వ్యాసపు చర్చాపేజీలో దాన్ని రాయవచ్చు. ఈ వ్యాసానికి సంబంధించి, సభ్యుల అభిప్రాయాలు, వాదనను ఇక్కడ చూడవచ్చు

సవరించు

వికీపీడియా వ్యాసంలో సవరించు అనగా వ్యాసంలో సవరణలు చేయడం అని అర్థం. వికీపీడియా వ్యాసంలోని ఏదైనా సమాచారాన్ని మార్చడంగానీ, చేర్చడంగానీ చేయాలనుకుంటే సవరించు అనే ట్యాబ్ నొక్కడం ద్వారా ఎవరైనా వ్యాసంలో సవరణలు చేయవచ్చు.

చరిత్ర

వ్యాసం పేజీలోగానీ, చర్చా పేజీలోగానీ ఇప్పటివరకు జరిగిన మార్పులచేర్పుల జాబిత అనేది చరిత్ర విభాగంలో ఉటుంది. ఎవరెవరు, ఏయే మార్పులు, ఎప్పుడెప్పుడు చేసారో తెలిపే జాబితా ఇది.

మరిన్ని

ఈ విభాగంలో తరలించు అనే ట్యాబు ఉంటుంది. దీనితో వ్యాసాన్ని ఒక పేరు నుండి ఇంకో పేరుకు తరలించవచ్చు.

వ్యాస శీర్షిక, ఉప శీర్షిక

వికీపీడియా వ్యాస పేజీ పేరును వికీపీడియా వ్యాస శీర్షిక అని, వికీపీడియా వ్యాసంలో వివిధ విభాగాలు ఉన్నప్పుడు వాటికి పేర్లు పెట్టడాన్ని ఉప శీర్షిక అంటారు. ఈ శీర్షికల వల్ల వ్యాసం ఒకే విధమైన పాఠ్యంతో కాకుండా ఓ క్రమపద్ధతిలో అమర్చడానికి శీర్షికలు, ఉపశీర్షికలు ఉపయోగపడతాయి.

సమాచారపెట్టె

వికీపీడియా వ్యాసంలో కుడివైపు పైభాగంలో వ్యాసపు విషయానికి సంబంధించిన ముఖ్య విషయాలను కలిగివుండే దానిని సమాచారపెట్టె అంటారు. వ్యాసానికి సంబంధించి ముఖ్య విషయాలను తెలుసుకోవడానికి ఈ సమాచారపెట్టె ఉపయోగపడుతుంది.

మూలాలు, వనరులు

వికీపీడియాలో రాసిన సమాచారం ధృవీకరించడానికి చేర్చే వాటిని మూలాలు లేదా వనరులు అంటారు. చేర్చిన మూలాన్ని ఇతర సభ్యులు లేదా పాఠకులు నిర్ధారించగలిగేటట్లు ఉండాలి.

ఇవికూడా చూడండి

పాఠకుడు చదువుతున్న వికీపీడియా వ్యాస అంశానికి సంబంధించి ఉన్న ఇతర వ్యాసాల లింకులు ఈ విభాగంలో చేర్చబడుతాయి. దానివల్ల, పాఠకుడు మరింత సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది.

బయటి లంకెలు/బాహ్య లింకులు

కాపీహక్కుల కారణంగా వికీపీడియా వ్యాసం పేజీలో పెట్టలేని విషయాన్ని కలిగిఉండి, ఆ విషయంపై ఖచ్చితమైన సమాచారం అందించే వాటిని వ్యాసంలో మూలంగా చేర్చలేము. అలాంటి వాటికోసం వ్యాసం కింది భాగంలో బయటి లంకెలు/బాహ్య లింకులు అనే ఒక విభాగం పెట్టి అందులో ఆ లింకులను చేర్చవచ్చు.

వర్గాలు

ఒక అంశానికి సంబంధించిన లేదా ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యాసాలు అన్ని ఒకచోటే ఉంటూ పాఠకులకు సులభంగా లభించడానికి వ్యాసంలో అడుగున చేర్చే లింకును వర్గం అంటారు. పాఠకులు తమకు కావలసిన సమాచారం కొరకు వెదికేటపుడు ఈ వర్గాలు ఉపయోగపడతాయి.