వికీపీడియా:వికీ చిట్కాలు/సెప్టెంబరు 19
వికీ ఒక మహా యజ్ఞం (ప్రాజెక్టు). దీని ముఖ్య ఉద్దేశ్యమే సమైక్య కృషి. తెలుగు వికీలో చాలా మంది సభ్యులు ఉన్నారు. కానీ వారు మార్పులు ఎందుకు చేయడం లేదు? ఆలోచించాల్సిన విషయమే కదా! వారికి సరిగ్గా ఏం చేయాలో తెలియక పోవచ్చును. ప్రతి రోజూ కొత్త సభ్యులు చేరుతున్నారు కానీ ఎంతమంది మార్పులు చేస్తున్నారు? ఉత్సాహవంతులైన సభ్యులు తెలుగు వికీకి చాలా అవసరం. తెలుగు టైపింగ్ ఇంత సులువుగా ఉన్నా కూడా ఎందుకు మార్పులు చేయడం లేదు కొత్త వారు? అలాంటి వారిని బెదరనివ్వకుండా సహాయం చెయ్యాలి? కానీ ఎలా? మీకు తోచిన విధంగా ప్రయత్నించండి.