వికీపీడియా:వికీ చిట్కాలు/ఆగష్టు 9

బొమ్మల వివరాలు వ్రాయండి

మీరు ఏదైనా బొమ్మను అప్‌లోడ్ చేసినప్పుడు దాన వివరాలు స్పష్టంగా, వివరంగా ఇవ్వండి.

  1. pic001302.jpg, myphoto.jpg, bd.jpg వంటి అస్పష్టమైన పేర్లు పెట్టవద్దు. village_rampur_temple.jpg, coverpage_book_getrichquick.jpg వంటి స్పష్టమైన పేర్లు పెట్టండి. పేర్లు ఆంగ్లంలో ఉంటే మంచిది.
  2. మీరు కావాలనుకొంటే బొమ్మ వివరణ తెలుగులో వ్రాయవచ్చును. కాని ఆంగ్లంలో కూడా వ్రాయండి. ఎందుకంటే ఈ బొమ్మలు ఇతర వికీలలో వాడుకొనే అవకాశం ఉంది.
  3. ఎవరు తీశారు? ఎవరు అనుమతి ఇచ్చారు? ఎక్కడ? ఆ ఫొటోలో ఏముంది? - వంటి వివరాలు చాలా అవుసరం. మీకు ఆ బొమ్మకు సంబంధించిన విషయంతో ఉన్న పరిచయం ఇతరులకు ఉండకపోవచ్చునని గుర్తుంచుకోండి. మీరు స్వయంగా తీస్తే ఆ విషయం తప్పక వ్రాయండి.
  4. కాపీ హక్కుల సమాచారం తప్పనిసరి. - GFDL, Fair Use, Creative Commons, Non-Free FAir Use, Public Domain - ఇలా ఏదో ఒక తగిన కాపీ హక్కు ట్యాగ్ పెట్టండి. ఇవి స్పష్టంగా లేకున్నా, లేక సందేహాస్పదంగా ఉన్నా గాని బొమ్మను తొలగించే అవకాశం ఉంది.


నిన్నటి చిట్కా - రేపటి చిట్కా