వికీపీడియా:వికీ చిట్కాలు/ఆగష్టు 14
వికీపీడియాలో ఉన్నదేదయినా తటస్థ దృక్కోణం, నిర్ధారింప తగినది, మౌలిక పరిశోధనలు నిషిద్ధం అనే మూడు ప్రాధమిక సూత్రాలకు కట్టుబడి ఉండాలనుకోండి. అంతే కాకుండా మంచి వ్యాసానికి ఆశించే కొన్ని లక్షణాలు.
- ముందుగా వ్యాసానికి అనువైన ఉపోద్ఘాతం ఉండాలి.
- చదువరులకు తేలికగా అర్ధం కావాలి. ఆసక్తి కలిగించాలి.
- వేరే వ్యాసాల జోలికి వెళ్ళకుండా ఈ వ్యాసం చదివితే ఆ వ్యాసం శీర్షికకు తగిన సమగ్ర సమాచారం ఉండాలి.
- ఇతర వ్యాసాలకు లింకులు, వీలయినంతలో ఇతర వికీల లింకులు ఉండాలి. ఇతర సంబంధిత వ్యాసాలలో ఈ వ్యాసానికి లింకు ఉండాలి.
- మీ భావాలు కాకుండా ఆ విషయం నిపుణులు చెప్పిన విషయాలుండాలి. "అలాగని అంటారు", "చాలా ముఖ్యమైన ఘటన" వంటి పదాలు అనుచితం.
- ఆ విషయంపై సమాచారం ఎక్కడి నుండి తీసుకొన్నారో "in text citations" ద్వారా తెలపాలి
- అక్షర దోషాలు, వ్యాకరణ దోషాలు ఉండకూడదు.
ఇంకా చాలా ఉన్నాయనుకోండి. ఆంగ్ల వికీలో The perfect article చూడండి.