వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబర్ 17, 2007
విజ్ఞాన సర్వస్వానికి సంబంధించిన వ్యాసాలు ప్రధాన నేమ్ స్పేసు లో ఉంటాయి. మిగతా అన్ని నేమ్ స్పేసుల లోని పేజీలకు వాటి పేర్లకు ముందు సదరు నేమ్ స్పేసు పేరు, పక్కనే "కోలన్" (:) ను తప్పనిసరిగా జోడించాలి. నేమ్ స్పేసు పేరేమీ రాయకపోతే ఆ పేజీ ప్రధాన నేమ్ స్పేసుకు చెందుతాయని అర్థం. ప్రధాన నేమ్ స్పేసు లోని పేజీలకు ముందు నేమ్ స్పేసు పేరు రాయనవసరం లేదు. వికీపీడియాలోని నేమ్ స్పేసులు ఇవి:
చర్చ:, సభ్యుడు:, సభ్యులపై చర్చ:, వికీపీడియా:, వికీపీడియా చర్చ:, బొమ్మ:, బొమ్మ చర్చ:, మీడియావికీ:, మీడియావికీ చర్చ:, మూస:, మూస చర్చ:, సహాయము:, సహాయము చర్చ:, వర్గం:, వర్గ చర్చ:, ప్రత్యేక:
ప్రధాన నేమ్ స్పేసుతో కలిపి ఇవి మొత్తం 17. ఏ నేమ్ స్పేసులోనైనా ఒక పేజీకి ఉన్న పేరు మరో పేజీకి ఉండే వీలు లేదు.