వికీపీడియా:వికీ చిట్కాలు/మే 10
ఏదైనా వ్యాసం కొరకు లింకు ఇవ్వాలంటే ఆ వ్యాసం పేరు చదరపు బ్రాకెట్లలో ఇవ్వడం చాలా మందికి తెలుసు. ఉదాహరణకు [[గుడిపాటి వెంకట చలం]] అని వ్రాస్తే గుడిపాటి వెంకట చలం అని ఆ వ్యాసానికి లింకు వస్తుంది.
అదే వ్యాసంలో "చలం వాఖ్యలు, అభిప్రాయాలు" అనే విభాగానికి లింకు ఇవ్వాలనుకోండి. అప్పుడు వ్యాసం పేరు తరువాత # అనే గుర్తు ఉంచి విభాగం పేరు వ్రాయాలి. [[గుడిపాటి వెంకట చలం#చలం వాఖ్యలు, అభిప్రాయాలు]] అని వ్రాస్తే గుడిపాటి వెంకట చలం#చలం వాఖ్యలు, అభిప్రాయాలు అన్న లింకు సరాసరి ఆ వ్యాసం విభాగానికి (Section head within the artcile) దారి తీస్తుంది.