మౌలిక పరిశోధనలు నిషిద్ధం

వికీపీడియా:మౌలిక పరిశోధనలు నిషిద్ధం అనేది వికీపీడియా మూడు ప్రధాన నియమాలలో ఒకటి. అయితే వేరే ప్రచురణలో లేనిది ఏదీ వికీలో వ్రాయ కూడదా?

  • అన్ని నియమాలవలెనే దీనినీ విచక్షణతో అమలు చేయాలి.
  • రచయితలు తమ అభిప్రాయాలను వ్యాసాలుగా అంటగట్టకూడదనీ, అందువల్ల వికీపీడియా:తటస్థ దృక్కోణంకు భంగం కలుగుతుందనీ ఈ నియమం పెట్టడంలో ముఖ్యోద్దేశం.
  • ఇందుగురించి ఒక చర్చా పేజీలో వ్రాసిన విషయం గమనించదగినది - సొంతగా సమాచారం సేకరించడానికి, ప్రాథమిక రచనకు ఒక సన్ననిగీత ఉంది. సొంతగా సమాచారం సేకరించాం అంటే క్షుణ్ణంగా పరిశీలించని వాళ్ళు అది ప్రాథమిక రచన అని పొరబడి తీసివేసే అవకాశం ఉంది. ఉదాహరణకి రఘు గారి పుట్టినరోజును ఆయన్ని అడిగి మీరే సొంతగా సేకరించారనుకోండి అది మూలాలు లేకపోయినా ప్రాథమిక రచన కాదు ఎందుకంటే మీరు ప్రపంచములో మొట్టమొదటిసారి రఘుగారి పుట్టినరోజు ఇది అని కనుక్కోవటం లేదుకదా. ఇంకో సంబంధిత ఉదాహరణలో పోతన పుట్టిన రోజును వివిధ చారిత్రక, శాసన, సాహితీ ఆధారాలతో ఫలానాతేదీ అని మీరు నిగ్గుతేల్చారనుకోండి అది మీరు వికీపీడియాలో చేర్చటానికి లేదు. వికీపీడియాలో ఆ విషయం చేర్చటానికి మీరుదాన్ని ఇంకెక్కడైనా ప్రాధమికంగా ప్రచురించి ఉండాలి.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా