వికీపీడియా:వికీప్రాజెక్టు/లక్ష వ్యాసాల దిశగా ప్రగతి/ప్రస్థానం
లక్ష వ్యాసాల లక్ష్యాన్ని చేరే క్రమంలో తెవికీ సాగించిన ప్రయాణం, మలుపులు, మైలురాళ్ళను ఇక్కడ చూడవచ్చు.
వ్యాసాల సంఖ్యల్లో తేడా ఎందుకుంది?
మార్చుప్రాజెక్టు పేజీలో పైన చూపిస్తున్న సంఖ్యకు, డేటాబేసులో క్వెరీ ద్వారా తెచ్చిన సంఖ్యకూ తేడా ఉంటోంది. అలా ఎందుకు? జూన్ 25 ఉదయం 8 గంటలకు, ప్రాజెక్టు పేజీలో, మొత్తం 96,493 వ్యాసాలున్నాయని చూపించగా, అదే సమయానికి క్వారీలో ఈ క్వెరీ ద్వారా డేటాబేసును అడిగినపుడు 96,587 అని చూపించింది. ఈ 94 వ్యాసాల తేడా ఎందుకు వచ్చిందంటే..
ప్రాజెక్టు పేజీలో ఉన్న సంఖ్య {{NUMBEROF|articles|te}} ద్వారా తెచ్చాం. ఇది వ్యాసాల సంఖ్యను లెక్కించడంలో ఒక విశిష్టతను పాటిస్తుంది - అది కనీసం ఒక్కటైనా వికీలింకు ఉన్న వ్యాసాలనే లెక్కలోకి తీసుకుంటుంది. అసలు వికీలింకంటూ లేని వ్యాసాలను లెక్కలోకి తీసుకోదు. క్వారీలో అడిగిన క్వెరీలో ఆ నిబంధన పెట్టలేదు. ప్రత్యేకపేజీల్లోని అగాధ పేజీలు పేజీలో ఉన్న పేజీల సంఖ్య వీటి మధ్య ఉన్న తేడాకు దాదాపుగా సరిపోతోంది. ఒక్క వికీలింకు లేని పేజీలే గదా అగాధ పేజీలంటే!
- అగాధ పేజీలను లెక్కలోకి తీసుకున్నప్పటికీ, ఇంకా 3 వ్యాసాల తేడా ఉంది గదా, అలా ఎందుకుంది?
- ఇప్పుడు అందరం కలిసి దాన్ని పరిశోధించాలి.
ఇంతకీ పై లెక్క జూన్ 25 నాటిది. జూన్ 28 నాటికి అగాధ పేజీల సంఖ్య 126 కు చేరింది.
వివిధ వికీపీడియాల్లో అగాధ పేజీలు
మార్చుజూన్ 28 న ఇతర ఇండిక్ వికీపీడియాల్లో పరిస్థితి ఇలా ఉంది
- తమిళంలో అగాధ పేజీల సంఖ్య: 1724
- మలయాళంలో అగాధ పేజీల సంఖ్య: 1049
- కన్నడంలో అగాధ పేజీల సంఖ్య: 819
- హిందీలో అగాధ పేజీల సంఖ్య: 3810
- బెంగాలీలో అగాధ పేజీల సంఖ్య: 311
- మరాఠీలో అగాధ పేజీల సంఖ్య: 778
- పంజాబీలో అగాధ పేజీల సంఖ్య: 127
- గుజరాతీలో అగాధ పేజీల సంఖ్య: 135
- ఒరియాలో అగాధ పేజీల సంఖ్య: 17
- అస్సామీలో అగాధ పేజీల సంఖ్య: 175
సరే, ఇంగ్లీషులో ఎన్ని ఉన్నాయంటే - 7! ఫ్యాక్టోరియల్ (5040) కాదది, ఆశ్చర్యార్థకం. 68 లక్షల వ్యాసాలున్న ఇంగ్లీషు వికీపీడియాలో అగాధ పేజీల సంఖ్య: కేవలం ఏడు! దాని నిర్వహణ, దాని నాణ్యత స్థాయి అది.
వ్యాసాల్లో జరిగిన దిద్దుబాట్లు, అవి చేసిన వాడుకరులు
మార్చుజూన్ 25 నాటి గణాంకాలు
- తెవికీలో ఇప్పటి వరకు 88,576 మంది దిద్దుబాట్లు చేసారు. వారిలో 52,467 మంది అజ్ఞాత వాడుకరులు (ఐపీ చిరునామాలు) కాగా 36,109 మంది నమోదైన వాడుకరులు
- వీరిలో వ్యాసాలు సృష్టించిన వాడుకరులు 3,781 కాగా, అందులో 2,099 మంది అజ్ఞాత వాడుకరులు (ఐపీ చిరునామాలు), 1,682 మంది నమోదైన వాడుకరులు
- వెయ్యికి పైగా వ్యాసాలు సృష్టించినవారు 17
- 500 - 1000 మధ్య వ్యాసాల సృష్టికర్తలు 11
- 100 - 500 మధ్య వ్యాసాల సృష్టికర్తలు 28
- 100 - 50 వ్యాస సృష్టికర్తలు 21
- 50 లోపు వ్యాసాలు సృష్టించినవారు 3704
- మొత్తం వ్యాసాల్లో అజ్ఞాతలు సృష్టించినవి 3,247
- వ్యాసాల్లో చేసిన మొత్తం దిద్దుబాట్లు 29,25,742. ఈ దిద్దుబాట్లు చేసినవారు మొత్తం 50,806 మంది కాగా అందులో 40,578 మంది అజ్ఞాత వాడుకరులు (ఐపీ చిరునామాలు), 10,228 మంది నమోదైన వాడుకరులు
- లక్షకు పైగా దిద్దుబాట్లు చేసినవారు: 8
- లక్ష -50 వేలు దిద్దుబాట్లు చేసినవారు: 9
- 50 వేలు - 25 వేలు దిద్దుబాట్లు చేసినవారు: 15
- 25 వేలు - 10 వేలు దిద్దుబాట్లు చేసినవారు: 26
- 10 వేలు - 1,000 దిద్దుబాట్లు చేసినవారు: 98
- 1,000 - 100 దిద్దుబాట్లు చేసినవారు: 313
- 100 - 1 దిద్దుబాట్లు చేసినవారు: 50,493
- మొత్తం దిద్దుబాట్లలో అజ్ఞాతలు చేసినవి: 1,29,314