వికీపీడియా:వికీప్రాజెక్టు/తెవికీ మహిళావరణం/విశాఖపట్టణం/2018 మార్చి 10 కార్యశాల

మహిళావరణం కార్యక్రమ నిర్వహణలో భాగంగా విశాఖపట్టణంలో మహిళలకు ప్రత్యేకించిన కొన్ని చిరు కార్యశాలలు నిర్వహించుకుంటున్నాం. ఈ కార్యశాలల వివరాలు కింద చూడవచ్చు:

వివరాలు మార్చు

ప్రదేశం
బుద్ధవరపు గార్డెన్స్, సుప్రీం హోటల్ వీధి, మహారాణి పేట, వైజాగ్ 02
తేదీ
2018 మార్చి 10, శనివారం - ఉదయం 10 నుంచి సాయంత్రం 3.30 వరకు
పాల్గొనేవారికి సూచనలు
దయచేసి మీ లాప్‌టాప్ మీరే తీసుకురాగలరు, కార్యక్రమానికి రావడానికి ముందు వీలు చూసుకుని ఇక్కడ తెలుగు వికీపీడియాలో ఖాతా సృష్టించుకోగలరు. ఏదైనా సాయం కావాలంటే pavansanthosh.s@gmail.comకి సంప్రదించగలరు.

నిర్వాహకులు మార్చు

  • పవన్ సంతోష్
  • లలిత పండ్రంకి, తెలుగు వికీపీడియా ఔత్సాహికురాలు

పాల్గొనేవారు మార్చు

పాల్గొనే సభ్యులు ముందస్తుగా తెలుగు వికీపీడియాలో ఖాతా సృష్టించుకోగలరు. మీ ఖాతాతో లాగిన్ అయ్యాకా # --~~~~ అన్నదానితో కింద సంతకం చేయడం ద్వారా పాల్గొనే సభ్యుల్లో మీ పేరు చేర్చగలుగుతారు

నేర్చే అంశాలు మార్చు

  • తెలుగు వికీపీడియాలో మహిళలు ఎందుకు రాయాలి?
    • స్వేచ్ఛా విజ్ఞానం
    • తెలుగులో విజ్ఞానం అవసరం
    • సమాచారంలో వైవిధ్యం
    • వ్యవస్థీకృత అప్రయత్న వివక్షను తగ్గించడం
  • తెలుగు వికీపీడియాలో రాయడం ఎలాగ?
    • ఖాతా సృష్టించడం
    • ఏ అంశాలపై రాయవచ్చు
    • వికీపీడియా మూల సూత్రాలు
    • మూలాల ఆవశ్యకత
  • కృషిచేయడానికి అవసరమయ్యే అంశాలు
    • మూలాలు ఎలా దొరుకుతాయి?
    • నిష్పాక్షికత ఎలా సాధించాలి?
    • మౌలికంగా పనికివచ్చే ఉపకరణాలు

తర్వాతి కార్యక్రమాలు మార్చు

ఈ కార్యక్రమాన్ని అనుసరించి సభ్యులను తెలుగు వికీపీడియన్లుగా మలుస్తూ, వారి ద్వారా మరింతమందికి తెలుగు వికీపీడియాను చేరవేస్తూ భవిష్యత్ కార్యక్రమాలు జరుగుతాయి.

నివేదిక మార్చు

  • కార్యక్రమం ఉదయం 10.20 నిమిషాలకు ప్రారంభం అయింది. కార్యక్రమానికి ఇనుగంటి ఆండాళ్ళు, లలిత పండ్రంగి, గాయత్రి వాడవల్లి, సువర్ణ సుందరి, మిథున, తదితరులు హాజరయ్యారు.
  • కార్యక్రమానికి హాజరైన సభ్యుల్లో ఒకరైన లలిత పండ్రంగి తమ ఇంట్లోనే కార్యక్రమాన్ని ఏర్పాటుచేసి వైఫై వంటి అనేకాంశాల్లో సహకరించారు.
  • ముందుగా జరిపిన చర్చల ఆధారంగా సామాజిక మాధ్యమాల్లో తెలుగులో రాస్తూ, తెలుగు టైపింగ్ అలవాటు, పుస్తక పఠనం వంటివి అలవాటున్న విశాఖ మహిళలను లలిత పండ్రంగి ఎంపికచేసి ఆహ్వానించారు.
  • వచ్చినవారిలో కొందరు ముందస్తుగా ఖాతాలు సృష్టించుకున్నారు, మిగిలినవారు కార్యక్రమం ప్రారంభంలో సృష్టించుకున్నారు.
  • తెలుగు వికీపీడియా 5 మూలస్తంభాలను తేలికైన పద్ధతిలో వివరించి ప్రారంభించడం జరిగింది.
  • తర్వాత లాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు వంటివాటితో లాగిన్ అయి తెలుగు వికీపీడియాలో రాయడం ప్రారంభించారు.
  • మొదట వారి వారి వాడుకరి పేజీలు సృష్టించుకున్నారు, తమ గురించి తాము రాయదగ్గ విషయాలు రాశారు.
  • అభిరుచులు తెరిచి వాటిలో ఎలా మార్పుచేర్పులు చేసుకుని తెలుగు వికీపీడియాలో కావాల్సిన ఉపకరణాలు (హాట్‌కేట్, వికీపీడియా అనువాద ఉపకరణం వంటివి) ఎనేబుల్ చేసుకుని వాడుకోవడం నేర్చుకున్నారు.
  • కొందరు హాట్‌కేట్ వాడి కొన్ని వ్యాసాలకు వర్గాలు చేర్చడం ఎలానో చూశారు. ఆసక్తిని అనుసరించి ఒకరిద్దరు అనువాద ఉపకరణాన్ని తెరిచి వాడడం అలవరుచుకున్నారు.
  • ఇప్పటికే ఫోటోలు తీసే అలవాటున్న సభ్యురాలు తాను తీసిన ఫోటో ఎలా వికీమీడియా కామన్సులో చేర్చవచ్చో నేర్చుకున్నారు.
  • తెలుగు వికీపీడియన్ వాడుకరి:T.sujathaతో మాట్లాడి భవిష్యత్తులో ఏదైనా సందేహాలు వస్తే సంప్రదిస్తామని సభ్యులు పేర్కొన్నారు, ఆవిడా సంతోషంగా అంగీకరించడం జరగింది.
  • మధ్యాహ్నం భోజనాన్ని సభ్యులు అందరూ చెరొక వంటకం తెచ్చి, కలిసి ఒక పిక్నిక్‌లాగా జరుపుకున్నారు. సాహిత్యపరంగానూ, అక్షరాలతోనూ తమకున్న ఆసక్తులు పంచుకున్నారు.
  • భవిష్యత్తులో మరిన్ని చిరు సమావేశాలు నిర్వహించుకోవాలని, వికీపీడియా మీద రాయడం ప్రారంభించాకా సందేహాలు వస్తే ప్రస్తుత సభ్యులను అడిగి తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు.
  • వీరిలో నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్న సభ్యులందరినీ వికీపీడియా:కొత్తవారికి సహాయంలో చేర్చడం జరిగింది.