వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 26, 2007

సంతకాన్ని మార్చుకోవచ్చు

సంతకం పెట్టినపుడు ఏమి కనబడాలనే దాన్ని మీరు మార్చుకోవచ్చు. అభిరుచులలో "సభ్యుని వివరాలు" ట్యాబులో "ముద్దుపేరు" ఒక దాన్ని ఎంచుకుని మీ సంతకాన్ని మార్చుకోవచ్చు. చర్చాపేజీల్లో ఏదైనా రాసినపుడు తప్పక సంతకం చెయ్యాలి. చాలా మంది సభ్యులు తమ సంతకం కనబడే విధాన్ని మార్చుకుంటారు. ఏదైనా వికీటెక్స్టును మీ ముద్దుపేరుగా పెట్టుకోవచ్చు. "సంతకం మాత్రమే (లింకు లేకుండా)" పెట్టెను చెక్ చెయ్యకపోతే, సంతకంలో మీ ముద్దుపేరుకు ముందు "" నూ, వెనక "" ను సాఫ్టువేరు చేరుస్తుంది. మరిన్ని వివరాలకు వికీపీడియా:కస్టమైజేషన్ చూడండి.