వికీపీడియా:రచ్చబండ/పాత చర్చ 49
← పాత చర్చ 48 | పాత చర్చ 49 | పాత చర్చ 50 →
రచ్చబండ పేజీకి చెందిన ఈ పాత చర్చ జరిగిన కాలం: 2016 మే 9 - 2016 జూన్ 9
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90 91, 92 |
వికీ కాన్ఫరెన్స్ ఇండియా కోసం లోగో
మార్చునేను ఒక లోగో తయారు చేసాను. నేననుకొన్న ధీం - ఇతర దేశాల వికీపీడియన్లు కార్యక్రమం ద్వారా ఇండియాలో కలుస్తారు అని.. మీ అభిప్రాయాలు చెపితే ఇక్కడ చేరుస్తాను. ఆఖరు తేదీ రేపే కనుక త్వరగా స్పందించగలరు..--Viswanadh (చర్చ) 04:17, 9 మే 2016 (UTC)
- బాగుంది. నాకు నచ్చింది.--రవిచంద్ర (చర్చ) 05:54, 9 మే 2016 (UTC)
- ఒకే ఒక్క సభ్యుడు ప్రతి స్పందించారు కనుక మిగతా సభ్యులకు అంత బాగా అనిపించలేదని అనుకొంటున్నాను. కనుక విరమించుకుంటున్నాను...--Viswanadh (చర్చ) 17:01, 9 మే 2016 (UTC)
- అందరూ ఏదో పనిలో బిజీగా ఉండుంటారు. పంపించండి. ప్రయత్నించడంలో తప్పులేదుగా.--రవిచంద్ర (చర్చ) 17:08, 9 మే 2016 (UTC)
- ఒకే ఒక్క సభ్యుడు ప్రతి స్పందించారు కనుక మిగతా సభ్యులకు అంత బాగా అనిపించలేదని అనుకొంటున్నాను. కనుక విరమించుకుంటున్నాను...--Viswanadh (చర్చ) 17:01, 9 మే 2016 (UTC)
- ఇప్పటికి ప్రపోజల్స్‌లో ఉన్నవాటి(9)తో పోల్చితే, నా వరకు ఇదే బాగుంది. పంపగలరు-నాయుడుగారి జయన్న (చర్చ) 17:23, 9 మే 2016 (UTC)
- లోగో బాగుంది. పంపగలరు.-- కె.వెంకటరమణ⇒చర్చ 17:44, 9 మే 2016 (UTC)
- ప్రక్కన కనబరచిన మూడు లోగోలలో మొదటిదె బాగున్నది. భాస్కరనాయుడు (చర్చ) 03:19, 10 మే 2016 (UTC)
- సభ్యుల స్పందనకు వందనాలు. మరో రెండిటితో కలిపి మూడు అప్లోడ్ చేసాను. మీరంతా కూడా ఓటింగ్‌లో పాల్గొంటే తెలుగు సభ్యులు ఏక్టివ్‌గా ఉన్నట్టుగా ఉంటుంది (ఈ లోగోలకు ఓటు వేయమని కాదు, అన్నిట్లో పాల్గొనాలని :) )..--Viswanadh (చర్చ) 03:00, 10 మే 2016 (UTC)
- విశ్వనాధ్ గారూ! తర్వాత చేర్చిన రెండు లోగోలలో పై వైపు రంగు కాషాయం లాగా కాకుండా ఎరుపులాగా కనిపిస్తుంది. మరల సరిచేసి ఉంచడానికి వీలవుతుందేమో చూడండి--నాయుడుగారి జయన్న (చర్చ) 08:34, 10 మే 2016 (UTC)
వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ మే 15, 2016 సమావేశం
మార్చుఅందరికి నమస్కారం...వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ మే 15, 2016 సమావేశం… మే 15, 2016 (మూడవ ఆదివారం) నాడు ఉదయం గం. 10.30 ని.లకు హైదరాబాద్ లోని గోల్డెన్ త్రెషోల్డ్ లో ఏర్పాటు చేయబడుతుంది.
చర్చించాల్సిన అంశాలు
మార్చు- గత నెలల్లో తెలుగు వికీపీడియాలో జరిగిన అభివృద్ధి
- ఇటీవలే వికీసోర్సులో ప్రారంభమైన నాణ్యతాపరమైన అభివృద్ధి గురించి, దాంట్లో సభ్యులు చేయదగ్గ సహకారం గురించి
- 12వ వార్షికోత్సవ నిర్వాహణ
- ఎన్టీఆర్ ట్రస్టుతో భాగస్వామ్యం
- తెలంగాణా ప్రభుత్వ డిజిటల్ మీడియాతో కలసి పనిచేసే ప్రతిపాదనలు
- భవిష్యత్ ప్రణాళిక
- ఇంకా ఏమయినా విషయాలు దీని పైన చేర్చగలరు
సభ్యులు హాజరుకాగలరు. వివరాలకు వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/ మే 15, 2016 సమావేశం లో చూడగలరు.--Pranayraj1985 (చర్చ) 11:30, 10 మే 2016 (UTC)
జూన్ నెల వికీపీడియా:సమావేశం వివరాలు తెలియపర్చండి --Nrgullapalli (చర్చ) 04:02, 15 జూన్ 2016 (UTC)
జూన్ నెల వికీపీడియా:సమావేశం విషయమై స్పందన లేదు. సమాచారం ఇవ్వకుండా సబ్యులను ఇబ్బంది పెట్టుట మంచి సంప్రదాయం కాదు. --Nrgullapalli (చర్చ) 07:55, 25 జూన్ 2016 (UTC)
- సమావేశం ఉన్నప్పుడు ఖచ్చితంగా రచ్చబండలో తెలియపరుస్తున్నాం. జూన్ నెల సమావేశం అనిశ్చితి చూడగలరు ... అయితే కొన్ని కారణాలవల్ల ఒక్కోనెల సమావేశ నిర్వహణకు వీలుకావడంలేదు... ఇకపై సమావేశం ఉన్నది, లేనిది రచ్చబండలో తెలియజేస్తాము. --Pranayraj1985 (చర్చ) 09:38, 4 జూలై 2016 (UTC)
ట్రైన్-ద-ట్రైనర్(TTT), మీడియా వికీ ట్రైనింగ్ (MWT) మినీ వెర్షన్ నిర్వహణ
మార్చుఅందరికీ నమస్కారం,
ట్రైన్-ద-ట్రైనర్(TTT), మీడియా వికీ ట్రైనింగ్ (MWT) మినీ వెర్షన్ కార్యక్రమం హైదరాబాద్ నగరంలో ఎన్టీఆర్ ట్రస్టు వెన్యూగా ఈ నెల 18, 19, 20 తేదీల్లో జరుగుతుంది. కార్యక్రమంలో మీడియా వికీ ట్రైనింగ్ కు సంబంధించి:
- వికీపీడియాలో దిద్దుబాట్లు చేసేందుకు మరింత సులభమైన పద్ధతులు
- తెవికీలో ఏవైనా సాంకేతిక లోపాలు తలెత్తితే ఎక్కడ, ఎలా రిపోర్టు చేసి సరిజేసుకోవాలన్న విషయం
- బాట్లు, ప్రోగ్రాములు వంటివాటి ద్వారా ఆటోమేటిక్ గా ఏమేమి చేయవచ్చును, ఎలా చేయవచ్చునన్న అంశాలు
- వికీడేటాలోని అంశాలను వినియోగించుకుని కొత్త వ్యాసాలను ఎలా సృష్టించవచ్చు లాంటి విశేషాలు వగైరాలు నేర్చుకోవచ్చు.
ట్రైన్-ద-ట్రైనర్ పరంగా:
- ఇకపై వికీమీడియా ఫౌండేషన్ వారి నుంచి పలు కార్యక్రమాలకు నిధులు ఎలా రిక్వెస్ట్ చేసుకోవచ్చు, రిపోర్టులు ఎలా రాయాలి వంటి విషయాలు
- కార్యశాలల వంటివి నిర్వహించేప్పుడు పాటించదగ్గ పద్ధతులు, నివేదికలు రాసే విధానాలు
- వివిధ సంస్థలతో వ్యవహరించేప్పుడు తెవికీని ఎలా ప్రాతినిధ్యం వహించాలి. ఇప్పటికే ఉన్న సంస్థాగత భాగస్వామ్యాల నుంచి తెవికీకి ఉపకరించేవి ఏమి పొందవచ్చు.
వంటివి ఉంటాయి. ఇవి కాక మరేవైనా ప్రత్యేకించి కావాలంటే కోరవచ్చు. కార్యక్రమంలో పాల్గొనదలచిన సభ్యులు ముందుగా నమోదుచేసుకుని, పై అంశాలు కాక మరేవైనా కావాల్సివస్తే తెలియజేగలరు. నమోదుచేసుకున్న సభ్యులు కొద్దిరోజుల ముందు ప్రకటితమయ్యే షెడ్యూల్ చూసుకుని తమకు అవసరమైన సెషన్స్ కు రావచ్చు, అయితే అన్ని సెషన్స్ లోనూ పాల్గొనడం మరింత ఉపయుక్తమని గమనించగలరు. కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు కింద నమోదుచేసుకోగలరు. --పవన్ సంతోష్ (చర్చ) 06:41, 11 మే 2016 (UTC)
పాల్గొనదలచిన సభ్యులు
మార్చుచర్చ
మార్చుపాల్గొనేందుకు సంతకం చేసిన సభ్యులకు ధన్యవాదాలు. ఐతే వారిలోనూ ప్రణయ్ రాజ్ మూడవ రోజునే పాల్గొనగలనని తెలిపారు. ఆసక్తికరమైన కార్యక్రమమే అయినందున మరింతమంది పాల్గొనేలా చేయడానికి ఏం చేయాలో సూచించగలరు. మరింత వీలైన తేదీల్లో నిర్వహిస్తే బావుంటుందా? --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 07:20, 16 మే 2016 (UTC)
send messages to all members through Email with Dates, time and venue to enable them to attend --Nrgullapalli (చర్చ) 04:16, 17 మే 2016 (UTC)
- గుళ్ళపల్లి గారూ సరేనండీ. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 05:37, 18 మే 2016 (UTC)
- ఎక్కువ సంఖ్యలో సభ్యులకు ఈ తేదీలు వీలుకానందున వాయిదా వేస్తున్నాం. వచ్చే నెల మొదటివారంలో ఐతే బావుంటుందా తెలియజేయగలరు. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 05:37, 18 మే 2016 (UTC)
- బాగానేవుంటుంది సబ్యుల స్పందనచూడాలి తగినంతమందివస్తే నిర్వహించవచ్చు --Nrgullapalli (చర్చ) 04
- 05, 25 మే 2016 (UTC)
ట్రైన్-ఎ-వికీపీడియన్ కార్యక్రమం, ఇతర అంశాలు
మార్చుతెలుగు వికీపీడియన్లకు,
నమస్తే. ఆదివారం మే 15, 2016న వికీ-శిక్షణ కార్యక్రమాన్ని థియేటర్ అవుట్ రీచ్ యూనిట్, గోల్డెన్ థ్రెషోల్డ్, అబిడ్స్, హైదరాబాద్ లో ఉదయం 10.30 గంటల నుంచి 5 గంటల వరకూ జరుగనుంది. వికీపీడియా పాలసీలు, గైడ్ లైన్ల గురించి కూడా చర్చ జరుగుతుంది. హాజరుకాగలరు. సభ్యుల సౌకర్యార్థం నెలవారీ సమావేశంలో భాగంగా ఏర్పాటుచేశాము.
గతంలో ట్రైన్-ఎ-వికీపీడియన్ కార్యక్రమంలో పాల్గొంటున్న మీనా గాయత్రి యాంత్రికానువాద శుద్ధి ప్రాజెక్టు కొరకు వికీపీడియా ట్రాన్స్లేట్ టూల్ పై అవగాహన కావాలని కోరారు. అలాగే గుళ్ళపల్లి నాగేశ్వరరావు ప్రత్యేకించి ముఖాముఖి శిక్షణ కావాలని కోరగా, విశ్వనాధ్.బి.కె. తెలుగు వికీపీడియా కోసం సముదాయం పాలసీలు ఏర్పరుచుకునే క్రమంలో బెస్ట్ ప్రాక్టీస్ ల గురించి వివరణ కావాలని ఆశించారు. సముదాయం నుంచి వచ్చిన ఇటువంటి కొన్ని అభ్యర్థనల నేపథ్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తున్నాము.
సీఐఎస్-ఎ2కె ప్రతినిధి టిటో దత్తా హైదరాబాదులో మే 13 నుంచి 16 వరకూ ఉంటారు. ఆయన కార్యక్రమానికి రీసోర్సు పర్సన్ గా వ్యవహరిస్తారు. మీరు ట్రైన్-ఎ-వికీపీడియన్లో పాల్గొనేందుకు సైన్ చేసివుంటే మే 13 - 16 మధ్య కాలంలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించగలము. ఇంతవరకూ సైన్ చేయకపోయివుంటే సైన్ చేయవచ్చు.
ధన్యవాదాలు,
--పవన్ సంతోష్ (చర్చ) 12:32, 11 మే 2016 (UTC)
100 అధిక వీక్షణల పేజీలు
మార్చువికీమీడియా ఫౌండేషన్ పేజీవ్యూస్ ఆధారంగా 100 అధిక వీక్షణల పేజీల ఉపకరణానికి తెలుగు వికీపీడియా అనుసంధానించబడింది. ఆ వివరాలు 100 అధిక వీక్షణలు నొక్కి చూడండి.--అర్జున (చర్చ) 15:14, 11 మే 2016 (UTC)
- బాగుంది. ధన్యవాదాలు.--Rajasekhar1961 (చర్చ) 07:42, 16 మే 2016 (UTC)
Apply for WikiConference India 2016 scholarships
మార్చు
Hi, You are requested to translate this message into your local language. WikiConference India 2016 is being organized in Chandigarh during August 5, 6 and 7. Scholarship Applications for WCI2016 are open from now till 31st May 2016. You can check this link for more information regarding selection process and criteria. You can fill the application form by clicking on this link. Thanks. --Satdeep Gill (చర్చ) 18:35, 11 మే 2016 (UTC) WikiConference India 2016 team. |
---|
విక్షనరీ, వికీసోర్సులకు తగిన వ్యాసాలు తరలించే అంశంపై స్పందన
మార్చుఅందరికీ నమస్తే,
విక్షనరీ, వికీసోర్సులకు తరలించాల్సిన పేజీలను సాంకేతికంగా సాధ్యమైతే తరలించాలని, అందుకు సీఐఎస్-ఎ2కె సహకారం ఉంటుందేమో పరిశీలించాలని ఇక్కడ అర్జున, తదితర వికీపీడియన్లు అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై సంస్థాగతంగా మాట్లాడాకా ఇటువంటివి చేయడానికి సాంకేతికంగా సాధ్యపడుతుందని తెలిసింది. ఐతే ప్రస్తుతం ప్రాధాన్యతను అనుసరించి డెడ్ ఎండ్ పేజీలపై పనిచేయడం జరుగుతోంది. అలాగే క్రమంగా బొమ్మలు లేని వ్యాసాలు (దాదాపు 35 వేలకు పైగా వ్యాసాల్లో బొమ్మలు లేవు), బయటి లింకులు/రిఫరెన్సులు లేని వ్యాసాలు (19,359 వరకూ ఉన్నాయి) ప్రాధాన్యతగా స్వీకరించి పనిచేయడం జరుగుతుంది. ఆపైన సముదాయం విజ్ఞప్తి మేరకు విక్షనరీ, వికీసోర్సులకు తరలించడాన్ని ప్రాధాన్యతగా స్వీకరిస్తాము. ఈ అంశాలకు సంబంధించిన పూర్తి విశ్లేషణ ఇక్కడ చదవవచ్చు. ఈ అంశంపై ఆసక్తి గల సముదాయ సభ్యులు చేయడానికి ముందుకువస్తామంటే రానున్న శిక్షణ కార్యక్రమాల్లో భాగంగా యాంత్రికంగా, సాంకేతికంగా ఈ తరలింపు ఎలా చేయవచ్చో నేర్పించగలము. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (చర్చ) 15:28, 12 మే 2016 (UTC)
- పవన్ సంతోష్ గారికి, మీ స్పందనకి ధన్యవాదాలు. ప్రస్తుత ప్రాధాన్యత వివరాలు చదివాను. అవి చాలా వరకు మానవీయంగా చేసే అంశాలుగా మరియు సిఐఎస్ స్వంత చొరవగా అనిపించింది. దీనిలో ఇతర సభ్యులు ఎక్కువగా పాల్గొనకపోతే చెల్లింపు సంపాదకత్వంగా (Paid editing) అనుకోవాల్సివస్తుంది. అది అంత మంచిది కాదు. అదికాక విక్షనరీ తరలింపుకి ప్రాగ్రామ్ చేసి ఆ తరువాత బాట్ ద్వారా పేజీలు చేర్చాలి. దీనిని ప్రాధాన్యతగా తీసుకొంటే మంచిదని నా అభిప్రాయం. --అర్జున (చర్చ) 23:28, 13 మే 2016 (UTC)
- అర్జున గారూ, విక్షనరీకి చేర్చాల్సిన పేజీలపై దిగుమతి ద్వారా చేసేందుకు విక్షనరీ, వికీపీడియాల మధ్య దిగుమతి అవకాశం లేనందున సమస్య ఏర్పడుతోంది. దీన్ని అధిగమించేందుకు జూన్ నెలలో విక్షనరీలోనూ, ఇప్పుడు వికీపీడియాలోనూ చర్చ ప్రారంభించి, ఆ వీలు ఏర్పరిచి చేసే ప్రయత్నంలో ఉన్నాము. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:31, 13 ఆగష్టు 2016 (UTC)
తొలగించిన మొలకలు
మార్చుఅయ్యా ! ఈ మధ్యన కొత్తగా వాడుకర్లు వ్రాసే వ్యాసములలో ఎక్కువగా మొలక స్థాయి కలిగినవిగా ఉన్నాయి. అధిక మొత్తంలో మొలకలు ఉంటే భవిష్యత్తులో మూల సూత్రాల ప్రకారం తొలగించే అవకాశము ఉంది. మెలకలను వ్యాసముగా వెంటనే వ్రాయలేక పోతే ఆ తదుపరి వ్రాసే వారు బాధపడే అవకాశం ఉంది. అధిక మొత్తంలో మెలక వ్యాసాలు నేను ప్రారంభించినవి కొంత సమయము తీసుకుని నేనే వ్యాస స్థాయికి తీసుకొచ్చి వ్రాస్థానంటే కూడా అందుకు చెప్పుకోదగ్గ సరి అయినా సహకారము లభించలేదు. నాకు చాలా మంది పెద్ద మనసు వారు వారికి తోచిన నీతిసూత్రాలు, హితభోధనలు, విమర్శలు చేసి ఉన్నారు. నేను తొలగించినవి కొత్త పేరుతో లేదా అవే మరొకరు తిరిగి తెర మీదకు తెస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం ? నేను పెద్దలందరి నిర్ణయము ప్రకారం ప్రస్తుతం నా వ్యాసములు తొలగింపు పనిలో ఉన్నాను. తొలగించిన మొలకలు తిరిగి వ్రాసేవారికి, మొలకలు వ్రాసేవారికి సీనియర్ పెద్దలు తగువిధముగా వారికి సూచనలు, సలహాలు వెంటనే ఇవ్వగలరని నా మనవి. 01:35, 17 మే 2016 (UTC)
- ప్రసాద్ గారూ, మొలక వ్యాసాలు ఎవరు రాసినా అవి రాసేవారికి తెలియపరిచి వాటిని విస్తరించడానికి మనం కొంత సమయం ఇచ్చి, అప్పటికీ విస్తరించకపోతే వాటిని తొలగించాలి. ఇదీ నా అభిప్రాయం. అలా సమయం ఇస్తున్నామని ముందుగా మొలకలేస్తాను. తర్వాత ఎప్పుడో విస్తరిస్తామని అన్నా అది మంచి సాంప్రదాయం కాదని నా అభిప్రాయం. కొత్తగా వచ్చే వాడుకరులకు అసలు మొలక వ్యాసం అంటే ఏమిటి. వాటికి ప్రమాణం ఏమిటి. తెవికీలో వాటిని ఎందుకు ప్రోత్సహించడం లేదనేది వారికి తెలియజేయడం సీనియర్ సభ్యులందరి భాద్యత. --రవిచంద్ర (చర్చ) 01:46, 17 మే 2016 (UTC)
- అయ్యా రవిచంద్ర గారు, నేను చెప్పేది అదే. అయినా తొలగించమని ఎక్కడ చెప్పాను ? నేను వ్రాసినది ఏమిటి ? మరోసారి చదివితే మంచిది. నేను ఇప్పుడు మొలకలు వేస్తాను, కొన్నేళ్ళకు విస్తరిస్తాను అంటే కుదరదు అని నేను కూడా చెప్తున్నాను. నేను వ్రాశినది మీకు అర్థం కాకపోతే నేనేం చేస్తాను. మీకు అర్థం అయినది అది. నేను రైల్వే వ్యాసములు మాత్రమే వ్రాస్థాను అని చెప్పాను. ఇక్కడ పని ఒకడి క్రింద పని చేసే ఉద్యోగం కాదు. అలాగే అన్ని మొలక వ్యాసాలు ఎవడో చెప్పినట్లు ఒకే రోజు ఎవడూ పూర్తి చేయడు. ఒకదాని తర్వాత ఒకటి వ్రాస్తునే ఉండటం జరుగుతున్నప్పుడు, నిదానంగా పూర్తి చేస్తే ఒక్కొక్కళ్ళకు వచ్చే నష్టం ఏమిటి ? తదుపరి, నేను చెప్పేది కొత్త వాళ్ళ గుర్తించి కాదు, బాగా సీనీయర్లకే చెప్పేది. ఎవరో ఏదో అనుకున్నట్లు అన్నింటికీ నేను చెప్పలేదు. నేను చెప్పేది మీ లాంటి వాళ్ళకే అర్థం కాదు, కాబట్టి మరొకరిని చెప్పమంటున్నాను. ఇక్కడ ఎవరి అభిప్రాయము ఎవరైనా వ్రాయావచ్చు, ఎవరికైనా ఏదైనా చెప్పవచ్చు. ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, నాకు అభ్యంతరం కొద్దిమందితో ఉన్నప్పుడు నాకు మీ సలహా నాకు చెప్పవద్దనే చెబుతాను. మీరు అందరికీ వ్రాయండి, నా పేరు పెట్టి నాకు చెబుతున్నట్లు వ్రాయవద్దు. నేను అడిగిన సలహాలు, సూచనలు, సహాయాలు వంటి వాటిలో దేనికీ సరయిన సమాధానం రాక పోగా నా బొక్కలేదో ఎదో కెలుకుతూ ఉంటారు. ఎవరికైనా ఇది మంచి పద్దతి కాదు, నన్ను కెలికే విధంగా దయచేసి వ్రాయకండి. అందుకే నాకు సీనియర్ పెద్దలు సలహాలు కావాలి, మీలాంటి వాళ్ళ సలహాలు నాకు సాటిరావు, కారణం నా వ్రాతలు మీకు అర్థం కావటం లేదు. 02:03, 17 మే 2016 (UTC)
- నేను మిమ్మల్ని ఉద్దేశించి ఏమీ రాయలేదు. అంతటితో ఆపుతాను. --రవిచంద్ర (చర్చ) 05:19, 17 మే 2016 (UTC)
- అయ్యా రవిచంద్ర గారు, నేను చెప్పేది అదే. అయినా తొలగించమని ఎక్కడ చెప్పాను ? నేను వ్రాసినది ఏమిటి ? మరోసారి చదివితే మంచిది. నేను ఇప్పుడు మొలకలు వేస్తాను, కొన్నేళ్ళకు విస్తరిస్తాను అంటే కుదరదు అని నేను కూడా చెప్తున్నాను. నేను వ్రాశినది మీకు అర్థం కాకపోతే నేనేం చేస్తాను. మీకు అర్థం అయినది అది. నేను రైల్వే వ్యాసములు మాత్రమే వ్రాస్థాను అని చెప్పాను. ఇక్కడ పని ఒకడి క్రింద పని చేసే ఉద్యోగం కాదు. అలాగే అన్ని మొలక వ్యాసాలు ఎవడో చెప్పినట్లు ఒకే రోజు ఎవడూ పూర్తి చేయడు. ఒకదాని తర్వాత ఒకటి వ్రాస్తునే ఉండటం జరుగుతున్నప్పుడు, నిదానంగా పూర్తి చేస్తే ఒక్కొక్కళ్ళకు వచ్చే నష్టం ఏమిటి ? తదుపరి, నేను చెప్పేది కొత్త వాళ్ళ గుర్తించి కాదు, బాగా సీనీయర్లకే చెప్పేది. ఎవరో ఏదో అనుకున్నట్లు అన్నింటికీ నేను చెప్పలేదు. నేను చెప్పేది మీ లాంటి వాళ్ళకే అర్థం కాదు, కాబట్టి మరొకరిని చెప్పమంటున్నాను. ఇక్కడ ఎవరి అభిప్రాయము ఎవరైనా వ్రాయావచ్చు, ఎవరికైనా ఏదైనా చెప్పవచ్చు. ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ, నాకు అభ్యంతరం కొద్దిమందితో ఉన్నప్పుడు నాకు మీ సలహా నాకు చెప్పవద్దనే చెబుతాను. మీరు అందరికీ వ్రాయండి, నా పేరు పెట్టి నాకు చెబుతున్నట్లు వ్రాయవద్దు. నేను అడిగిన సలహాలు, సూచనలు, సహాయాలు వంటి వాటిలో దేనికీ సరయిన సమాధానం రాక పోగా నా బొక్కలేదో ఎదో కెలుకుతూ ఉంటారు. ఎవరికైనా ఇది మంచి పద్దతి కాదు, నన్ను కెలికే విధంగా దయచేసి వ్రాయకండి. అందుకే నాకు సీనియర్ పెద్దలు సలహాలు కావాలి, మీలాంటి వాళ్ళ సలహాలు నాకు సాటిరావు, కారణం నా వ్రాతలు మీకు అర్థం కావటం లేదు. 02:03, 17 మే 2016 (UTC)
గ్రామవ్యాసాలకు అవసరమైన ఫోటోలను చేర్చడం
మార్చుతెవికీలో గ్రామ వ్యాసాలలో చాలా వరకూ ఎలాంటి ఫోటోలు లేకుండా ఉన్నాయి. ఆ వ్యాసాలలో ఫోటోలు చేర్చేలా ఒక కార్యక్రమం నిర్వహిద్దామని అనుకుంటున్నాము. దీనికి నేను, గుళ్ళపల్లి నాగేశ్వరరావు నిర్వాహకులముగా ఉంటూ మూడు నెలల పాటు నిర్వహిస్తాము. కొత్త వాడుకరులను ఆకర్షించడం, ఇప్పటికే తెవికీలో కృషి చేస్తున్న వారు ఈ దిశగా ప్రయత్నం చేసేలా ఈ కార్యక్రమం ఉంటుంది. ఏదైనా గ్రామానికి సంబంధించిన బస్ స్టాండు, రైల్వే స్టేషను, పంచాయితీ ఆఫీసు, బ్యాంకులు, పోస్ ఆఫీసు, విద్యా సంస్థలు (బడి, పాఠశాల), దేవాలయాలు, నాయకుల విగ్రహాలు, ఇతర ప్రభుత్వాఫీసుల ఫోటోలు చేర్చవచ్చు. బొమ్మలు ఎలా చేర్చాలి, చేపుస్తకం లో చూడవచ్చు. ప్రతి ఫోటోను కామన్స్ కు ఎక్కించి తెవికీ వ్యాసంలో చేర్చాలి. విధిగా ఫోటో వివరాలు వివరణలో రాయాలి. మిగితా వివరాలు ఈ పేజీలో చూడండి. ఈ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా చేపట్టి సహ వాడుకలందరు తమ వంతు సహకారాన్ని అందించి తాము పాల్గొని, కొత్తవారిని ప్రొత్సహించి జయప్ర్రధం చేయగలరని ఆసిసించడమైనది. --భాస్కరనాయుడు (చర్చ) 09:01, 19 మే 2016 (UTC)
- చాలా చక్కటి కార్యక్రమం. చొరవగా ముందుకు తీసుకువెళ్తున్నందుకు భాస్కరనాయుడు, గుళ్ళపల్లి గార్లకు ధన్యవాదాలు, అభినందనలు. ఇంతకుముందు ఈ అంశంపై కొంతమేరకు చర్చ జరిగివుండడంతో ఆ చర్చ కూడా ఈ కార్యక్రమం రూపకల్పనలో ఉపకరిస్తుందేమో చూసేందుకు వీలుగా ఇక్కడ ఇస్తున్నాను. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 12:37, 19 మే 2016 (UTC)
- మంచి కార్యక్రమం... ముందుగా భాస్కరనాయుడు, గుళ్లపల్లి గార్లకు ధన్యవాదాలు... నేను కూడా ఈ ప్రాజెక్ట్ లో పాల్గొంటాను.. Pranayraj1985 (చర్చ) 12:46, 19 మే 2016 (UTC)
- ఒక నెలవారీ సమావేశంలో దీని గురించి చర్చించాము. ప్రణాలిక వివరాలు తెలియజేస్తే మేము కూడా పాల్గొంటాము. శుభాకాంక్షలు.--Rajasekhar1961 (చర్చ) 12:57, 19 మే 2016 (UTC)
- ప్రణయరాజ్, మరియు రాజశేఖర్ గార్లకు ఈ కార్య క్రమముపై మీ స్పంధనకు ధన్యవాదములు. గ్రామాల వ్యాసాలలో ఫోటోలు చేర్చడము అన్న ఆలోచన పాతదే అయినా కొన్ని కారణాల వల్ల అది అప్పట్లో కార్య రూపము దాల్చలేదు. అదే ఆలోచన కొద్ది మార్పులతో ఇప్పుడు ముందుకు తెచ్చాము. ఈ కార్య క్రమము విజయ వంతమైతే వేల కొలది గ్రామాల వ్యాసాలు బొమ్మలు లేక అనాధలుగా వున్నవి....... అవి మంచి వ్యాసాలుగా తయారు కాగలవని ఆశిస్తున్నాము. ఫ్రస్తుతము వేసవి శెలవులు కావున విద్యార్తులు తమ స్వంత గ్రామాలలో వుంటారు. ప్రతి వారి వద్ద నాణ్యమైన ఫోటోలు తీయగల చరవాణిలున్నాయి. వాటితో వారి వారి గ్రామాల సంబందిత ఫోటోలు తీసి కామన్స్ లో ఎక్కించి తర్వాత సంబందిత గ్రామాలలో చేర్చాలి. ఇది కార్యక్రమము. ఇందులో పాత వాడుకరులే కాకుండా తమకు పాత వారు తమకు తెలిసిన కొత్తవారిని కూడ ప్రోత్సహించి చేర్చగలిగితే కార్య క్రమము విజయ వంతము కాగలదు. వికీలో వ్యాసాలు వ్రాయడము కన్నా ఫోటోలు తీసి ఎక్కించడము అతి సులభము పైగా ఇది ప్రతిఒక్కరికి తెలిసిన విద్యే కనుక ఉత్సాహంగా పాల్గొనగలరని ఆసిస్తున్నాము. అంతే గాక ఈ కార్యక్రమములో పాల్గొన్న క్రొత్త వాడుకారులు వికిపీడియా పై కొంత అవగాహన కలిగి ముందు ముందు వారు వికీపీడియాలో వ్యాసాలు వ్రాసే స్థాయికి ఎదిగి స్థిరపడగలరని భావిస్తున్నాము. పాత వారు ఇందులో పాల్గొనడముతో బాటు మరింత మంది క్రొత్త వారిని ఇందులో చేర్చగలిగితే ఈ కార్య క్రమమునకు మరింత ఊపు రాగలదు. క్రొత్త వారు రచ్చబండలోని ఈ కార్యక్రమ వివరాలు చూసి స్పందించే అవకాశము లేనందున మన సహ వాడుకరులు చొరవ తీసుకొని క్రొత్తవారిని ఇందులో చేర్పించ గలిగితే చాల ఉపయోగకరము. క్రొత్త వారిని ఈ కార్య క్రమానికి ఆకర్షించడానికి మరింకేమైన మార్గమున్నచో ఆ విధంగా కూడ పాత వాడుకరులు ప్రయత్నించ వచ్చు. భాస్కరనాయుడు (చర్చ) 03:15, 20 మే 2016 (UTC)
తెలుగు భాషా సాంస్కృతిక సమ్మేళనం ఆహ్వాన పత్రిక
మార్చుగమనిక: ఎన్టీఆర్ ట్రస్టు సీఈవో, తెలుగు వికీపీడియన్ టి. విష్ణువర్ధన్ గారు తెలుగు వికీపీడియన్లకు అందించమని ఇచ్చిన ఆహ్వాన పత్రిక ఇది. కార్యక్రమానికి ఆయన తెలుగు వికీపీడియా సముదాయాన్ని ఈ సందర్భంగా ఆహ్వానించారు. వారి కోరిక మేరకు రచ్చబండలో ఆహ్వానపత్రిక పాఠ్యరూపంలో చేరుస్తున్నాను--పవన్ సంతోష్ (చర్చ) 05:07, 23 మే 2016 (UTC)
ఆహ్వాన పత్రిక
విజయవాడ సాహితీ సాంస్కృతిక సంస్థలు మరియు ఎన్.టి.ఆర్.ట్రస్ట్
ఆధ్వర్యంలో
శ్రీ మండలి బుద్ధప్రసాద్ షష్టిపూర్తి సందర్భంగా తెలుగు భాషా సాంస్కృతిక సమ్మేళనం
31 మే, 2016 మంగళవారం ఉదయం 10-00 గం నుండీ,
శ్రీ శేషసాయి కళ్యాణమంటపం, బందర్ రోడ్, విజయవాడ-10
నమస్కారం!
తెలుగు భాష సంస్కృతుల పరిరక్షణ నేటి అవసరం. ప్రభుత్వపరంగానూ, ప్రజాపరంగా కూడా చేపట్టవలసిన కార్య ప్రణాళికను రూపొందించే దిశగా విస్తృత స్థాయిలో తెలుగు భాషా సాంస్కృతిక సమ్మేళనం నిర్వహిస్తున్నాం. 31-05-2016 ఉదయం 10 నుండీ సాయంత్రం వరకూ విజయవాడ లబ్బీపేట, బందరురోడ్డులో గల శ్రీ శేషసాయి కళ్యాణ మంటపంలో జరిగే ఈ సమ్మేళనంలో తప్పక పాల్గొన వల్సిందిగా మీకు ఆహ్వానం పలుకుతున్నాం.
మన భాష, మన సాహిత్యం, మన ప్రామాణిక సంగీత, నాట్య, చిత్ర కళలతో పాటు మనదేశీయ కళారూపాల పట్ల ప్రజాదరణ, ప్రభుత్వాదరణ పెనవేసుకుని సాగవలసి ఉంది. అందుకోసం వ్యక్తులుగా మనం, సంస్థలు, ప్రభుత్వం ఏం చేయాలో చర్చించాలి. ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకోవాలి. అందరం కలిసి ఆ ప్రణాళిక అమలు కోసం కృషి చేయాలి. ఈ సమ్మేళనం అందుకు దోహదపడాలని ఆశిస్తున్నాము. ఇందులో మీరు తప్పక భాగస్వాములు కావలసిందిగా కోరుతున్నాం.
కాల పరిమితి రీత్యా సదస్సుల్లో కొన్ని అంశాలపైనే చర్చ జరిగే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ప్రతినిధులు ప్రతి ఒక్కరూ తమతమ అభిప్రాయాలు లిఖిత పూర్వకంగా మాకు అందించవచ్చు. అందరి అభిప్రాయాలనూ క్రోడీకరించి ఒక స్పష్టమైన నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందచేయటం జరుగుతుంది.
తెలుగు భాషా వికాసం, భాషా సాహిత్య ప్రభుత్వ సంస్థల పనితీరు –మెరుగుదల, రాష్ట్ర అకాడెమీలు, తెలుగు సాధికారిక సంస్థ వంటి నూతన సంస్థల ఏర్పాటు; పరిశోధనలకు ప్రోత్సాహం, ప్రజల్లో భాషానురక్తి కలిగించే కార్యక్రమాలు, విద్యావిధానంలో తెలుగు, సంగీత-నృత్య కళాశాల పనితీరు, విశ్వవ్యాప్తంగా తెలుగు వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి, తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణోద్యమ రథసారధి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి షష్టిపూర్తి మహోత్సవాన్ని ఈ విధంగా “తెలుగు భాషా సాంస్కృతిక సమ్మేళనం”గా జరపాలని మా ప్రయత్నం. ఇందుకు సహకరిస్తున్న ఎన్.టి.ఆర్ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు. విజయవాడలోని సాహితీ సాంస్కృతిక సంస్థల నిర్వాహకులు, ప్రముఖులతో ఒక ఆహ్వాన సంఘం ఏర్పడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
తెలుగు భాషా సంస్కృతుల అభివృద్ధి, పరిరక్షణ ధ్యేయంగా, సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమంలో భాగస్వాములు కావటం కోసం ఈ తెలుగు భాషా సాంస్కృతిక సమ్మేళనానికి విచ్చేయ వలసిందిగా మిమ్మల్ని మరొక్కసారి కోరుతున్నాం.
- రాష్ట్రం నలుమూలలనుండి, రాష్ట్రేతర ప్రాంతాల నుండీ భాషావేత్తలు, సాహితీ వేత్తలు, సాంస్కృతిక రంగ ప్రముఖులు ఈ సమ్మేళనానికి విచ్చేస్తున్నారు.
- ఉదయం 9-10 గంటల మధ్య సభాస్థలిలో ప్రతినిథుల నమోదు ఉంటుంది. నమోదు నిమిత్తం ఎలాంటి ప్రవేశ రుసుమూ లేదు. ప్రతినిథులకు భోజన ఉపాహారాల ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రతినిథులు స్వయంగా ప్రయాణం మరియు వసతి ఏర్పాట్లు చేసుకోవలసి ఉంటుంది.
- విజయవాడ లబ్బీపేట బందరు రోడ్డులోని శేషసాయి కళ్యాణమండపం బష్టాండ్ మరియు రైల్వే స్టేషన్ నుండి 3 కి.మీ. దూరంలో ఉంటుంది. బందరురోడ్డులో వెళ్ళే బస్సులన్నీ సభాస్థలి మీదుగా వెడతాయి. ఆటోలు తేలికగానేదొరుకుతాయి.
- మీ రాక వివరాలు ముందుగా తెలుప ప్రార్ధన. అనివార్య కారణాల వలన మీరు ఈ సమ్మేళనానికి రాలేకపోతే, ఈ దిగువ ప్రశ్నావళిని పూరించి మీ అమూల్యమైన సూచనలు సలహాలు పంప పార్థన.
ప్రశ్నావళి
- తెలుగు భాషకు ప్రాచీనతా హోదా వలన లభించే నిధుల వినియోగం గురించి, ప్రభుత్వ చర్యల గురించి మీసూచనలు
- పొరుగు రాష్ట్రాలలోనూ విదేశాలలోనూ స్థిరపడిన వారికి తెలుగు నేర్పించే విషయమై మీసూచనలు
- భాషా సాంస్కృతిక పరిశోధకులకు గుర్తింపు, ప్రోత్సాహకాల విషయమై మీ సూచనలు
- అధికార భాషాసంఘం, ఇతరప్రభుత్వసంస్థల పనితీరు మెరుగుదల, పాలనా పరంగా తెలుగు అమలుపై పర్యవేక్షణ, తెలుగులో నామఫలకాలు, శిలాఫలకాల వంటి అంశాలపై మీ సూచనలు
- గ్రంథాలయ వ్యవస్థను పటిష్ట పరచటం ద్వారా ఉత్తమ సాహిత్యానికి ప్రోత్సాహం కల్పించేందుకు మీ సూచనలు
- బోధనాంశంగా తెలుగును తప్పనిసరి చేసేందుకు ప్రభుత్వ పరంగా చేపట్టవలసిన చర్యల గురించి నిర్దిష్టమైన మీసూచనలు.
- దేశీయ సాంస్కృతిక కళా రూపాల పరిచయాన్ని పాఠ్యాంశాలుగా బోధించటం, ప్రతీ పాఠశాలలోనూ విద్యార్ధులకు ఆటపాటలతో విధిగా లలిత కళలను కూడా నేర్పించేందుకు గల సాధక బాధకాల గురించి మీ సూచనలు
- తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడెమీ, రాష్ట్ర ఆర్కయివ్స్, రాష్ట్ర ప్రాచ్య లిఖిత పరిశోధనా కేంద్రం వగైరా సంస్థల విషయమై మీ సూచనలు
- సాహిత్య అకాడెమీ, సంగీత నాటక అకాడెమీ లాంటి సంస్థల ఏర్పాటు విషయమై మీ అభిప్రాయం
- మార్కుల కోసం, భుక్తి కోసం కాక, మాతృభాషగా తెలుగును ప్రజలు గౌరవించే విధంగా చేసేందుకు మీ సూచనలు.
- నాటకం, సంగీతం, శిల్పం, చిత్రలేఖనం, నృత్యం లాంటి కళల పట్ల యువతలో అనురక్తి కల్గించటానికి మీ సూచనలు
- ఆయా ప్రాంతాలలో సాహిత్య కళారంగాల వికాసం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వేతర సంస్థలకు సహకారం గురించి మీ సూచనలు.
ఇవి కాక మీరు మరేదైన కొత్త అంశం పైన కూడా మీ అభిప్రాయాలను ఆహ్వాన సంఘ కార్యదర్శులకు వ్రాయవచ్చు.
- డా. జి వి పూర్ణచందు purnachandgv@gmail.com
- డా. పెద్ది రామారావు: ramarao.peddi@gmail.com
- శ్రీ టి. విష్ణువర్ధన్ceo@ntrtrust.org
మరిన్ని వివరాలకు డా. జి వి పూర్ణచందు 9440172642ను సంప్రదించవచ్చు.
ధన్యవాదాలతో…
అధ్యక్షులు: శ్రీ నారా లోకేష్
ఉపాధ్యక్షులు:
శ్రీ గుత్తికొండ సుబ్బారావు,
శ్రీ గోళ్ల నారాయణ రావు,
డా. ఈమని శివనాగిరెడ్డి
కార్యదర్శులు:
డా. పెద్ది రామారావు
శ్రీ విష్ణువర్ధన్
డా. జి వి పూర్ణచందు
మరియు ఆహ్వాన సంఘ సభ్యులు
CIS-A2K April 2016 Newsletter
మార్చుHello,
CIS-A2K has published their April 2016 newsletter. The edition includes details about these topics:
- Edit-a-thon organised at Christ University, Bangalore to celebrate Women’s Day;
- Celebrating the 13th anniversary of Kannada Wikipedia;
- Odia-language Women’s History Month edit-a-thons;
- Upcoming 14th birth anniversary of Odia Wikipedia;
Please read the complete newsletter here.
If you want to subscribe/unsubscibe this newsletter, click here. --MediaWiki message delivery (చర్చ) 12:41, 23 మే 2016 (UTC)
Train-the-Trainer 2016: Event details and invitation to apply
మార్చుGreetings from CIS-A2K,
It gives us great pleasure to inform that the Train-the-Trainer 2016 programme organised by CIS-A2K is going to be held from 15-17 June, Bangalore.
Train-the-Trainer programme was conceptualised in order to bridge the gap between wiki volunteers/enthusiasts who would like to conduct off reach activities and have been discouraged due to non availability of resources and support. The three day residential event will include presentations by the participants regarding a plan to improve their wiki-projects, expert sessions about conducting effective outreach activities, best practices from the global wiki communities, revised grant structure of WMF, activities to understand WMF strategy and vision, understanding global metrics and coming up with a concrete plan by participants in association with A2K to improve their wiki-projects.
A2K invites Wikimedians to apply for this programme. Participants will be selected based on their on wiki and off wiki activities and their responses to the questions asked in the Google form. Selected participants are required to finish pre-work assigned to them without fail. Please fill the Google form given below and write to us at tanveer@cis-india.org, tito@cis-india.org and rahim@cis-india.org for more details.
Regards, --MediaWiki message delivery (చర్చ) 18:37, 23 మే 2016 (UTC)
- Apologies, the dates for Train-the-Trainer 2016 have slightly been changed (we have made changes in the message above), the event will be held on 15-17 June 2016 in Bangalore.
- CIS-A2K would like to groom new leadership and sustain existing initiatives in the community. In order to fulfil this objectives, preference will be given to Wikimedians who are applying for the first time. Please fill this form if you have not done yet. Please keep on checking the event page for further updates or contact tanveer@cis-india.org, rahim@cis-india.org or me at tito@cis-india.org --Titodutta (చర్చ) 09:40, 25 మే 2016 (UTC)
తెలుగు రచయితలు ప్రాజెక్టు-తెలుగు రచయితల నోటబిలిటీ
మార్చుఅందరికీ నమస్కారం,
తెలుగు రచయితల ప్రాజెక్టు చేపట్టడానికి తెలుగు రచయితల నోటబిలిటీ ప్రమాణం నిర్దేశించాల్సి ఉందన్నది గతంలో మనవి చేసిన విషయం తెలిసిందే. తెలుగు వికీపీడియాలో వ్యాసం ఉండడానికి తెలుగు రచయితలకు ఏ విధమైన నోటబిలిటీ ప్రమాణం ఉండొచ్చన్నది దయచేసి చెప్పగలరు. ఉదాహరణకు కనీసం రెండు పుస్తకాలు ప్రచురింపబడి ఉండాలి, వగైరా. (ఉదాహరణనే అనుసరించాల్సిన అవసరం లేదు, అది కేవలం ఉదహరించడానికే) ఉండవచ్చు. సముదాయం ఈ అంశంపై కొంత చర్చించి నోటబిలిటీ ప్రమాణాలు తయారుచేసుకుంటే ప్రాజెక్టు చేపట్టవచ్చు. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 06:40, 24 మే 2016 (UTC)
- ఇది చాల చిక్కు ప్రశ్న. ఉదాహరణకి తెలుగు వికీపీడియాలో రాసే వారందరినీ రచయితలు అనొచ్చా? ఎవరి ఖర్చులతో వారి పుస్తకాలు అచ్చేయించుకున్న వారందరినీ రచయితలు అనొచ్చా? బ్లాగులలో రాసుకునేవారిని రచయితలు అనొచ్చా? వీరందరినీ రచయితల జాబితాలో వేసుకుంటే చాల పెద్ద జాబితా అవుతుంది. ఈ జాబితాని తయారు చెయ్యడానికి crowd sourcing ఉపయోగించడమేనా? ఇటువంటి ప్రోజెక్టు ఒకటి అమెరికాలో, నేను ఉన్న ప్రాంతంలో, అప్పుడే ఒకరు తలపెట్టేరు. ఒక ప్రయత్నం సరిపోతుందా? రెండో ప్రయత్నం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా? ఆలోచించండి Vemurione (చర్చ) 23:38, 26 మే 2016 (UTC)
- ఈ అంశాన్ని ముందుగానే చర్చించాము. ఒకరు ప్రముఖ రచయిత అని గుర్తించడానికి ప్రమాణాలు తయారుచేయాలి. కాబట్టి సభ్యుల అభిప్రాయాలను ఇక్కడ తెలియజేస్తే మనం ఒక అవగాహనకు రావచ్చు. నా ప్రతిపాదనలు: 2 లేదా 3 పుస్తకాలు ముద్రించబడి ఉండాలి. (స్వంత ఖర్చులతో ముద్రించిన వాటిని మినహాహించాలి). ఏదైనా ఒక జాతీయ లేదా రాష్ట్రీయ పురస్కారాన్ని పొందిన రచయితలు. అలాగే ప్రముఖ పత్రికలు నిర్వహిస్తున్న పోటీలలో గెలుపొందిన రచయితలు. ఒక రచయిత యొక్క రచనల ఆధారంగా సినిమాలు తయారైతే అది కూడా ప్రాముఖ్యమైనదే. రచన అనగా ఏమిటి: నవల, కథా సంకలనం, నాటకం, కావ్యం ఇలాంటివి. --Rajasekhar1961 (చర్చ) 10:16, 27 మే 2016 (UTC)
- ఒక రచయిత ప్రముఖమైన వ్యక్తి అయితే ఆయన గూర్చి గానీ, ఆయన పుస్తకాల గురించి గానీ అంతర్జాలంలో తప్పకుండా లభిస్తుంది. ఒక రచయిత గురించి వ్రాయాలంటే మూలాలు తప్పనిసరిగా లభించాలి. ఎన్ని పుస్తకాలు వ్రాసినా ఆయన వ్రాసిన పుస్తకానికొ ఒక్కదానికైనా అవార్డు వచ్చినా, ఆయనకు ఏదైనా పురస్కారం లభించినా, అంతర్జాలంలో గానీ పత్రికలలో గాని ఆయన పుస్తకాల గురించి ప్రముఖమైన చర్చలు సమీక్షలు జరుగుతున్నా ఆయన వ్యాసం తప్పనిసరిగా వికీలో ఉండాలి. స్వంతంగా తమ పుస్తకాలను ప్రచురించుకొని ప్రాముఖ్యత లేని పుస్తకాలు గల రచయితలు చాలా మంది ఉంటారు. వారికి వ్యాసం అవసరం లేదు. -- కె.వెంకటరమణ⇒చర్చ 10:26, 27 మే 2016 (UTC)
- ప్రముఖ రచయితలకు మాత్రం వ్యాసాలు ఉండడం సమంజసం. గుర్తింపు కలిగిన రచయితలకు వ్యాసాలు ఉండేలా చూడడం అవసరం. అవార్డ్ గ్రహీతలు, పత్రికలలో సీరియల్స్‌గా వచ్చిన నవలా రచయితలు, దీర్ఘకాలం పత్రికలలో ప్రత్యేక శీర్షికలు నిర్వహించిన వారు, బహుమతి పొందిన కధలను వ్రాసిన రచయితలు, నాటకరచయితలు, సినిమాలుగా తీసిన నవలలు వ్రాసిన రచయితలు, సినీగేయరచయితలు, సినీ వచనకర్తలు, పరిశోధనా గ్రంధాలు వ్రాసిన రచయితలు ఇలా అందరం చర్చించి రచయితల ప్రాధాన్యత అనుసరించి వ్యాసాలు వ్రాస్తే బాగుంటుంది. t.sujatha (చర్చ)
- ఈ అంశాన్ని ముందుగానే చర్చించాము. ఒకరు ప్రముఖ రచయిత అని గుర్తించడానికి ప్రమాణాలు తయారుచేయాలి. కాబట్టి సభ్యుల అభిప్రాయాలను ఇక్కడ తెలియజేస్తే మనం ఒక అవగాహనకు రావచ్చు. నా ప్రతిపాదనలు: 2 లేదా 3 పుస్తకాలు ముద్రించబడి ఉండాలి. (స్వంత ఖర్చులతో ముద్రించిన వాటిని మినహాహించాలి). ఏదైనా ఒక జాతీయ లేదా రాష్ట్రీయ పురస్కారాన్ని పొందిన రచయితలు. అలాగే ప్రముఖ పత్రికలు నిర్వహిస్తున్న పోటీలలో గెలుపొందిన రచయితలు. ఒక రచయిత యొక్క రచనల ఆధారంగా సినిమాలు తయారైతే అది కూడా ప్రాముఖ్యమైనదే. రచన అనగా ఏమిటి: నవల, కథా సంకలనం, నాటకం, కావ్యం ఇలాంటివి. --Rajasekhar1961 (చర్చ) 10:16, 27 మే 2016 (UTC)
- పైన రాజశేఖర్ గారు, వెంకటరమణగారు, సుజాత గారు చెప్పిన విషయాలతో పాటు రచయితల నోటబులిటీకి మరికొన్ని నిబంధనలు ఉంటే ఇన్క్లూజివ్ గా ఉంటుందనిపించింది. అవి:
- ఇది చాల చిక్కు ప్రశ్న. ఉదాహరణకి తెలుగు వికీపీడియాలో రాసే వారందరినీ రచయితలు అనొచ్చా? ఎవరి ఖర్చులతో వారి పుస్తకాలు అచ్చేయించుకున్న వారందరినీ రచయితలు అనొచ్చా? బ్లాగులలో రాసుకునేవారిని రచయితలు అనొచ్చా? వీరందరినీ రచయితల జాబితాలో వేసుకుంటే చాల పెద్ద జాబితా అవుతుంది. ఈ జాబితాని తయారు చెయ్యడానికి crowd sourcing ఉపయోగించడమేనా? ఇటువంటి ప్రోజెక్టు ఒకటి అమెరికాలో, నేను ఉన్న ప్రాంతంలో, అప్పుడే ఒకరు తలపెట్టేరు. ఒక ప్రయత్నం సరిపోతుందా? రెండో ప్రయత్నం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా? ఆలోచించండి Vemurione (చర్చ) 23:38, 26 మే 2016 (UTC)
- ప్రముఖ పత్రికలు, సంస్థలు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన రచయితలు.
- వారు రాసిన కనీసం 2 పుస్తకాలు ఇతర ప్రచురణ సంస్థలు ప్రచురించిన రచయితలు.
- వారి స్వంత ప్రచురణ అయితే ఆ పుస్తకం కనీసం 3 పునర్ముద్రణలైనా ఉండాలి.
- నాటక రచయితలైతే కనీసం 3 నాటకాలు రాసి, ఒక్కో నాటకం కనీసం 15 ప్రదర్శనలైనా అయి ఉండాలి.
- రాష్టస్థాయిలోగానీ, జాతీయ స్థాయిలోగానీ అవార్డులు పొందిన రచయితలు.
- ఇంటర్వ్యూలు, స్పెషల్ స్టోరీలు ప్రముఖ పత్రికలు, రేడియో, టీవీ మాధ్యమాల్లో ప్రచురితం, ప్రాసారమైన రచియతలు.
- వారి రచనలు ఇతర భాషల్లోకి అనువాదమయినవారు.
- రచనకి లేదా నాటకానికి విస్తృత ప్రచారం(వాటిపై చర్చలు, పరిశోధనలు జరగడం) లభించినా, వారి సాహిత్యం ఆధారంగా సినిమాలు వచ్చినా వారిని నోటబుల్ గా లెక్క వేయవచ్చు.
- కనీసం రెండు కథా సంకలనాల్లో(మూడో పక్షం వారు ప్రచురించిన) వారి కథ ప్రచురింపబడినవారు.
- ప్రముఖ పత్రికల్లో కనీసం 2 కాలంలు నిర్వహించిన వారు లేదా ఒక శీర్షిక కనీసం 3 సంవత్సరాలు నిర్వహించినవారు.
- కనీసం 5 సినిమాలకు రచన చేసినవారు(కథ, స్క్రీన్ ప్లే, పాటలు).
- చరిత్ర రచయితలైతే వారి సాహిత్యం ప్రామాణిక చరిత్ర రచనకు ఉపకరిస్తే.
పై చేసిన సూచనలు పరిశీలించగలరు.--Meena gayathri.s (చర్చ) 15:31, 1 జూన్ 2016 (UTC)
- పైన చర్చలో పేర్కొన్న సూచనల ఆధారంగా నేను తెలుగు రచయితల నోటబిలిటీ విషయంలో కింది సూచనలు ప్రతిపాదిస్తున్నాను. ఇంతటితో ఈ చర్చ ముగిద్దాం.
- అవార్డ్ గ్రహీతలు, ప్రముఖ పత్రికలు నిర్వహిస్తున్న పోటీలలో గెలుపొందిన రచయితలు
- రచనల ఆధారంగా సినిమాలు తయారైతే ఆ రచయితల వ్యాసాలు ఉండవచ్చు.
- రచయితలు ప్రాచుర్యం చెందిన వారైతే వారి గురించి, వారి రచనల సమీక్షలు పత్రికల్లో, అంతర్జాలంలో లభ్యమవుతుంటాయి. వాటిని మూలాలుగా తీసుకుని వ్యాసాలు రాయాలి.
- దీర్ఘకాలం పత్రికలలో ప్రత్యేక శీర్షికలు నిర్వహించిన వారు
- పత్రికలలో సీరియల్స్‌గా వచ్చిన నవలా రచయితలు
- బహుమతి పొందిన కధలను వ్రాసిన రచయితలు
- వారి రచనలు ఇతర భాషల్లోకి అనువాదమయినవారు.
- వారి స్వంత ప్రచురణ అయితే ఆ పుస్తకం కనీసం 3 పునర్ముద్రణలైనా ఉండాలి.
తన్వీర్ హాసన్ విజయవాడ పర్యటన
మార్చుఅందరికీ నమస్కారం,
సీఐఎస్-ఎ2కె ప్రోగ్రాం ఆఫీసర్ తన్వీర్ హాసన్ జూన్ 2016 3, 4 తేదీల్లో విజయవాడలో ఉంటారు. ప్రస్తుత సంస్థాగత భాగస్వాములను కలసి
అ. వికీపీడియా పరంగా సంస్థ కార్యకలాపాలు డాక్యుమెంట్ చేయడం, నివేదించడం
ఆ. వచ్చే గ్రాంట్ పీరీయడ్ కు కార్యప్రణాళిక తయారుచేయడం మరియు
ఇ. భాగస్వామ్యం కొనసాగించడం లేక నిష్క్రమించడాల్లో సాధ్యాసాధ్యాలు చర్చించడం
అన్నవి పర్యటన అజెండాలో ఉన్నాయి. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 12:57, 29 మే 2016 (UTC)
- మరొక సంవత్సరం ఈ భాగస్వామాన్ని మరింత ప్రయోజనకరంగా (కాలేజీ విద్యార్ధులకు మరియు వికీపీడియాకు) ఉండెటట్లు ప్రణాలిక సిద్ధం చేయండి. చదువుకొంటున్న విషయాలే కాకుండా, విజ్నాన సర్వస్వానికి చెందిన జనరల్ నాలెడ్జి కి సంబంధించిన విషయాలు వారికి భవిష్యత్తులో ఎలా ఉపయోగపడతాయో తెలియజేయండి. కార్యశాల టైమింగ్స్ మరియు ఒకరెవరైనా సహాయం అందించేటట్లుగా చూడండి.--Rajasekhar1961 (చర్చ) 11:12, 1 జూన్ 2016 (UTC)
కొత్త రైల్వే పదాలు సృష్టి - వాదనలు - కొనసాగింపు
మార్చు{{సహాయం కావాలి}}
అయ్యా ! కొత్త రైల్వే పదాలు సృష్టి ఎవరికి తోచినట్లు వాళ్ళు చేస్తున్నారు. ఋజువులు చూపరు. అనవసర వాదనలు చేస్తూ ఉంటారు. మళ్ళీ మళ్ళీ అవే పద్దతిలో కొనసాగింపు చేస్తున్నారు. [1] దానికి ఎవరికి తోచినట్లు వాళ్ళు మద్దతు పలుకుతున్నారు. దీనికి అంతం అనేది ఉండదా ? ఉదా: జంక్షన్ అనే పదానికి కూడలి అని, ఎక్స్‌ప్రెస్ = వేగబండి, న్యూఢిల్లీ = క్రొత్త ఢిల్లీ, ఇలా ఎన్ని పదాలు అని వ్రాయాలి మరియు ఏ ఆధారంతో వీళ్ళు మారుస్తున్నారు ? ఉన్నవాటికి కొత్తగా పదాలు మార్పు ఈ మేధావులు చేయడం ఎందుకు చేయాలి ? JVRKPRASAD (చర్చ) 17:26, 29 మే 2016 (UTC)
- యిది అరకు కూడా తెవికీలో చేస్తున్న పనికి ఆటంకంగా కొత్తపదాల సృష్టి చేయడం వాటిపై చర్చలు జరగడం జరిగినది. మరలా అదే పని జరుగుతుంది. దయచేసి "ఎక్స్‌ప్రెస్" , "న్యూఢిల్లీ", "జంక్షన్" వంటి పదాలను అలాగే ఉంచవలసినదిగా మనవి. యిది వరకు "కంటోన్మెంటు" కు "దండు" అనే పదం సృష్టించి అనవసర చర్చ జరిగింది. యిలా పదాల గూర్చి అనవసర చర్చలు చేయకుండా వ్యాస విస్తరణలకు కృషి చేయవలసినదిగా కొత్త వాడుకరులకు మనవి.-- కె.వెంకటరమణ⇒చర్చ 02:39, 30 మే 2016 (UTC)
- ఇక్కడ ఆ వాడుకరిని చేయొద్దని నోటిఫై చేశాను, చూడండి.--పవన్ సంతోష్ (చర్చ) 03:02, 30 మే 2016 (UTC)
- యిది అరకు కూడా తెవికీలో చేస్తున్న పనికి ఆటంకంగా కొత్తపదాల సృష్టి చేయడం వాటిపై చర్చలు జరగడం జరిగినది. మరలా అదే పని జరుగుతుంది. దయచేసి "ఎక్స్‌ప్రెస్" , "న్యూఢిల్లీ", "జంక్షన్" వంటి పదాలను అలాగే ఉంచవలసినదిగా మనవి. యిది వరకు "కంటోన్మెంటు" కు "దండు" అనే పదం సృష్టించి అనవసర చర్చ జరిగింది. యిలా పదాల గూర్చి అనవసర చర్చలు చేయకుండా వ్యాస విస్తరణలకు కృషి చేయవలసినదిగా కొత్త వాడుకరులకు మనవి.-- కె.వెంకటరమణ⇒చర్చ 02:39, 30 మే 2016 (UTC)
- డా.రాజశేఖర్, పవన్, రమణ మరియు సహసుమిత్రులకు, ప్రతి ఒక్కరికీ పేరుపేరునా మీరు, అందరూ తగు సమయములోనే స్పందించినందులకు మీకు ధన్యవాదములు. ఈ మాత్రము సహాయ సహకారములుంటే నా పని మరో విధంగా ఒక వ్యాసం తదుపరి మరొకటి వ్రాసుకునే పని. JVRKPRASAD (చర్చ) 03:38, 30 మే 2016 (UTC)
సమయ సారణి
మార్చుఅయ్యా ! రైల్వే వ్యాసములలో సమయ పట్టిక (టైం టేబుల్) నకు "సమయ సారణి" అని వాడుట జరుగుతున్నది. దీని అర్థం దయచేసి వివరించ గలరు. సారణి అనే పదం అసలు తెలుగు అర్థం వేరు. పెద్దలు గమనించగలరని ఆశిస్తున్నాను. JVRKPRASAD (చర్చ) 01:08, 1 జూన్ 2016 (UTC)
- కొన్ని పాత రైల్వే వ్యాసాలలో time table కు బదులుగా "సమయ సారణి" అనే పదం వాడుట గమనించాను. ఆంధ్ర భారతి నిఘంటువు లో శోధిస్తే time table అనే ఆంగ్ల పదానికి అర్థం "సమయ సారణి, కాల(క్రమ)నిర్ణయ పట్టిక" అని ఉన్నది. అందువల్ల అది సరైన పదమేనని చేర్చడం జరుగుతుంది. time table అనగా "కాల నిర్ణయ పట్టిక" అనిన బాగుండునేమో! ఏదేమైనా పదాన్ని మార్చినా అభ్యంతరం లేదు. ధన్యవాదాలు.-- కె.వెంకటరమణ⇒చర్చ 01:17, 1 జూన్ 2016 (UTC)
- సమయ సారణి సరైన పదమే అనుకుంటున్నాను. --రవిచంద్ర (చర్చ) 05:41, 1 జూన్ 2016 (UTC)
- వ్యక్తిగతంగా వికీపీడియన్ స్థాయిలో నా అభిప్రాయమేంటంటే - సమయ సారిణి అన్న పదం నిఘంటువు పరంగా అర్థం సరైనదా కాదా అన్నది తెవికీలో వినియోగానికి ప్రధానమైన ప్రమాణం కాదు. ఆ పదం పత్రికల్లో, పుస్తకాల్లో, జాలంలో, ప్రజల్లో ఎంత వాడుకలో ఉందన్నదే ప్రధానమైన ప్రమాణం. గతంలో వైజాసత్య వంటివారు కొత్త పదాలను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చేందుకు తెవికీ సరైన వేదిక కాదనీ, ప్రాచుర్యంలోకి వచ్చిన పదాలను వినియోగించి మన లక్ష్యమైన విజ్ఞాన సర్వస్వ నిర్మాణానికి వినియోగించాలనీ గతంలో రాశారు. వ్యక్తిగతంగా మనం తెలగు భాషాభిమానులం కావచ్చు, తెలుగు పదాల ఆంగ్ల పదాల స్థానంలో వాడుకలో రావాలని కోరుకునేవారం కావచ్చు కానీ వాడుకలోకి తెచ్చేందుకు తెవికీని ఉపకరణంగా స్వీకరించలేం. వ్యక్తిగతంగా మనకున్న సిద్ధాంత, పార్టీ పరమైన అభిమానాలను పక్కనపెట్టి తెవికీలో నిష్పక్షపాత వైఖరి ఎలా అవలంబిస్తామో ఇదీ అంతే. ఆ ప్రమాణం పరంగా చూస్తే అంతర్జాలంలో టైంటేబుల్, టైం టేబుల్ అన్న పదం కోసం వెతికినప్పుడు 43,700 శోధనలు వచ్చాయి, వీటిలో ప్రముఖ తెలగు పత్రికలు పేజీలెన్నో ఉన్నాయి. సమయ సారిణి, సమయసారిణి అన్న రెండు పదాలను వెతకగా 308 శోధనలు లభించాయి. వీటిలో ఓ పుంజీడు తెలుగు వికీపీడియాలోవే. ఈ నేపథ్యంలో ఏది ప్రజల్లో, పత్రికల్లో, ఇతర ప్రాచుర్య మాధ్యమాల్లో వాడుకలో ఉందో గుర్తించి నిర్ణయించమని సూచన. --పవన్ సంతోష్ (చర్చ) 07:08, 1 జూన్ 2016 (UTC)
- సమయ సారణి సరైన పదమే అనుకుంటున్నాను. --రవిచంద్ర (చర్చ) 05:41, 1 జూన్ 2016 (UTC)
- కొన్ని పాత రైల్వే వ్యాసాలలో time table కు బదులుగా "సమయ సారణి" అనే పదం వాడుట గమనించాను. ఆంధ్ర భారతి నిఘంటువు లో శోధిస్తే time table అనే ఆంగ్ల పదానికి అర్థం "సమయ సారణి, కాల(క్రమ)నిర్ణయ పట్టిక" అని ఉన్నది. అందువల్ల అది సరైన పదమేనని చేర్చడం జరుగుతుంది. time table అనగా "కాల నిర్ణయ పట్టిక" అనిన బాగుండునేమో! ఏదేమైనా పదాన్ని మార్చినా అభ్యంతరం లేదు. ధన్యవాదాలు.-- కె.వెంకటరమణ⇒చర్చ 01:17, 1 జూన్ 2016 (UTC)
- నాకెందుకో టైం టేబుల్ (అనగా ఆంగ్ల పదాన్ని అదే విధంగా) రాయడం కన్నా కాల నిర్ణయ పట్టిక ఉపయోగిస్తే బాగుంటుంది. కాలం అనగా టైం పట్టిక అనగా టేబుల్ అనే రెండు అందరికీ అర్ధమయ్యే పదాల కలయిక కాబట్టి అయోమయంగా భావించాల్సిన పని లేదు.--Rajasekhar1961 (చర్చ) 11:08, 1 జూన్ 2016 (UTC)
- ఇప్పుడు అర్థమయ్యే పదాలే కావచ్చండీ. కానీ భవిష్యత్తులో దీన్ని అవకాశంగా తీసుకుని పదాలను సృష్టిస్తూ అయోమయం సృష్టించే వీలుంది. అర్థవంతమైన పదాల కలయికే కాబట్టి ప్రజల్లో ప్రాచుర్యం పొందుతుంది, పొందాకానే మనం వినియోగిస్తే మేలు. విస్తృత స్థాయిలో పాలసీ నిర్ణయించేస్తే, ప్రతి పదంపై చర్చించాల్సిన పరిస్థితి రాదు. అలాకాకుండా ఒక్క పదాన్నో, రెండు పదాలనో ఇలా చర్చించి సాధారణ వాడుకకు వ్యతిరేకంగా నిర్ణయిస్తే ఇక చాలా పదాలకు ఇలా చర్చించుకుని నిర్ణయించాల్సిన పరిస్థితి రావచ్చు. ఆలోచించి చూడండి. --పవన్ సంతోష్ (చర్చ) 11:24, 1 జూన్ 2016 (UTC)
Train-the-Trainer 2016 updates
మార్చుGreetings from CIS-A2K,
List of selected participants for Train-the-Trainer 2016 has been published here.
Following criteria were followed while making the selection:
- On Wiki and Off Wiki participation and contribution.
- Not more than two participants from a language community.
- Application form
- First time participants were given preference over Wikimedians who have already participated.
Due to the incredibly large number of applications that we received it would be difficult for us to write to all applicants individually. Please write to us if there are any queries. --MediaWiki message delivery (చర్చ) 12:25, 5 జూన్ 2016 (UTC)
JavaScript
మార్చు- Nirmos, Rahman has admin rights on this Wikipedia. Rahman, please do the needful here. --రవిచంద్ర (చర్చ) 05:48, 9 జూన్ 2016 (UTC)