వికీపీడియా:వికీ చిట్కాలు/ఫిబ్రవరి 6
మీకు అప్పుడప్పుడూ ఒక పదానికి అర్థాన్ని రాయాలనో, వంటకం గురించి రాయాలనో లేదా ఒక ఫలానా వ్యక్తి చేసిన వ్యాఖ్యానాలను ఒక చోట గుదిగుచ్చాలనో అనిపించవచ్చు. ఇలాంటప్పుడు వికీపీడియా సోదర ప్రాజెక్టులైన విక్షనరీ, వికీమూలాలు లేదా వికీవ్యాఖ్యలను ఉపయోగించండి. వీటిని ప్రత్యేకించి, ఈ కారణాల వలనే నడుపుతున్నారు. వికీపీడియాలో ఉన్న వ్యాసాల నుండి ప్రధానంగా వికీసోర్స్ ప్రాజెక్టులో ఉన్న వ్యాసాలకు కూడా లింకులు ఇవ్వవచ్చు. వికీసోర్స్ లో ఉన్న వ్యాసాల పేర్లకు S: ముందు జతపరిచి, ఆయా వ్యాసాలకు వికీపీడియా నుండే లింకులను ఇవ్వవచ్చు.