వికీపీడియా:విషయ ప్రాముఖ్యత (రచయితలు)

తెలుగు వికీపీడియాలో ఒక వ్యాసం ఉండదగినదా లేదా అన్న విషయం బేరీజు వేయడానికి ఆ విషయపు ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకోవాలి. రచయితలు, కవులు వంటి సాహిత్యకారుల వ్యాసాలు ఉండదగినవా కాదా అన్నది పరిశీలించడానికి విషయ ప్రాముఖ్యతకు అవసరమైన ప్రమాణాలు ఇవి. ఇవి ఏర్పడినది రచ్చబండలో 2016లో జరిగిన చర్చ

ప్రమాణాలుసవరించు

  • అవార్డ్ గ్రహీతలు, ప్రముఖ పత్రికలు నిర్వహిస్తున్న పోటీలలో గెలుపొందిన రచయితలు
  • రచనల ఆధారంగా సినిమాలు తయారైతే ఆ రచయితల వ్యాసాలు ఉండవచ్చు.
  • రచయితలు ప్రాచుర్యం చెందిన వారైతే వారి గురించి, వారి రచనల సమీక్షలు పత్రికల్లో, అంతర్జాలంలో లభ్యమవుతుంటాయి. వాటిని మూలాలుగా తీసుకుని వ్యాసాలు రాయాలి.
  • దీర్ఘకాలం పత్రికలలో ప్రత్యేక శీర్షికలు నిర్వహించిన వారు
  • పత్రికలలో సీరియల్స్‌గా వచ్చిన నవలా రచయితలు
  • బహుమతి పొందిన కధలను వ్రాసిన రచయితలు
  • వారి రచనలు ఇతర భాషల్లోకి అనువాదమయినవారు.
  • వారి స్వంత ప్రచురణ అయితే ఆ పుస్తకం కనీసం 3 పునర్ముద్రణలైనా ఉండాలి.