వికీపీడియా:వికీ చిట్కాలు/అక్టోబర్ 5

వికీపీడియా: విమర్శలు - జవాబులు - 2

అభ్యంతరం

ఇంటర్నెట్‌లో crank సమాచారం చాలా ఉంది. భూమి త్రికోణాకృతిలో ఉందనీ, అపోలో-11 చంద్రయానం కేవలం సినిమా స్టూడియోలో తీశారనీ - ఇలా బోలెడు సిద్ధాంతాలు ఉన్న సైటులు చాలా ఉన్నాయి. అలాంటి "సిద్ధాంతాలు" చొప్పించి కొందరు వికీలో కూర్చిన సమాచారాన్ని అర్ధం పర్ధం లేకుండా చేసేయవచ్చు కదా?

జవాబు

cranks నడిపే వెబ్‌సైటులు చాలా ఉన్నాయి. అందులో సమాచారం వారి స్వంతం గనుక వాటిని ఇతరులు సరిదిద్దలేరు. అయితే వికీపీడియాలో అలాంటి "నిరాధారమైన" సమాచారం ఎవరైనా చేరిస్తే దానిని ఇతరులు సరిదిదద్దడానికి అవకాశం పుష్కలంగా ఉంది.

అలాగని idiosyncratic వాదకులను వికీపీడియా నోరు మూయించదు. సందర్భానుసారంగా వాటిని కూడా పేర్కొనవచ్చును. ఇతరుల అభిప్రాయాలను గౌరవించేవారికీ, తమ అభిప్రాయాలను ఆధార సహితంగా కూర్చేవారికీ వికీపీడియాలో సముచితమైన ప్రయత్నానికి ప్రోత్సాహం లభిస్తుంది. తటస్థ విధానమే వికీపీడియాలో ఆకర్షణ.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా