వికీపీడియా:వికీప్రాజెక్టు/ప్రాజెక్టు తెలుగు వికీ

ప్రాజెక్ట్ తెలుగు వికీ అనేది 2019 వ సంవత్సరాంతంలో ప్రారంభమైన తెలుగు వికీపీడియా అభివృద్ధి విభాగం. ఐఐఐటీ-హైదరాబాద్ మరియు తెలంగాణ డిజిటల్ మీడియా విభాగం సంయుక్తంగా ఈ సమాచారభివృద్ధి ప్రాజెక్ట్ రూపకల్పన చేసాయి. తెలుగులో విస్తృతంగా,స్వేచ్చగా,స్వచ్చందంగా రాయగలిగే ఔత్సాహికులను ఎన్నిక చేసి,తగు శిక్షణనిచ్చి విజ్ఞాన సర్వస్వాభివద్ధి చేయడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఇందులో భాగంగానే 23 డిసెంబర్ 2019 నుండి 1 జనవరి,2020 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన 33వ జాతీయ పుస్తక ప్రదర్శనలో ఒక స్టాల్‌ను ఏర్పాటు చేసారు. లక్షలాది మంది పుస్తక ప్రియులు,ప్రజలు హాజరైన ఈ మహా ప్రదర్శనా ప్రాంగణంలో వికీపీడియా ఔత్సాహికులతో తెలుగు వికీపీడియా గురించి కరపత్రాలు,పటాలు,సమాచారాలతో వేలమందికి అవగాహన కల్పించారు. వైవిధ్యంగా ప్రచారం చేసారు. ఈ శిబిరంలో సంబంధిత శాఖల ఉన్నతాధికారులు,ప్రముఖులు,మేధావులు,కళాకారులు,ప్రొఫెసర్లు,విద్యార్ధులు,సామాన్య ప్రజలు ఆసక్తిగా పాల్గొన్నారు. టీవీ,దినపత్రికలు,సోషల్ మీడియాలో ప్రాజెక్ట్ సమాచార ప్రచారం జరిగింది. సమాచార అభివృద్ధిలో తెలుగు వికీమీడియా లక్ష్యసాధన దిశగా కృషి చేస్తోంది.