వికీపీడియా:వికీ చిట్కాలు/ఆగష్టు 11
మీకు అప్పుడప్పుడూ ఒక పదానికి అర్థాన్ని రాయాలనో, వంటకం గురించి రాయాలనో లేదా ఒక ఫలానా వ్యక్తి చేసిన వ్యాఖ్యానాలను ఒక చోట గుదిగుచ్చాలనో అనిపించవచ్చు. ఇలాంటప్పుడు వికీపీడియా సోదర ప్రాజెక్టులైన విక్షనరీ, వికీమూలాలు లేదా వికీవ్యాఖ్యలను ఉపయోగించండి. వీటిని ప్రత్యేకించి, ఈ కారణాల వలనే నడుపుతున్నారు. వికీపీడియాలో ఉన్న వ్యాసాల నుండి ఈ సోదర ప్రాజెక్టులలో ఉన్న వ్యాసాలకు కూడా లింకులు ఇవ్వవచ్చు. Wikt:, S: మరియూ Q: అని వీక్షనరీ, వికీమూలాలు మరియూ వికీవ్యాఖ్యలలో ఉన్న వ్యాసాల పేర్లకు ముందు జతపరిచి, ఆయా వ్యాసాలకు వికీపీడియా నుండే లింకులను ఇవ్వవచ్చు.