వికీపీడియా:వికీ చిట్కాలు/జూన్ 26
ప్రతి విషయం గురించీ ఇద్దరు ఏకీభవిస్తుంటే ఆ ఇద్దరిలో ఒకరు అనవుసరం - అన్న సూక్తి మీరు వినే ఉంటారు. వ్యాసం పేరు గురించీ, లేదా వ్యాసంలో వ్రాసే విషయం గురించీ, లేదా అది వ్రాసిన తీరు గురించీ, అందులోని బొమ్మల గురించీ - మీరనుకున్నదే మీకు సరైనదనిపించవచ్చును. (కాదని తెలిస్తే అలాగనుకోరు కదా?).
ఏతావతా అభిప్రాయ భేదాలను సమీకరించడం అంత సులభం కాదు. మీరనుకొన్నదానికి వ్యతిరేకంగా ఒకరు పట్టుపడితే కాస్త తగ్గండి. ఇతర పనులపై దృష్టి సారించండి. వికీలో చేయవలసిన పనులకు కొదువ లేదు గదా?