వికీపీడియా:సీఐఎస్-ఎ2కె/2017-18 కార్యప్రణాళిక పురోగతి నివేదిక

నాణ్యతాభివృద్ధి - సమాచార సృష్టి

మార్చు

జనగణన సమాచారంతో గ్రామ వ్యాసాల విస్తరణ

మార్చు
 
డిసెంబరు 2017 వరకూ బైట్ల చేరిక ట్రెండ్స్ (2017 చివరి త్రైమాసికంలో భారీ ఎత్తున బైట్ల చేర్పు గమనించవచ్చు)

జనగణన సమాచారంతో గ్రామ వ్యాసాల విస్తరణ ద్వారా 2018 జనవరి నాటికి తెలుగు వికీపీడియన్లు 15 వేల పైచిలుకు గ్రామా వ్యాసాల్లో విద్య, వైద్యం, ఆరోగ్యం, రవాణా, కమ్యూనికేషన్లు, పంటలు - పరిశ్రమలు, తాగునీరు - సాగునీరు వగైరా మౌలిక వసతులు, గ్రామానికి పట్టణాలకు మధ్య దూరం వంటి భౌగోళికాంశాలతో సహా సమాచారాన్ని చేర్చారు. ఇందుకు గాను రూపకల్పన, నిర్వహణ, ప్రాచుర్యం, సమన్వయం వంటి కార్యకలాపాల్లో తెలుగు వికీపీడియన్లతో కలిసి ఎ2కె పనిచేసింది.
తెలుగు వికీపీడియాలో 2006లో బాట్ సహాయంతో పదుల వేల సంఖ్యలో గ్రామాల వ్యాసాలు సృష్టించారు. ప్రధానంగా ఏకవాక్య వ్యాసాలుగా సృష్టి అయిన ఈ వ్యాసాల్లో సమాచారం తక్కువగా ఉన్నా అభివృద్ధి చేయడానికి ప్రాధాన్యత ఇచ్చి విస్తరించే ప్రయత్నాలు చేపట్టారు. 2008లో ఈ గ్రామ వ్యాసాలను సుదీర్ఘమైన ప్రాజెక్టులో భాగంగా వికీపీడియన్లు చర్చల్లో ప్రస్తావించారు. ఆపైన పలు సందర్భాల్లో గ్రామాల వ్యాసాల విస్తరణ తెలుగు వికీపీడియా నాణ్యత, విశ్వసనీయతపై ప్రత్యక్షంగా మంచి ప్రభావాన్ని చూపిస్తుందని పేర్కొన్నారు, అందుకు అనుగుణంగా పనిచేశారు. ఈ నేపథ్యంలో జనగణన సమాచారాన్ని ఉపయోగించి గ్రామాల వ్యాసాలను విస్తరించే ప్రాజెక్టు చేపట్టడం జరిగింది. 2016-17లో పాలసీపరమైన చర్చలు, యాంత్రికానువాద శైలి సరిజేయడం వంటి పనుల్లో పాల్గొనడం, జనగణన సమాచారంతో వికీపీడియా గ్రామాల వ్యాసాలు అభివృద్ధి చేయడంపై కృషిచేసిన పర్యావరణవేత్తలు ప్రొ.మాధవ్ గాడ్గిల్, సుబోధ్ కుల్ కర్ణి వంటివారితో వికీపీడియన్లకు ముఖాముఖి నిర్వహించడం వంటివి ఏ2కె నిర్వహించింది. 2017 ఫిబ్రవరి నుంచి చిత్తూరు జిల్లా గ్రామాల వ్యాసాలపై భాస్కరనాయుడు పనిచేయడం కొనసాగించారు.
2017 అక్టోబరులో ఈ ప్రాజెక్టుపై ఎ2కెతో కలిసి చదువరి పనిచేయడంతో గ్రామవ్యాసాల అభివృద్ధిలో మరో అధ్యాయం ప్రారంభమైంది. పవన్ సంతోష్ రూపకల్పన చేసి సముదాయాన్ని అంగీకరించిన గ్రామ వ్యాసాల నమూనాలో కొద్ది మార్పులుచేర్పులు చేసి, దానిని ఆటోమేషన్ ద్వారా రూపకల్పన చేయగలిగేట్టు చదువరి లాజిక్ మోడల్ రూపకల్పన చేశారు. ఈ లాజిక్ మోడల్ ఆధారంగా కోడింగ్ చేయించుకున్నారు. 2011 జనగణన సమాచారంలోని గ్రామాల పేర్లు, మండలాలు, పట్టణాలు, జిల్లాల పేర్లు, ఉత్పత్తుల పేర్లు ఎక్సెల్ షీట్లలో స్థానికీకరించి ఒక్కో జిల్లాకూ txt ఫైళ్ళలో సమాచారాన్ని వికీకోడింగ్ సహా తయారుచేస్తున్నారు. ఈ టెక్స్ట్ ఫైళ్ళు చదువరి, పవన్ సమన్వయంతో ఒక్కో జిల్లాను ఆసక్తి కలిగిన సభ్యులు - భాస్కరనాయుడు, యర్రా రామారావు, జెవిఆర్కే ప్రసాద్, వెంకటరమణ, తదితరులకు పంపుతూ ఉండగా వారు ఒక్కో వ్యాసం పరిశీలించి తెలుగు వికీపీడియాలో సంబంధిత గ్రామ వ్యాసాల్లో మానవీయంగా ప్రచురిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న గ్రామాల వ్యాసాల్లో దాదాపు మూడోవంతు గ్రామాల వ్యాసాల్లో ఇలాంటి సమాచారం ప్రచురించే పని పూర్తికావస్తోంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గ్రామాల వ్యాసాలు 2017 నాటికి తెలుగు వికీపీడియాలోని మొత్తం వ్యాసాల్లో 41 శాతంగా ఉన్నాయి. గ్రామాల వ్యాసాల్లో సమాచార లేమి, పాఠకులకు తెలుగు వికీపీడియా నాణ్యతపై తక్కువ చూపుకు కారణమవుతుందని గతంలో తెలుగు వికీపీడియన్లు పలుమార్లు అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టు వల్ల తెలుగు వికీపీడియాలో గ్రామ వ్యాసాల్లో సమాచారం పెరగడం మాత్రమే కాక తెలుగు వికీపీడియా నాణ్యత, భవిష్యత్తులో తెలుగు వికీపీడియాపై పాఠకుల అభిప్రాయంలో మెరుగుదలకు కూడా కారణమవుతుంది.

ప్రాచుర్యం పెంపు

మార్చు

సామాజిక మాధ్యమాల మార్గదర్శకాల ఏర్పాటు

మార్చు

సామాజిక మాధ్యమాల్లో తెలుగు వికీపీడియాకు పలు పేజీలు, గ్రూపులు ఉన్నాయి. వీటిలో ఒక ఖాతా తెలుగు వికీపీడియా సముదాయ సభ్యులు పలువురు నిర్వహిస్తూండడమే కాక 7వేలకు పైగా ఫేస్ బుక్ వినియోగదారులు అనుసరిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఖాతాల నిర్వహణలో మరింత మెరుగుదల, విస్తృతమైన తెలుగు సముదాయాన్ని చేరుకునేందుకు దీనిని ఒక మార్గంగా మరింత సమర్థంగా ఉపయోగించుకునేందుకు సామాజిక మాధ్యమాలపై వ్యూహాలు, మార్గదర్శకాల గురించి చర్చ నిర్వహించారు. మార్గదర్శకాల రూపకల్పన విషయంలో తెలుగు వికీపీడియా సముదాయ సభ్యులకు ఎ2కె సహకరించింది. తెలుగు వికీపీడియా రచ్చబండలో జరిగిన చర్చల్లో ప్రతిపాదనలను వికీపీడియన్లు చర్చించి, మరికొన్ని అంశాలు ప్రతిపాదించి మార్గదర్శకాలు, వ్యూహాలు రూపకల్పన చేశారు. మార్గదర్శకాలు, వ్యూహాల అమలు ఇంకా జరగాల్సి ఉండగా, రానున్న అర్థభాగంలో సీఐఎస్-ఎ2కె అమలులో సముదాయానికి సహకారాన్ని అందించనుంది.

తెలుగు వికీపీడియాలోని సమాచారం, దాని నాణ్యత, వైవిధ్యం, సముదాయం వంటివాటిని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం కలిపించడం జరుగుతుంది. అందులో భాగంగా, సామాజిక మాధ్యమాల ఎదుర్కొంటున్న సమస్యలు మరియు వాటి పరిష్కారాల గురించి తెలుగు వికీపీడియా సామాజిక వేదికల మార్గదర్శకాలు అనే అంశంపై పాలసీ చర్చ జరిగింది. సామాజిక వేదికల్లో వికీమీడియా ప్రచారం ఏలా ఉండాలి, ఎలాంటి పోస్టులు చేయాలి, ఎవరూ ఆ బాధ్యతను తీసుకోవాలి వంటివి ఈ చర్చలో ధృవీకరించబడ్డాయి. అంతేకాకుండా, వికీమీడియా ప్రచారం విషయంలో కొన్ని నియమ నిబంధలను కూడా రూపొందించుకోవడం జరిగింది. దీనివలన, ఖచ్చితమైన మరియు అధికారిక సమాచారం మాత్రమే పోస్టుచేయడం జరుగుతుంది.

సముదాయం నైపుణ్యాల అభివృద్ధి

మార్చు

తెలుగు వికీసోర్సు కార్యశాల

మార్చు
 
తెలుగు వికీసోర్సు కార్యశాల

తెలుగు వికీసోర్సు కార్యశాల హైదరాబాదులో 2017 జూలై 22, 23 తేదీల్లో జరిగింది. చాలామంది వికీపీడియన్లు వికీసోర్సు మీద ఆసక్తి ఉన్నా మొత్తం ప్రాజెక్టులో పనిచేయడం గురించిన అవగాహన లేకపోవడం, వికీసోర్సులో పనిచేస్తున్న సభ్యుల్లో కూడా కొన్ని అవసరమైన ఉపకరణాలు, సాంకేతికాంశాలు తెలుసుకోవాల్సిన ఆసక్తి ఉండడంతోనూ వికీసోర్సు కార్యశాల వికీసోర్సులో పుస్తకం పూర్తిచేసే విధానం (పీడీఎఫ్ కామన్స్ లో అప్లోడ్ చేయడం మొదలు పుస్తకాన్ని యూనీకోడ్ ఇ-పుస్తకంగా మలిచేవరకూ), ఓసీఆర్ వంటి అవసరమైన ఉపకరణాల గురించి తెలపడంపై దృష్టిపెట్టింది. కాపీహక్కులు, క్రియేటివ్ కామన్స్ లైసెన్సుల గురించి ఈ కార్యశాల అవగాహన కలిగించింది. ప్రస్తుతం వికీసోర్సులో రాస్తున్నవారు ఆసక్తిగా ఉపకరణాలు, వివిధ డిజిటైజేషన్ దశలు వంటివి నేర్చుకున్నారు. కార్యక్రమానికి ఎ2కె ఆహ్వానించిన ఇద్దరు కొత్త సభ్యులూ క్రమంగా వికీసోర్సులో అత్యంత చురుకుగా ఉంటూ చక్కని కృషి సాగిస్తున్నారు.

క్రమం తప్పకుండా చాన్నాళ్ళ నుంచి నేను వికీసోర్సులో కృషిచేస్తున్నాను. ఈ కార్యక్రమంలో తెలుగు వికీసోర్సు పనికి ఉపకరించే పుస్తకం సూచిక తయారీ, ఓసీఆర్ వంటి టెక్నిక్స్ నేర్చుకున్నాను. తద్వారా ఈ కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉంది. కార్యక్రమంలో నేర్పించేవారు, నేర్చుకునేవారు ఇద్దరూ తెలుగు వారే కావడం, సెషన్లు తెలుగులోనే జరగడం వల్ల నేను తేలికగా అన్నీ నేర్చుకోగలిగాను.

వికీడేటా కార్యశాల

మార్చు

ఎ2కె అసఫ్ బార్తోవ్ వికీడేటా కార్యశాల నిర్వహణలో సహకరించింది. కార్యశాల ఇప్పటికే చురుకుగా ఉన్న వికీపీడియన్లకు నిర్వహించినది. ఎ2కె హైదరాబాదులోనూ, చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ కార్యక్రమానికి హాజరై, నేర్చుకునే ఆసక్తి ఉన్న వికీపీడియన్లతో సమన్వయం చేసింది. కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన ఇతర వికీపీడియన్లలో కొందరికి ఎ2కె కార్యశాలలో నేర్పిన అంశాలు నేర్పించడంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గ్రామాల ఐటంల అభివృద్ధికి ఉపయోగపడుతోంఇ.

వికీపీడియా విద్యాకార్యక్రమం రివ్యూ

మార్చు

10 డిసెంబరు 2017న వికీమీడియా ఫౌండేషన్ వికీపీడియా విద్యాకార్యక్రమం ప్రోగ్రాం ఆఫీసర్ నికోల్ సాడ్ ఆంధ్ర లొయోలా కళాశాల సందర్శన, విద్యా కార్యక్రమం రివ్యూ ఎ2కె నిర్వహించింది. గుంటూరులో వికీమీడియన్, వికీమీడియా ఇండియా కార్యనిర్వాహక సభ్యుడు కృష్ణచైతన్య వెలగ పలు కార్యశాలలు, వికీపీడియా కార్యకలాపాలు నిర్వహిస్తూన్న వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీవీఐటీ) సంస్థను కూడా ఈ సందర్శనలో భాగంగా చేర్చడం జరిగింది. ఆంధ్ర లొయోలా కళాశాలలో ఇప్పటివరకూ జరిగిన కార్యకలాపాలు, భవిష్యత్తులో ఈ కార్యక్రమాలను మరింత విస్తృతపరచడానికి చేపట్టగల అవకాశాల గురించి యాజమాన్యం, ఉపాధ్యాయులు, సీఐఎస్-ఎ2కెల నడుమ ఈ సందర్భంగా ఫలప్రదమైన చర్చ జరిగింది. నికోల్, కృష్ణచైతన్య, స్థానిక వికీపీడియన్ మీనా గాయత్రి, ఎ2కె బృందం ఇప్పటివరకూ విద్యాకార్యక్రమంలో పాల్గొన్న, భవిష్యత్తులో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతన్న విద్యార్థులతో సంభాషించారు. ఈ సందర్భంగా నికోల్ వికీపీడియా విద్యా కార్యక్రమం సంప్రదాయ విద్యావిధానంలో ఎలాంటి మార్పులు తీసుకురాగలదన్న అంశంపై ప్రసంగించారు. ఆపైన వీవీఐటీ సంస్థలో యాజమాన్యంతోనూ, విద్యార్థులతోనూ నికోల్ సాద్, కృష్ణచైతన్య, ఎ2కె సభ్యులు చర్చలు, సంభాషణ జరిపారు.

కొత్తవాడుకరుల పెంపు-అభివృద్ధి

మార్చు
 
శివకుమార్ 100 వికీకామన్స్ డేస్ ఫోటోల్లో కొన్ని
 
ఆదిత్య పకిడె 100 వికీ కామన్స్ డేస్ ఫోటోల్లో కొన్ని
శివకుమార్ 100 కామన్స్ డేస్‌లో 50రోజులు పూర్తిచేసినందుకు ప్రోత్సహించేందుకు చేసిన వీడియో

కొత్తవాడుకరులు నిలిచి కొనసాగేందుకు ఎ2కె, ఆసక్తి కలిగిన సముదాయాలతో పనిచేయడం, కొత్త వికీపీడియన్లను వ్యక్తిగతంగా శిక్షణనిచ్చింది. ఇందులో భాగంగా తెలుగు పద్య సాహిత్యం పంచుకుంటూ, చర్చించుకుంటూ, వ్యాఖ్యానిస్తూ మూడేళ్ళ నుంచి సాగుతున్న పద్య సౌందర్యం వాట్సాప్ సముదాయం నుంచి ఇద్దరిని వికీసోర్సు కార్యశాలకు ఆహ్వానించాం. ఎ2కె వారి కృషిని అనుసరిస్తూ, వారికి వ్యక్తిగతంగా శిక్షణనిచ్చింది, దానితో వారు తెలుగు వికీసోర్సులో కృషిచేయడం అప్పటినుంచి నెలల పాటు కొనసాగించారు.
A2K encouraged users like Shiv's fotographia and Aditya pakide to take up #100WikiCommonsDays challenge, where Aditya pakide signed up for Wikipedia after individual training session. Used challenge as an opportunity to get into continous engagement with them and followed-up with their quiries and encouraged him by publishing videos with their photos in Social Media and by notifying their work in Telugu Wikipedia Village pump for improving utilization of their work in Wikipedia articles. This resulted in retention of the users and hundreds of quality pictures to Commons. Currently out of 180+ pictures uploaded by these two users 29 are being used in articles of several Wikipedias including Telugu Wikipedia.[1]

User File Used in Day
Adbh266   English Wikipedia
Adbh266   Russian Wikinews
Adbh266   Telugu, English Wikipedias
Adbh266   Telugu Wikipedia
Shiv's fotographia   English Wikipedia
Adbh266   Telugu Wikipedia
Shiv's fotographia   Dutch Wikipedia,
English Wikipedia
Esparantho Wikipedia
Gujarathi Wikipedia
Hindi Wikipedia
Shiv's fotographia   vi Wikipedia
Adbh266   Telugu Wikipedia
Adbh266   Telugu and English Wikipedia
Shiv's fotographia   vi Wikipedia
Adbh266   Telugu Wikipedia

Digital Telugu Conference and other Government collaborations

మార్చు

Telugu Wikimedia Community participated in the conference "Digital Telugu" which was conducted by IT Department of Telangana Government in the wake of World Telugu Conference 2017. A2K supported community efforts to voice for policy changes and other efforts needed in order to improve the state of free knowledge in Telugu, in the conference. Wikipedians presented Telugu Wikipedia and Free Knowledge in Telugu under the context of improving the state of Telugu in digital world. This will be helpful to get cross-collaboration between other sections of Digital Telugu and Telugu Wikimedia movement.
In order to make the community more sustainable and get a wide impact, A2K is making efforts to work with Government departments and policy level changes to improve the condition of Open & Free knowledge in Telugu. After several discussions with the department and Community, A2K entered into a MoU with Digital Media Wing, IT Department, Telangana. with the objective to relicense photos archive of the department into CC-BY-SA license and upload encyclopedic and educational content from it into Commons. This MoU also aims to improve awareness about Free licenses in PROs and other such employees in various departments. Activities related to the MoU will get started in upcoming months.

Upcoming activities

మార్చు
  • Op-eds and features in print and digital media: Due to volunteer efforts of some Wikimedians, Telugu Wikipedia is getting featured in major media in the form of news. A2K is planning to work with interested volunteers and media houses (print, media and online portals) to publish op-eds, features to improve understanding about Telugu Wikipedia and Wikimedia movement.
  • Creating Video Resources: In upcoming months, A2K will work on creating videos that explains how to edit Wikipedia and why to edit Wikipedia in accordance with the Wiki Project that aims to create complete video guide. Each of these videos duration will be few minutes to be easily published and shared in various social media platforms.
  • TTT-session for Telugu Wikipedians: During late February or early March, an intense training session will be conducted to groom community leaders. A2K will encourage them to come up with the existing difficulties and requests related to technical aspects (Technical requests).
  • Wikipedia Education Program: During November and December 2017, in Andhra Loyola College A2K conducted awareness session to Andhra Loyola College students and a review meeting. Workshop and follow-up activities to student Wikipedians started in January 2018, which will be taken forward in upcoming months.
  • A2K worked in an informal collaboration with Telangana language & culture department to provide free space for Wikimedians to conduct Hyderabad Monthly meetups and other outreach activities.
  • Diversifying community by conducting training sessions in the places where Wikipedia community has not tapped earlier and to the sections of society where content and participation is too less in Wikipedia (ex: Women)
  • As the part of Relicensing into CC-BY-SA and digitizations, A2K worked on getting more images into commons by convincing Photographers, ornithologists, historians who has large digital archives to release their work into Commons. Also could get into an MoU with Telangana Government IT Department (Digital Media) to relicense encyclopedic photos of Government departments into CC-BY-SA License. Along with further activities, A2K will work with authors and publishers to relicense books into CC-BY-SA license.

Media Mentions

మార్చు
  1. https://outreachdashboard.wmflabs.org/courses/CIS-A2K/Telugu_New_Users_in_Commons/home