వికీపీడియా:వికీ చిట్కాలు/మే 4
తెలుగు వికీపీడియాకు సమాంతరంగా తెలుగులోనే వికీసోర్స్, వికీవ్యాఖ్య, విక్షనరీ వంటి ప్రాజెక్టులు నడుస్తున్నాయి. మొదటి పేజీలో వీటికి లింకులున్నాయి. ఇవే కాకుండా ఇతర భాషలలో వికీలు సరే సరి. వాటిని కూడా సమయం చిక్కినపుడు దర్శించండి. వాటిలో కూడా మీరు సభ్యత్వం తీసుకొంటే మంచిది, అదీ అన్నింటిలో ఒకే సభ్యనామం ఉండడం ఉత్తమం. మీరు ఆ ప్రాజెక్టులలో పని చేయకపోయినా గాని, మీ సభ్యనామంతో వాటిలో మరొకరు పని చేస్తే కొంత గందరగోళానికి అవకాశం ఉంది. అలాగే ఆంగ్ల వికీలోను, వికీ కామన్స్‌లోను సభ్యత్వం ఉంటే మీకు ఉపయోగకరం కావచ్చు.