వికీపీడియా:వికీప్రాజెక్టు/విద్య, ఉపాధి/ప్రణాళిక-1/సమీక్ష-1
ఈ ప్రాజెక్టు ద్వారా పొందిన జ్ఞానాన్ని, లోటు పాట్లను పంచుకోవడమే ఈ వ్యాసం లక్ష్యం.
ప్రాజెక్టు పని తీరు
మార్చుప్రాజెక్టు మే 2010 లో మొదలై అక్టోబరు లో అంతమైంది. ప్రాజెక్టుగా మొదలెట్టినా, ప్రతిపాదనకర్త తప్ప ఎవరు క్రియాశీలంగా పని చెయ్యకపోవడంతో ఒక వ్యక్తి పనిలాగానే కొనసాగింది. ఒక్కరు మాత్రమే ఆసక్తి చూపించారు, పరిధి నిర్ణయంలో తోడ్పాటు అందించారు. కాని వారుకూడా వ్యాసాల మెరుగుకు తగినంత సమయం కేటాయించలేకపోయారు. దీని గురించి అందరికి తెలపటానికి వికీ ప్రకటనలు వాడాము. గణాంకాల కోసం బాట్ వాడాము.పరిధిలో 18 వ్యాసాలున్నా రెండింటిని మాత్రమే ప్రాధాన్యత తక్కువగా పరిగణించి మొదటి ఉప ప్రణాళిక పరిధి నుండి తొలగించడం జరిగింది. 12 మంచి అయ్యే వ్యాసాలు 15 ఆరంభ వ్యాసాలతో మొత్తం 27 వ్యాసాలు (చాలావరకు కొత్తవి) చేయగలిగాము. మరిన్ని వివరాలకు క్రింద ఇవ్వబడిన గణాంకాలు చూడండి.
ముఖ్యత,నాణ్యత గణాంకాలు
మార్చువిద్య, ఉపాధి వ్యాసాలు |
ముఖ్యత | ||||||
---|---|---|---|---|---|---|---|
అతిముఖ్యం | చాలా ముఖ్యం | కొంచెంముఖ్యం | తక్కువముఖ్యం | తెలీదు | మొత్తం | ||
నాణ్యత | |||||||
విశేషవ్యాసం | 0 | 0 | 0 | 0 | 0 | 0 | |
విశేషంఅయ్యేది | 1 | 0 | 0 | 0 | 0 | 1 | |
మంచివ్యాసం | 1 | 0 | 0 | 0 | 0 | 1 | |
మంచిఅయ్యేది | 8 | 3 | 1 | 0 | 0 | 12 | |
ఆరంభ | 8 | 2 | 4 | 1 | 0 | 15 | |
మొలక | 0 | 0 | 0 | 0 | 0 | 0 | |
విలువకట్టని | . | . | . | . | . | 0 | |
మొత్తం | 18 | 5 | 5 | 1 | 0 | 29 |
పేజీ వీక్షణలు
మార్చుప్రాజెక్టులో ఎక్కువ వ్యాసాలుంటాయి కాబట్టి పేజీ వీక్షణలకు ప్రధాన వ్యాసాలను ప్రతినిధిత్వంగా చేసి పరిశీలించాను.
వ్యాసం | 2009 ఏప్రిల్ - సెప్టెంబర్ ఆరు నెలల వీక్షణల భిన్నం | 2010 ఏప్రిల్ - సెప్టెంబర్ ఆరు నెలల వీక్షణల భిన్నం | పరమ పెరుగుదలశాతం /వికీపీడియా మొత్తం పరమ పెరుగుదల శాతం) |
---|---|---|---|
విద్య | 779/9మి | 1541/ 12.7మి | 97.8%/41.1% |
ఉపాధి | 34/9మి | 829/ 12.7మి | 2338%/41.1% |
పేజీల తయారీ శ్రమ
మార్చునేను సుమారుగా వారానికి 6 గంటలు సమయం ఈ ఆరు నెలలలో కేటాయించివుంటాను. అంటే 144 గంటలు. ఒక్కొక్క వ్యాసానికి దాదాపు 5 గంటలు పట్టి వుండవచ్చు. వ్యాసాలు చిన్నవయినా ఇంత సమయం ఎందుకు పట్టిందంటే, వ్యాసా మూలల కోసం రకరకాల వెబ్సైటులు వెతకటం, సమాచారాన్ని సమన్వయ పరచటం లాంటి పనులు ఎక్కువ సమయం తీసుకుంటాయి.
ధనాత్మక తెలివిడులు
మార్చువ్యక్తిగతంగా ప్రతిపాదన కర్తకు వికీ గురించి కొత్త సాంకేతిక, గుణాత్మక సంగతులు తెలిశాయి.
- ప్రకటనలకోసం పని
- మూసల పనితీరు
- బాట్ వాడి గణాంకాల పేజీ తయారు చేయటం. ప్రదీప్ చేసిన బాట్ కు కొద్దిగా మార్పులు చేశాను.
- వ్యాస నాణ్యతని బేరీజు వేయడం, మెరుగు పరచడం.ప్రాధాన్యతల వైపుగా వికీ అభివృద్ధిని చేయడానికి ఈ పద్ధతి కావాలి. ఇప్పటికే మంచి వ్యాసం, విశేషం అయ్యేది వర్గంలో వున్న వ్యాసాలలో నాణ్యత ప్రామాణికంగా లేదు. వాటిని అలాగే వుంచటం జరిగింది. ఈ వర్గాల మీద వికీ సముదాయం శ్రద్ధ పెంచవలసివుంది.
- దాదాపు ఆరు నెలల కాలాన్ని వివిధదశలుగా విభజించటం, పరిధి నిర్ణయం, వ్యాసాల తయారీ, నాణ్యత బేరీజు, నాణ్యత మెరుగు, సమీక్ష చేయటం వలన, ఒక్కరు చేస్తున్నా పనికి గురి పెరిగింది.
ఋణాత్మక తెలివిడులు
మార్చు- ఒంటరిగా పనిచేయవలసి రావటం ఒక పెద్ద నిరాశకి కారణమైంది. జట్టు ఏర్పడినప్పుడే ప్రాజెక్టు మొదలు పెట్టడం మంచిది. ఇంతకు ముందు ప్రాజెక్టు గా కొన్ని పనులు జరిగిన వాటి లోటుపాట్లు నాకు ఆలస్యంగా తెలిశాయి. క్రియాశీల వికీపీడియన్లు తక్కువ స్థాయిలో వున్నారు. వారిలో విద్య, ఉపాధి పై ఆసక్తి వున్న వారు ఇంకా తక్కువ. వికీలో పని స్థాయి పెరగవలసివుంది. కొత్తవారిని వికీవైపు ఆకర్షించటానికి పనిజరగాలి.
- మన ప్రదేశాలకు సంబంధించిన బొమ్మలు పెద్దగా లేవు. కొన్ని ప్రభుత్వ సంస్థల వెబ్ సైటులలోని ఫొటోలు న్యాయమైన హక్కుగా భావించి వాడటం జరిగింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వారి ఫోటోలు కామన్స్ లో ప్రవేశపెట్టి మన బొమ్మలను గణనీయంగా పెంచాలి.
- ఉద్యోగసోపానం ఇయర్ బుక్, పత్రికలలో విద్య, ఉపాధి ప్రత్యేక వ్యాసాలు ఆధారం చేసుకున్నా ముఖ్యంగా ఇయర్ బుక్ వ్యాసాలలో సమాచారం అసంపూర్ణంగా వుంది అని తేలింది.
- ఆంధ్ర ప్రదేశ్ కి సంబంధించిన ఉపాధి గణాంకాలకు మూలాలు పెద్దగా దొరకలేదు. ఇంగ్లీషు వ్యాసాలలో గణాంకాలు వాడుదామన్న అవి ఒక ప్రత్యేక పరిధిలో చేసినవి కాబట్టి, రాష్ట్ర సమాచారం లేకపోవటం లేక అసమగ్రంగా వుండటమో జరిగింది,
ముందు ప్రాజెక్టు విధంలో సమర్థంగా పనిచేయాలంటే సూచనలు
మార్చు- విషయంపై ఆసక్తి వున్న వారు జతకూడినప్పుడే ప్రాజెక్టు ప్రారంభించటం మంచిది.
- వ్యాసం నాణ్యత, ప్రాధాన్యత వాడినప్పుడు, వికీ అభివృద్ధిని సరియైన మార్గంలో పెట్టటం కుదురుతుంది. ఈ ప్రాజెక్టు వలన పదితరగతి, ఇంటర్ విద్యార్థులు ఉపయోగంగా వుండే వ్యాసాలు ప్రాధాన్యతలో మొదటి స్థాయిగా గుర్తించటం, వాటినే గురిగా నాణ్యతను పెంచడం జరిగింది.