వికీపీడియా:వికీ చిట్కాలు/జూన్ 22
వికీపీడియాలోని ఒక్కో తరహా పేజీలు ఒకో నెమ్‌స్పేసులో ఒంటాయి. పేజీ పేరుకు ముందు ఈ నేం స్పేసు వస్తుంది. ఇది ఒకవిధంగా వికీలోని పేజీల ప్రాధమిక వర్గీకరణ. (టెలిఫొన్ డైరెక్టరీలో ఉన్న నేమ్‌స్పేసులు - అత్యవసర నెంబర్లు, సూచిక, ప్రాధమిక సమాచారం, అకారాది క్రమం, ప్రకటనలు, పసుపు పేజీలు - ఇలా)
ఉదాహరణకు వికీపీడియా:5 నిముషాల్లో వికీ అనే పేజీలో వికీపీడియా అనేది నేం స్పేసు పేరు. "సభ్యులు" అనే నెమ్‌స్పేసులో సభ్యుల వివరాలుంటాయి. ఏ నేం స్పేసూ లేకపోతే అది విజ్ఞాన సర్వస్వం వ్యాసమని అర్థం, అవి మొదటి నేం స్పేసుకు చెందుతాయి.
వికీపీడియాలో కింది నేంస్పేసులు ఉన్నాయి.
మొదటి, చర్చ, సభ్యుడు, సభ్యునిపై చర్చ, వికీపీడియా, వికీపీడియా చర్చ, బొమ్మ, బొమ్మపై చర్చ, మీడియావికీ, మీడియావికీ చర్చ, ప్రత్యేక, మూస, మూస చర్చ, సహాయము, సహాయము చర్చ, వర్గం, వర్గం చర్చ
వీటి గురించి కొంత వివరణ కోసం వికీపీడియా:5 నిమిషాల్లో వికీ చూడండి.