వికీపీడియా:వికీ చిట్కాలు/జనవరి 19

బ్రౌసర్ కాషెను తొలగించడం

కొన్నిసార్లు మీరు చేసిన మార్పులు వెనువెంటనే మీరు వీక్షించడానికి ప్రయత్నిస్తే కనిపించకపోవచ్చు. అలా అని తొందరపడి మరలా మార్పు చేయకండి. ఒకసారి బ్రౌసర్ కాషెను తొలగించి చూడండి. మీరు వాడే బ్రౌసర్‌ను బట్టి క్రింది విధంగా కాషెను తొలగించండి.

  • మొజిల్లా/ఫైర్‌ఫాక్స్‌/సఫారి: shift కీని నొక్కి పెట్టి Reload నొక్కండి, లేదా Ctrl-shift-R నొక్కండి (యాపుల్‌ మాక్‌ లో Cmd-shift-R)
  • ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్: Ctrl నొక్కి పెట్టి, Refresh నొక్కండి, లేదా Ctrl-F5 నొక్కండి;
  • కాంకరర్‌: Reload మీట నొక్కండి, లేదా F5 నొక్కండి;
  • ఒపేరా ను వాడే వారు Tools→Preferences కు వెళ్ళి కాషె ను పూర్తిగా తీసివేయ వలసి ఉంటుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా